నా రక్తం-వెంట్రుకలు ఇస్తా..మరి రాహుల్ గాంధీ ఇస్తాడా?

– తెలంగాణకు 2వేల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి
మీడియాతో కేటీఆర్ చిట్‌చాట్
కేటీఆర్ ఏమన్నారో ఆయన మాటల్లోనే..మేము ప్రభుత్వంలో ఉన్నాము. సంక్షేమంలో మేము నిమగ్నమయ్యాము.మేము, మా ఎమ్మెల్యేలు అభివృద్ధి పనుల్లో బిజీగా ఉన్నాము.తెలంగాణకు 2 వేల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయని వెల్లడించారు. కేసీఆర్ అభివృద్ధి పథకాలు చూసుకుంటూ పాదయాత్రలు చేస్తున్నారు. నిన్న గాక మొన్న వచ్చిన ఒకాయన మార్కెట్ లో నేనున్నాను అని చూపుకుంటున్నారు. హుజురాబాద్ లో టీఆరెస్ కచ్చితంగా గెలుస్తుంది. జానారెడ్డి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి- చిన్న పిలగాడు ఓడించాడు. ప్రజలకు టీఆరెస్ పై నమ్మకం ఉంది.
గజ్వేల్ లో కాకుండా రాష్ట్రంలో ఎక్కడైనా సభలు పెట్టుకోవచ్చు. హుజురాబాద్ లో కాంగ్రెస్ కి డిపాజిట్లు వస్తాయా? కొత్తగా కాంగ్రేస్ లో రియలేస్టేట్ భూమ్ వచ్చింది. రేపు భవిష్యత్ లో పీసీసీ కూడా అమ్ముకుంటారు. 50 కోట్లు పెట్టి ఠాకూర్ పీసీసీ అమ్మాడు అని అప్పట్లో వాళ్లే విమర్శలు చేసుకున్నారు. వంటేరు ప్రతాప్ రెడ్డి అప్పట్లో ఇంతకంటే గొప్పగా సభలు పెట్టారు. ప్రజలు చాలా చైతన్యవంతులు ఎవరికి ఓట్లు వెయ్యలో వాళ్లకు తెలుసు. తెలంగాణ లో MIM కి ఎవ్వరూ భయపడటం లేదు- బీజేపీ భయపడుతోంది. బీజేపీ ఆదిలాబాద్ కి ట్రైబెల్ యూనివర్సిటీ ఇస్తామన్నారు ఇచ్చారా? సాయుధ పోరాటం చేసిన నేతలకు పెన్షన్స్ ఇవ్వమంటే కేంద్రం ఇవ్వడం లేదు!. అమిత్ షా రాష్ట్రానికి వచ్చి తెలంగాణ కేంద్రం ఇచ్చిన ప్రాజెక్టు ఒక్క దాని గురించి అయినా చెప్పారా? ఎంపిలుగా గెలిచి బీజేపీ నేతలు రాష్ట్రానికి ఎమ్ చేశారు?
ఢిల్లీ పార్టీలు సిల్లి పాలిటిక్స్ చేస్తున్నాయి. కొత్తగా పుట్టుకొచ్చిన కొన్ని పార్టీలు ఎందుకు పుట్టాయో ప్రజలకు తెలుసు!. కొత్త పార్టీలకు కేసీఆర్ మాత్రమే ఎందుకు విమర్శలు చేస్తున్నాయి- ఢిల్లీ పార్టీల పై ఎందుకు మాట్లాడరు? కేంద్రం ఒక్క మెడికల్ కాలేజీలు- విద్యాలయాలు- ఇవ్వకపోతే ప్రవీణ్ కుమార్ ఎందుకు మాట్లాడటం లేదు? కాంగ్రెస్- బీజేపీపై షర్మిల- ప్రవీణ్ కుమార్ ఎందుకు మాట్లాడటం లేదు? టీఆరెస్ ఓటును చీల్చడానికి ఉద్భవించిన పార్టీలు షర్మిల- ప్రవీణ్ కుమార్.
తెలంగాణలో టీఆరెస్ ప్రజలకు లైఫ్ లైన్ ఆఫ్ తెలంగాణ!
సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకుంటేనే- దేశంలో ఎక్కడా లేని ప్రథకాలు అమలు అవుతున్నాయా? కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకుంటే తెలంగాణ కుపెట్టుబడులు- తెలంగాణ అభివృద్ధి అగుతుందా? ప్రతిపక్షాలు చిల్లర మాటలు మాట్లాడుతున్నారు!
ఎవ్వరిని వదిలిపెట్టం. పెయింటింగ్ వేసుకునే వ్యక్తికి జూబ్లీహిల్స్ లో నాలుగు ఇండ్లు ఎట్లా వచ్చాయి? అందరి భాగోతం మా దగ్గర ఉంది- అన్ని బయట పెడుతాం. కాంగ్రేస్ కి దమ్ము ఉంటే హుజురాబాద్ లో డిపాజిట్లు వస్తాయా? పీసీసీ కొనుకున్నోడు- రేపు ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకోడా?
రాష్ట్రం గురించి ఒక ఎంపీ మాట్లాడితే అతన్ని గాడిద అంటావా? దళితబంధు అనేది.1990లోనే సిద్దిపేటలో ఉన్నది. కాంగ్రేస్ 60 ఏళ్ల రాజకీయ పాలనలో దళితులకు దళితబంధు పథకం లాంటిది ఎప్పుడైనా పెట్టారా? బీసీ బంధు కావాలంటున్న బండి సంజయ్ దేశంలో ఉన్న ప్రతి బీసీలకు- బలహీన వర్గాలకు లక్షలు లక్షలు పంచాలని మోడీకి చెప్పండి. మతం పేరుతో చిల్లర డ్రామాలు మాకు రావు.
నా రక్తం- వెంట్రుకలు ఇస్తా … మరి రాహుల్ గాంధీ ఇస్తాడా?
సంచలనం సృష్టిస్తున్న సినీ తారల డ్రగ్స్ కేసుపై మంత్రి, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. కాంగ్రెస్ యువనేత రాహుల్‌కు ఆసక్తికరమైన చేశారు. తనకు,డ్రగ్స్ కేసుకు ఏం సంబంధం అని ప్రశ్నించిన కేటీఆర్.. తాను రక్త పరీక్షలతో సహా అన్నింటికీ సిద్ధమని, మరి రాహుల్‌గాంధీ కూడా అందుకు సిద్ధమేనా అని సవాల్ విసిరారు.ఎవరో ఏదో చేస్తే నాకేం సంబంధం- ed కి లెటర్ ఇచ్చిన వాడు బఫున్. ఇక నుంచి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కేసులు పెడుతాం- అవసరం అయితే రాజద్రోహం కేసులు కూడా పెడుతాం. అడ్రెస్ లేని వ్యక్తులు కేసీఆర్ ని తిడితే ఉరుకోము. ఉద్యమంలో కేసీఆర్ తిడితే ఆనాడు ఉద్వేగం ఉంది. ఇవ్వాళ వీళ్లకు ఎమ్ రోగం? సింగరేణి బాలిక ఘటన పై చట్టం తనపని తాను చేసుకుంది. దిశ ఘటన పై దేశం హర్షించింది- నాకు కూతురు ఉంది కన్నీళ్లు పెట్టుకున్నాం. మహారాష్ట్ర ప్రభుత్వంను ఇన్సపరేషన్ గా తీసుకుంటాం. ఒకప్పుడు సున్నాలు వేసిన వ్యక్తి- ఇవ్వాళ కన్నాలు వేస్తున్నట్లు బయట ప్రచారం జరుగుతోంది. క్రిమినల్స్ కు ఛార్జిషీట్స్ మాత్రమే తెలుసు! రోజు కోర్టుల చుట్టూ తిరిగే వాళ్ళు మాత్రమే చార్జిషీట్లు అంటరు. ఈటెల రాజేందర్ జానారెడ్డి కంటే పెద్దవాడు కాదు కదా!. బండి సంజయ్ కు ఓట్లు వేసిన ప్రజలు బాధపడుతున్నారు.

Leave a Reply