Suryaa.co.in

Andhra Pradesh

విద్యార్ధుల జీవితాలతో ప్రవీణ్ ప్రకాష్, హేమచంద్రారెడ్డి చెలగాటం

-వెయ్యి కోట్ల రూపాయిల విద్యాశాఖ నిధులను సొంత ఖర్చులకు వాడుకుంటున్నారు
-వెయ్యి కోట్ల రూపాయిల విద్యాశాఖ నిధులను సొంత ఖర్చులకు వాడుకుంటున్నారు
-వీసీలు ప్రసాద్ రెడ్డి, రాజశేఖర్‌లతో విశ్వవిద్యాలయాలను కలుషితం చేస్తున్నారు
– తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు

రాష్ట్రంలో అధికారుల సొంత ఖర్చులకు కూడా విద్యా మండలి నిధులను వాడుకుంటున్నారని, జగన్ రెడ్డి మెప్పు పొందేందుకు ప్రవీణ్ ప్రకాష్‌, హేమచంద్రారెడ్డిలు విద్యార్ధుల భవిష్యత్తులతో చెలగాటమాడుతున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు మండిపడ్డారు. దాదాపు రూ.వెయ్యి కోట్ల విద్యా శాఖ నిధులను దారి మళ్లించి విద్యా శాఖను నిర్వీర్యం చేశారని అన్నారు. శుక్రువారం మంగళగిరిలోని తెదెపా జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న రామ్మోహన్ రావు.. విద్యా శాఖను జగన్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా నిర్వీర్యం చేశారనే దానిపై వివరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… “రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను జగన్ రెడ్డి నిర్వీర్యం చేశాడు. ముఖ్యంగా అధికారం దుర్వినియోగం చేస్తూ విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశాడు. విద్యార్ధి లోకమంతా గౌరవించే గురువులను విద్యాశాఖ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. అర్థరాత్రి వేళ టీచర్లతో వీడియో కాన్షరెన్సులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు. సమస్యలను పరిష్కరించండని రోడ్లపైకి టీచర్లు వస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారన్న కక్షతో వారిని అనేక రకాలుగా వేధిస్తున్నారు. జగన్ మెప్పులు పొందేందుకే ప్రవీణ్ ప్రకాష్ ఈ రకంగా వ్యవహరిస్తున్నాడు. మూతపడే బైజూస్ లాంటి సంస్థకు రూ.500 కోట్లు దారాదత్తం చేసి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారు” అని అన్నారు.

జగన్ మెప్పుకై నిరంతరం శ్రమిస్తున్న విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి…
“విద్యా మండలి వ్యవస్థను వైసీపీ కార్యాలయంలా, లోటస్ పాండ్‌లా మార్చేసి, దానికి విధివిధానాలు లేకుండా, పార్టీ కార్యకర్తల్లా విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి పని చేస్తున్నారు. వైసీపీ బహిరంగ సభలకు విద్యార్ధులను పంపాలని విద్యా సంస్థలను బెదిరిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా టీచర్లు కూడా లేని 292 పాఠశాలలను జూనియర్ కాలేజీల్లా మార్చారు. వాటిలో దాదాపు 115 కాలేజీల్లో అడ్మిషన్‌లు కూడా జరగలేదు.

ఎవరి ప్రయోజనాల కోసం ఆ పాఠశాలలను కళాశాలలుగా మార్చారో తెలియదు. విద్యాశాఖ మంత్రి, అధికారుల ఖర్చులు అన్ని కూడా విద్యా మండలి భరిస్తోంది. ఆఖరికి ప్రభుత్వ సలహాదారుడి కిరాయి కారు ఖర్చు కూడా విద్యా మండలి భరిస్తోంది. విద్యార్ధులకు ఫీజు రీఎంబర్స్‌మెంట్ కూడా చేయకుండా ఆ డబ్బులను ఇతర సొంత ఖర్చులకు వాడుకుంటున్నారు” అని మండిపడ్డారు.

విశ్వవిద్యాలయాలను కలుషితం చేశారు
“రాజకీయాలు చేయడంపై ఉన్న శ్రద్ధ విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయడంపై లేదు. రాష్ట్ర ప్రభుత్వ ఆదీనంలో ఉన్న 25 విశ్వవిద్యాలయాల్లో 80 శాతం ఉపాధ్యాయ పోస్టులు ఖాలీగా ఉండటం వల్ల కోర్సులు సరిగా జరగడం లేదు. చాలా కోర్సులు కాంట్రాక్టు లెక్చిరర్లుచే బోధిస్తున్నారు. దీనిపై ఎప్పుడూ సమీక్ష జరపలేదు. విద్యా ప్రమాణాలు పెంచడానికి ప్రభుత్వం దృష్టి సారించాల్సింది. ఇలా ఏం చేయకుండా విద్యా వ్యవస్థను వాళ్ళ జేబు సంస్థగా మార్చుకున్నారు. ఆంధ్ర వీసీ ప్రసాద్ రెడ్డి, నాగార్జున వీసీ రాజశేఖర్‌లను పెంచి పోషిస్తూ విశ్వవిద్యాలయాలను కలుషితం చేస్తూ విద్యార్ధుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు” అని విచారణ వ్యక్తం చేశారు.

“దాదాపు రూ.1000 కోట్లు విద్యా శాఖ నిధులు దారి మళ్లించారు. గతంలో హెల్త్ యూనివర్సిటీ దగ్గర నుంచి రూ.400 కోట్లు, రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఏపీ ఇంటర్ బోర్డ్‌కు వచ్చిన రూ.230 కోట్లు, 20 ఏళ్లుగా విద్యార్ధులకు కట్టాల్సిన రూ.110 కోట్లు ఫీజులు దోచుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉన్నత విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాల కోసం రావాల్సిన రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.175 కోట్లు ప్రభుత్వం నిలిపివేసింది. ఉమ్మడి ప్రవేశ పరిక్షలకు విద్యార్ధులు చెల్లించిన రూ.75 కోట్లు దారి మళ్లించారు. ఎటు నుంచి విద్యా శాఖకు వచ్చిన డబ్బులన్నింటినీ సొంత ఖర్చులు కోసం వాడేసుకున్నారు.

ప్రవీణ్ ప్రకాష్, హేమచంద్రారెడ్డిలు వారి పదవులను అడ్డంపెట్టుకొని విద్యార్ధులతో ఆడుకుంటూ నిధులను దుర్వినియోగం చేస్తున్నారు. దీనిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. మరో 45 రోజుల్లో ప్రభుత్వం గడువు ముగుస్తుంది. భావి భారత పౌరుల జీవితాలతో చెలగాటమాడుతున్న వారిని వదిలిపెట్టేది లేదు” అని రామ్మోహన్ రావు హెచ్చరించారు.

LEAVE A RESPONSE