వరద నీటిలో కొట్టుకుపోయిన రిపోర్టర్

భారీ వర్షాలు, వరదలను కవర్ చేయడానికి వెళ్లిన ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ గల్లంతయ్యారు. జగిత్యాల రిపోర్టర్ గా పని చేస్తున్న జమీర్ కారులో రిపోర్టింగ్ కు బయల్దేరారు. అయితే భారీ వరదల నేపథ్యంలో కారు వరదలో చిక్కుకుంది. ఆ తర్వాత వరద ప్రవాహం మరింత పెరగడంతో కారు కొట్టుకుపోయింది. కుర్రులో (నదిలో ఒక లంక లాంటి ప్రాంతం) చిక్కుకుపోయిన వ్యవసాయ కార్మికుల రెస్క్యూ ఆపరేషన్ ను కవర్ చేసి వస్తున్న క్రమంలో ఆయన గల్లంతయ్యారు. మరోవైపు జమీర్ కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి. అయితే, ఆ కారులో ఉన్న మరో వ్యక్తి మాత్రం ప్రమాదం నుంచి బయటపడ్డారు. జమీర్ ఆచూకీ ఇంతవరకు లభించలేదు.