Suryaa.co.in

International

సింగపూర్ లో అంగరంగ వైభవంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు

సింగపూర్: సింగపూర్ లో తెలుగుదేశం ఫోరం సింగపూర్ నిర్వహించిన నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి వేడుకలు జులై 14న ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి , పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు హాజరై ప్రసంగించారు.

గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ.. సామాజిక రాజకీయ ఆర్ధిక సంస్కరణలకి నాంది పలికిన వ్యక్తి ఎన్టీఆర్ అంటూ అన్నగారితో తనకున్న అనుభవనాలను పంచుకోగా, పేదకి కూడు గుడ్డ నీడ ఇలా దేశానికే సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని ధూళిపాళ్ల నరేంద్ర.. బడుగు బలహీన వర్గాలకి రాజకీయాన్ని పరిచయం చేసింది ఎన్టీఆర్ అని కొలికపూడి శ్రీనివాసరావు కొనియాడారు. అందరూ చంద్రబాబు సారధ్యంలో రాష్ట్ర పునర్నిర్మాణంలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సాంస్క్రుతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి 800 మంది పైగా ఎన్టీఆర్ అభిమానులు హాజరయి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

LEAVE A RESPONSE