విద్యపై ఖర్చు సంక్షేమం కాదు.. దేశాభివృద్ధికి పెట్టుబడి

-విద్యారంగం అభివృద్ధికి యజ్ఞంలా సీఎం వైయ‌స్‌ జగన్‌ కృషి చేస్తున్నారు
-ప్రపంచంలో మన పిల్లలు ముందుడుగు వేసేలా విద్యారంగంలో సంస్కరణల్ని జగన్‌ తెచ్చారు
-నాడు-నేడుతో ప్రభుత్వ స్కూల్స్‌ రూపురేఖలు మారుస్తున్నాం
– జగన్‌ మోహన్‌ రెడ్డి నేతృత్వంలో విద్యారంగంలో సమూల మార్పులు
-కార్పొరేట్‌కు ధీటుగా ప్రభుత్వ స్కూల్స్‌ రూపురేఖలు మారాయ్‌
-విద్యారంగం బలోపేతమవుతుంటే ఓర్వలేక చంద్రబాబు చౌకబారు విమర్శలు
-విద్యా సంస్కరణలపై ప్రతిపక్షాల హేళన వారి అవగాహనలేమికి నిదర్శనం
-ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం. ఉపాధ్యాయుల సమస్యలను సానుభూతితో పరిష్కరిస్తుంది
-చదువుతోనే సమాజ అభివృద్ధి, ఆర్థికాభివృద్ధి సాధ్యం
-మంత్రి మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ‌

1. ప్లీనరీకి విచ్చేసిన పార్టీ అధ్యక్షులు, సీఎం వైయస్‌ జగన్ మోహన్‌ రెడ్డికి, విజయమ్మకి, వేదికపై పెద్దలందరికీ నమస్కారాలు, శుభాకాంక్షలను మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా విద్యపై తీర్మానాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్య మీద ప్రభుత్వం పెట్టే ఖర్చు సంక్షేమం కోసం కాదని దేశాభివృద్ధికి పెట్టుబడిగా సీఎం వైయస్‌ జగన్‌ నేతృత్వంలో ఖర్చు చేస్తున్నామని బొత్స తెలిపారు. స్వర్గీయ వైయస్‌ఆర్‌ ఆలోచనలు, స్ఫూర్తితో ఆంధ్రలో చదువుకునే విద్యార్థి మన రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాకుండా ప్రపంచ దేశాలతో పోటీ పడేలా జగన్‌ మోహన్‌ రెడ్డి నేతృత్వంలో విద్యా యజ్ఞాన్ని చేస్తున్నారు. విద్యారంగం అభివృద్ధికి సీఎం వైయ‌స్‌ జగన్‌ యజ్ఞంలా పనిచేస్తున్నారు.

విద్యా రంగంలో సంస్కరణలపై ప్రతిపక్షాల హేళన హేయం
2. విద్యా సంస్కరణలపై సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేస్తున్న కార్యక్రమాలపై ప్రతిపక్షాలు హేళన చేయటంపై మంత్రి బొత్స మండిపడ్డారు. ఎన్ని అవహేళనలు చేసినా సీఎం వైయస్‌ జగన్‌ పట్టుదలతో జాతీయ నూతన విద్యావిధానం అనుగుణంగా కార్యక్రమాలను ఈ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ మాటను చెప్పటానికి విద్యా శాఖ మంత్రిగా గర్వపడుతున్నాను. విద్యా రంగంలోని సంస్కరణలపై చంద్రబాబు, అవగాహన లేని నాయకులు విమర్శలు చేస్తున్నారు. కేజీ, ఫస్ట్‌ స్టాండర్డ్, సెండర్‌ స్టాండర్డ్‌ అని ఎలా ప్రోత్సాహించారో.. నేడు ప్రభుత్వం కార్పొరేటుకు ధీటుగా విద్యారంగంలో మార్పులు తీసుకువచ్చింది.
ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులు చేస్తున్నాం.

ప్రతి సబ్జెక్ట్‌కూ ఓ టీచర్‌
3. జాతీయ విద్యావిధానంతో తీసుకొచ్చిన మార్పులతో పాటు సీఎం వైయస్‌ జగన్‌ ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో సమూలంగా మార్పులు చేస్తున్నాం. ఈ విషయాన్ని రాష్ట్రంలోని విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేస్తున్నాము. విద్యార్థులకు ప్రతి సబ్జెక్ట్‌కు ఒక టీచర్‌ను పెట్టి వారికి తర్ఫీదు ఇస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ సిలబస్‌ను రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెడితే ప్రతిపక్ష నాయకులు హేళన చేస్తున్నారు. ఒక సంస్కరణ తీసుకొస్తే దాని ఫలాలు వెంటనే రావు. ఐదేళ్ల తర్వాత వాటి ఫలితాలు వస్తాయి. ఏపీలో విద్యార్థులు ఏ రాష్ట్రం, ఏ దేశం వెళ్లినా గర్వంగా తలెత్తుకొని తిరిగేటట్టు తీర్చిదిద్దాలని ప్రభుత్వ సంకల్పం అని బొత్స స్పష్టం చేశారు.

విద్యా రంగంలో సంస్కరణల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు
గతంలో కార్పొరేట్‌ స్కూల్స్‌ను ప్రోత్సహిస్తే వాటికి ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్ని తీర్చిదిద్దుతున్నాం
4. విద్యా రంగంలో ఎన్నో సంస్కరణలు కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నాం. గత ప్రభుత్వాలు ప్రైవేటు కళాశాలల్ని, స్కూల్స్‌ను ప్రోత్సహించారు. పరీక్షలను చూసి రాయించారు. పాస్‌ చేయించి డబ్బులు దోచుకున్నారు. తద్వారా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. నాసిరకమైన విద్యను అందించారు. దీనివల్ల మన విద్యార్థులకు పోటీ ప్రపంచంలో ఉద్యోగాలు దొరకని స్థితిని తెచ్చారు. ఇవాళ అలా కాకుండా ఒక కుటుంబంలో విద్యార్థికి మంచి విద్యో అందితే ఆ కుటుంబ ఆర్థిక స్థితిగతులు మారిపోతాయి. ప్రతి ఇంటిలో వారు ఉన్నత విద్య చదివి విదేశాల్లో ఉద్యోగాలు చేసే పరిస్థితులు రావాలని సీఎం విద్యలో ఎన్నో మంచి కార్యక్రమాలు ప్రవేశపెట్టారు.

ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం. ఉపాధ్యాయుల సమస్యలను సానుభూతితో పరిష్కరిస్తుంది
5. ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం రావాలని ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు కోరుకున్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు కలిసి దేశంలో మేటి రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి సహకరించాలని బొత్స సత్యనారాయణ కోరారు. ఉపాధ్యాయులకు ఏమైనా సమస్యలు ఉంటే ఈ ప్రభుత్వం తప్పకుండా సానుభూతితో పరిశీలిస్తుంది.

విద్యపై తీర్మానాన్ని ప్రవేశపెట్టిన బొత్స సత్యానారాయణ
చదువుతోనే సమాజ పురోభివృద్ధి, ఆర్థికాభివృద్ధి సాధ్యం
6.ఈ సందర్భంగా మంచి విద్య్తోనే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని విద్యపై తీర్మానాన్ని బొత్స సత్యనారాయణ ప్రవేశపెట్టారు. ప్రపంచ వ్యాప్తంగా పరిశీలిస్తే విద్య ఎక్కడ అభివృద్ధి చెందుతుందో అక్కడ ఆర్థిక వ్యవస్థ ముందడుగు వేస్తుంది. అంతేకాకుండా సమాజంలో చదువు అనేది జీవన భద్రతగా ఏ వ్యక్తి దొంగిలించలేని ఆస్తితో పాటు గౌరవాన్ని కల్పిస్తుంది. ఈ పరిస్థితుల్లో విద్యా రంగంపై సీఎం వైయస్‌ జగన్ .. లోతుగా అధ్యయనం చేశారు. రాష్ట్ర పురోభివృద్ధికి, వికాసానికి విద్యే ప్రధాన మూలం తప్ప మరొకటి కాదని ప్రగాఢ నిర్ణయానికి వచ్చారు. రాష్ట్ర పరిపాలన పగ్గాలను వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన మొదటి రోజు నుంచే విద్యా సంస్కరణలపై దృష్టి సారించారు. ఈనాడు ప్రైవేటు స్కూల్స్‌కు పోటీగా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి పరచటం జరిగింది. పేద వర్గాల తమ పిల్లల్ని స్కూల్స్‌కు పంపేలా ప్రోత్సహించటానికి అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించారు. తర్వాత విద్యాదీవెన, వసతి దీవెన, జగనన్న గోరుముద్ద పథకాల ద్వారా బడికి పిల్లలు వెళ్లటం గణనీయంగా పెరిగింది. ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడం ద్వారా ప్రపంచ దేశాల్లో మన విద్యార్థినీ విద్యార్థులు పోటీ ప్రపంచంలో నెగ్గుకురాగల ఆత్మవిశ్వాసం కల్పించారు. ఈ పథకాలు రాష్ట్రంలో అక్షరాస్యతను గణనీయంగా పెంచింది. అంతేకాకుండా.. స్కూల్‌కు వెళ్లే విద్యార్థుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. తద్వారా విద్యార్థుల ఆత్మ విశ్వాసం పెరిగింది. తండ్రిలాగా.. మేనమామ లాగా పిల్లల భవిష్యత్‌కు సీఎం వైయస్‌ జగన్‌ భరోసా కల్పించారని విద్యపై తీర్మానాన్ని బొత్స సత్యనారాయణ చదివారు.
చివరగా.. విద్యా రంగంపై సీఎం వైయస్‌ జగన్ మోహన్‌ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలపై సభ కృతజ్ఞతలు తెలియజేస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రసంగాన్ని ముగించారు.

Leave a Reply