Suryaa.co.in

Andhra Pradesh

తెలుగుజాతి ఆరాధ్య దైవం ఎన్టీఆర్‌

-గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌
-ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం

తెలుగుజాతి ఆరాధ్య దైవం ఎన్టీఆర్‌ అని గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ కొనియాడారు. టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెమ్మసానితో పాటు టీడీపీ జిల్లా అధ్యక్షుడు, తాడికొండ అభ్యర్థి తెనాలి శ్రావణ్‌కుమార్‌, గుంటూరు పశ్చిమ టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి, తూర్పు అభ్యర్థి నసీర్‌ అహమ్మద్‌, ప్రత్తిపాడు అభ్యర్థి బుర్ల రామాంజనేయులు, నగర పార్టీ అధ్యక్షుడు డేగల ప్రభాకర్‌, జిల్లా మహిళా అధ్యక్షురాలు అన్నాబత్తుని జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

సభలో పెమ్మసాని చంద్రశేఖర్‌ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పుట్టిన పార్టీ టీడీపీ అని, స్వర్గీయ ఎన్టీఆర్‌ తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచం నలుమూలలా చాటి గుర్తింపు తెచ్చారన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ ప్రభంజనాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదన్నారు. ఇతర నాయకులు మాట్లాడుతూ మహిళను లక్షాధికారులుగా మార్చడానికి సూపర్‌ సిక్స్‌ పథకాలను ప్రకటించారని పార్టీని గెలిపిం చుకోవాలని పిలుపునిచ్చారు. వేడుకల్లో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE