విగ్రహ ఆగ్రహం

ఎవరైనా కోపం వస్తే ఎదుటివారిని రెండు దెబ్బలేస్తారు. లేకపోతే తిట్టిపోసి కోపం చల్లార్చుకుంటారు. అదీకాపోతే అతడి గురించి కనిపించిన వాళ్లందరికీ చెబుతారు. ఒకవేళ వాళ్లు మరీ మూర్ఖులయితే .. కోపం చల్లార్చుకునేందుకు ఎదుటి వారి ఆస్తులు ధ్వంసం చేస్తారు. అదీ సరిపోకపోతే చివరాఖరకు హత్యాయత్నం వరకూ వెళతారు. ఇది మానవ నైజం. కానీ పార్వతీపురం మన్యం జిల్లా కృష్ణపల్లిలో ఓ యువకుడు, ఠీవిగా నిలబడ్డ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి తాళ్లు వేసి మరీ కిందకు

లాగాడు. అంతటితో ఊరుకోకుండా.. ఆ విగ్రహాన్ని వీధుల్లోకి లాగుతూ ఊరేగింపుగా తీసుకువెళ్లాడు. ఈలోగా ఆ సమాచారం తెలిసిన వైసీపీ నేతలు అతగాడితో ఘర్షణకు దిగారు. తర్వాత గ్రామ పెద్దలు రంగంలోకి దిగి అందరినీ శాంతింపచేశారట. ఇంతకూ అతగాడికి ఇన్నేళ్ల తర్వాత వైఎస్ విగ్రహంపై ఎందుకు ఆగ్రహం కలిగిందో? ఏదేమైనా.. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌మీడియలో తెగ వైరల్ అవుతోంది.