Suryaa.co.in

Telangana

ప్రజా పాలన కాదు.. రౌడీ రాజ్యం

– కేటీఆర్ కాన్వాయ్ పై దాడిని ఖండించిన
– కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవి కుమార్ గౌడ్

హైదరాబాద్: రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజాపాలన కాదు.. రౌడీ రాజ్యం నడుస్తున్నదని తెలంగాణ రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవి కుమార్ గౌడ్ అన్నారు. మూసీ పరివాహాక ప్రాంతాల్లో పర్యటిస్తున్న కేటీఆర్ కాన్వాయ్ పై కాంగ్రెస్ గుండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు. ప్రజల హక్కులు పూర్తిగా కాలరాసి.. హైడ్రా, మూసీ నది సుందరీకరణ పేరిట లక్షలాది మంది పేద, మధ్య తరగతి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

LEAVE A RESPONSE