-
ప్రజల కోసమే… ప్రజా సమస్యల పరిష్కార వేదిక
-
కొన్నింటిని స్పాట్‌లోనే పరిష్కారం
-
మరికొన్నింటిని పరిశీలించి త్వరితగతిన పరిష్కారం
-
టిడ్కో ఇళ్లపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి
-
నిధుల దుర్వినియోగంపై ప్రభుత్వం సీరియస్
-
ఎవరిని వదిలి పెట్టే ప్రసక్తే లేదు
-
రాష్ట్ర పురపాలక శాఖామంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ వార్నింగ్
-
నెల్లూరు కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలు స్వీకరించిన మంత్రి, రూరల్ ఎమ్మెల్యే
-
పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ, కమిషనర్, జేసీ, పలువురు అధికారులు
-
అధిక సంఖ్యలో తరలి వచ్చిన బాధితులు
నెల్లూరు: ప్రజల కోసమే…రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని తీసుకువచ్చారని…ఈ వేదికలో అప్లికేషన్లో తీసుకోవడం కాదని…వాటికి స్పాట్‌లోనే పరిష్కారం చూపుతున్నామని…రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు.
నెల్లూరు కలెక్టరేట్‌లో శుక్రవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్, కమిషనర్ సూర్యతేజలతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పలువురు బాధితులు సార్… మా సమస్యను పరిష్కరించాలంటూ నారాయణకు మొర పెట్టుకున్నారు.
వెంటనే స్పందించిన నారాయణ…కొన్ని అర్జీలను స్పాట్‌లోనే అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. మరి కొన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించి…విచారించి పరిష్కరించాలని సంబంధిత అధికారుల్ని మంత్రి ఆదేశించారు.
ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు. ఈ రోజు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సుమారు 50 మంది వరకు అర్జీలు ప్రజలు అందచేశారన్నారు. వాటిలోనే కొన్నింటిని స్పాట్‌లోనే పరిష్కరించడం జరిగిందన్నారు. మరి కొన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించి…త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించామని తెలిపారు.
కొన్నింటిని కేబినెట్ స్థాయిలో పరిష్కరించాలని…వాటన్నింటిని కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ రోజు కొన్ని రెవెన్యూ సమస్యలు, అదే విధంగా టౌన్ ప్లానింగ్ శాఖలో మరి కొన్ని సమస్యలు వచ్చాయన్నారు. టౌన్ ప్లానింగ్ లో కమిషనర్ సూర్యతేజ స్పాట్‌లోనే పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నారన్నారు.
అదే విధంగా పోలీసు డిపార్ట్ మెంట్ కి సంబంధించి ఒక కేసు వచ్చిందని…దానిని కూడా ఎస్పీ బాధితులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని చెప్పారన్నారు. ఏదో అర్జీ తీసుకున్నామా… అయిపోయిందనే విధంగా కాకుండా… బాధితులు అందించే ప్రతీ అర్జీని పరిష్కరించేందుకే…సీఎం ప్రజా సమస్యల పరిష్కార వేదికను తీసుకువచ్చారన్నారు. ఉదాహారణకి బుచ్చిరెడ్డిపాళెంలో ప్రభుత్వ పార్కు స్థలంలో ఓ వ్యక్తి ఇటుక బట్టీలు పెట్టుకొని ఉన్నారన్నారు. వెంటనే సంబంధిత అధికారుల్ని ఆదేశించి…అక్కడ పరిస్థితి పరిశీలించి వివరాలు సేకరించాలని చెప్పడం జరిగిందన్నారు. ఆ బిల్డింగ్ పూర్తయిపోగానే…ఆ స్థలంలో పార్కుని నిర్మించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు.
ముఖ్యంగా ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలు తీసుకోవడం కాదని… వాటిని పరిష్కరించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని నారాయణ స్పష్టం చేశారు. ఈ సిస్టమ్‌ని కంటీన్యూ చేస్తామని చెప్పారు. అలాగే టిడ్కో ఇళ్లపై ఇప్పటికే సీఎం చంద్రబాబునాయుడు ప్రత్యేక దృష్టి సారించారన్నారు.
వాటన్నింటిని విజిట్ చేయమని మంత్రులందరికి సీఎం ఆదేశాలు జారీ చేశారన్నారు. ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసిన వారిని ఎట్టి పరిస్థితిలో వదిలేదని లేదని తనదైన శైలిలో హెచ్చరించారు.
ఈ క్రమంలోనే తణుకులో టీడీఆర్ బాండ్లలో సుమారు రూ. 700 వందల కోట్లు దుర్వినియోగానికి పాల్పడ్డారని. ఇప్పటికే దానిపై విచారణ జరుగుతోందని…ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిందని…దానిని కూడా సీఎంకి పంపించడం జరిగిందన్నారు. గత ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వం ప్రజా పాలన కనిపించని పాలన చేసింది. వీటన్నింటిని పూర్తి స్థాయిలో విచారించి…లీగల్ గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.