-సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర
సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై బైండోవర్ కేసులు నమోదు చేయాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర పోలీసు అధికారులను ఆదేశించారు. సైబరాబాద్‌లోని పోలీస్ కమిషనరేట్‌లో సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి తో సమావేశం ఏర్పాటు చేసి వారికి
కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగినది. సమావేశంలో సైబరాబాద్ పోలీసు కమీషనర్ మాట్లాడుతూ.. వివిధ నేర కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై బైండ్‌ఓవర్ కేసులు నమోదు చేశామని తెలిపారు. బైండ్‌ఓవర్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై రూ.లక్ష జరిమానా, ఆరు నెలల జైలుశిక్షతో పాటు మళ్లీ బైండ్ ఓవర్ కేసులు నమోదు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో క్రైమ్స్ డీసీపీ కల్మేశ్వర్ సింగన్వార్, ఏడీసీపీ నరసింహా రెడ్డి, ఏసిపిలు రవిచంద్ర , శ్యామ్ బాబు, ఇన్ స్పెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.