Suryaa.co.in

Andhra Pradesh

సంక్షేమ సారధి ఎన్టీఆర్ – అభివృద్ధి ప్రదాత చంద్రబాబు

– తెలుగువారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన ఎన్టీఆర్
– కార్యకర్తలే మా బలం.. వారే మా అధినేతలు
– కార్మిక శాఖ మంత్రి సుభాష్
– ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్బావ దినోత్సవ వేడుకలు

రామచంద్రపురం: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఒక సంచలనం.. మొదటి గెలుపు ఒక చరిత్ర.. పార్టీ కార్యకర్తలే మా బలం.. వారే మా అధినేతలు వారి త్యాగాలు ఎప్పటికీ మర్చిపోము అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్బావ దినోత్సవ వేడుకలు శనివారం రామచంద్రపురం నియోజవర్గంలో అంగరంగ వైభవంగా జరిగాయి. తొలుత తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో, ఏడో వార్డులోనూ, అన్న క్యాంటీన్ ఆవరణలో, చప్పిడివారి సావరం, లలితా నగర్, పలు వార్డుల్లోనూ ఘనంగా నిర్వహించారు.

మంత్రి సుభాష్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరితో కలసి కేకు కోసి సంబరాలు చేశారు. ముందుగా తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అందరికీ స్వీట్లు పంపిణీ చేసి ఆనందం పంచుకున్నారు.

ఈ సంధర్బంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ, తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచ నలుమూలల చాటి చెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ అన్నారు. తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డగా, తెలుగు చిత్ర సీమను ఏకచత్రాధిపత్యంగా ఏలుతూ పేదవారికి సంక్షేమ ఫలాలు దక్కాలనే ఆశయంతో తెలుగుదేశం పార్టీ పిలుస్తోంది రా.. కదలిరా అంటూ పార్టీని స్థాపించారు అన్నారు.

ముఖ్యమంత్రిగా అప్పట్లోఅప్పట్లో రాష్ట్రానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. తెలుగుదేశంపార్టీ స్ధాపించిన 9 నెలల లోనే అధికారంలోకి వచ్చిన మహా నాయకుడు ఎన్.టి.ఆర్ అన్నారు. పేదలకు కూడు, గూడు, గుడ్డ అందించాలనే నినాదంతో పార్టీని స్థాపించిన మహనీయుడని కొనియాడారు.

అనంతరం తెలుగుదేశం పార్టీ కోసం శ్రమించిన సీనియర్ నాయకులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

LEAVE A RESPONSE