కల్లా కపటం తెలియని రైతులపై రాజధాని కుట్రలెందుకు?
రాజధాని కోసం ప్రాణ నినాదం చేస్తున్న అన్నదాతలకు అండగా నిలుద్దాం
– అభినవ తుగ్లక్ తో అమరావతి రైతుల పోరాటం అజరామరం
పంట పొలాలను పసిపాపల్లా చూసుకుంటూ..కుటుంబ కోసం అహర్నిశలు పని చేయడమే తప్ప ఆ తల్లులు ఏ రోజు ఊరు దాటింది లేదు..
రాష్ట్రానికి మేలు జరుగుతుందంటే నమ్మి మనస్ఫూర్తిగా బంగారం పండే భూములను ప్రభుత్వానికి ఇచ్చారు కానీ ఆ అన్నదాతలకు ఏ కల్లాకపటం తెలియదు..
నమ్మకద్రోహం, అణచివేత
అరాచకం, అధికారమదంతో
కీచక రాజు చేసే నీచ రాజకీయాలు వాళ్ళు కలలో కూడా ఊహించలేదు..
బయపెడితే, బాధపెడితే ఆగిపోవడానికి అణగిపోవడానికి వాళ్ళు అల్పులు కాదు..
అన్నం పెట్టే రైతు బిడ్డలు, ఆదిపరాశక్తి అవతారాలు..
ఎన్ని ఆటంకాలు ఎదురైనా..
ఎన్ని బూటు కాలి దెబ్బలు తిన్నా..
ఎన్ని అవమానాలు ఎదురైనా..
తమ భూములు పాడుచేస్తున్న నయవంచకులతో గత 1500 రోజులుగా పోరాడుతూనే ఉన్నారు..
అంతిమ విజయానికి కేవలం కొన్ని రోజుల దూరంలో ఉన్నారు…
తెలుగు ప్రజల రాజధాని కోసం అభినవతుగ్లక్ తో పోరాటం చేస్తున్న రైతుసోదరులకు, మాతృమూర్తులకు…
మీ పోరాటానికి మీ దృఢ సంకల్పానికి శతకోటివందనాలు…
సత్యమేవ జయతే !!

(బిజెపి జాతీయ కార్యదర్శి)