Suryaa.co.in

Political News

నూపుర్ శర్మలు,జిందాల్ లు వస్తుంటారు పోతుంటారు.మోడీ లాంటి వారు వచ్చేది ఒక్కసారే

మానవ సంబంధాలు అన్నీ ఆర్ధిక పరమయినవే ! శక్తి ఉన్నవాడిని బలహీనుడు ఆశ్రయిస్తాడు. ధనం ఉన్నవాడిని ధనహీనుడు ఆశ్రయిస్తాడు. ధనం,శక్తి రెండూ మతం కన్నా ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. అందుకే ఎడారి మతాలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ దేశాలలో వ్యాపించగలిగాయి.BJP అధికార ప్రతినిధి నూపుర్ శర్మ. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి మాస్టర్స్ చేసింది. కాబట్టి దేశ విదేశాల మధ్య ఉండే
NUPUR-SARMAఆర్ధిక పరమయిన సంబంధాల మీద, మనకంటే ఆవిడకి ఎక్కువ అవగాహన ఉండి తీరాలి. టివి చానెల్ లో చర్చ సందర్భంగా నూపుర్ శర్మ ప్రొఫెట్ మీద చేసిన వ్యాఖ్యలు, ప్రతి పక్షాలతో పాటు వివిధ దేశాలు బాగానే వాడుకున్నాయి. అయితే ఇదేమీ మొదటి సారి కాదు. గతంలో జాకీర్ నాయక్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేస్తూ, అదేమీ తప్పు కాదని వాకృచ్చిన సంగతి మనకి తెలిసిందే ! ఇప్పుడే ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు ?

అవకాశం !
ప్రస్తుత భారత విదేశీ మారక నిల్వలు $600 బిలియన్ మార్క్ దగ్గర ఉంది. ఇది గతంలో ఎన్నడూ లేనంత విధంగా ఉంది. ప్రధాని మోడీజీ 2025 కల్లా భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక శక్తిగా ఎదగాలని కోరుకుంటున్నారు. అలా జరగాలి అంటే సుస్థిరమయిన రాజకీయ మరియు పరిపాలన కొనసాగాల్సి ఉంటుంది. ఇప్పుడు నూపుర్ శర్మ వ్యాఖ్య మీద పాకిస్థాన్ చేస్తున్న రాద్ధాంతమ్, కేవలం ముస్లిం దేశాలకి తాను పెద్ద దిక్కు అని చాటుకోవడానికే ! ఖతార్ కూడా పాకిస్థాన్ కంటే తనకే OIC [ Organaization Of Islamic Countries ] దేశాలలో ప్రాముఖ్యుత ఉండాలని కోరుకోవడం కోసమే డ్రామా ఆడుతున్నది.

కానీ వాస్తవంలో సౌదీ అరేబియా,UAE లతో ఖతార్ దేశానికి వైరం ఉంది. రెండు దేశాలు ఖతార్ న్ దూరం పెట్టి చాలా కాలం అవుతున్నది. ఆయిల్,సహజ వాయువు వల్ల ఖతార్ దేశానికి విలువ ఉంది తప్పితే, అవి
QATARఅడుగంటిన తరువాత ఎవరూ పట్టించుకోరు. పాకిస్థాన్,టర్కీ,ఖతార్ దేశాలు కలిసి ఆడిన నాటకమే భారత్ విద్వేషం డ్రామా! నిజానికి గల్ఫ్ దేశాలలో పాకిస్తానీ సూపర్ మార్కెట్ల బయట పెట్టిన భారత్ విద్వేషపు బోర్డులు, వాటికే పరిమితం అయిపోయాయి తప్పితే సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం కేవలం బూటకం.

అల్ జజీరా టీవి చానెల్ మరో అడుగు ముందు ఉంటుంది భారత్ మీద ద్వేషం కక్కే విషయంలో. ఏదో జరిగిపోతున్నది అంటూ అది భారత్ మీద ప్రభావం చూపిస్తుంది అంటూ సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం.. కేవలం మోడీజీ 2025 కల్లా $5 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక శక్తిగా ఎదగకుండా చూసే ప్లాన్ లో భాగం. కానీ విద్వేషకులు కోరుకున్నట్లుగా ఏమీ జరగలేదు జరగబోదు.

గతంలో చిత్రకారుడు MF హుసేన్ సరస్వతి దేవి బొమ్మని, నగ్నంగా చిత్రించినప్పుడు ఏమయింది ? ఏమీ కాలేదు. నేరుగా ఖతార్ వెళ్లిపోయాయాడు అక్కడి పౌరసత్వం తీసుకున్నాడు భారత పౌరసత్వం విదిలేసి. ఖతార్ ఇప్పుడు మనకి నీతులు చెప్తున్నది.

టర్కీ భారత్ గోధుమలని తిరస్కరించింది !
అవి భారత దేశపు గోధుమలు ఎలా అవుతాయి ? నిజానికి నెదర్లాండ్స్ దేశం గోధుమల దిగుమతి కోసం ITC తో ఒప్పందం చేసుకుంది. తీరా షిప్పు నెదర్లాండ్స్ చేరకముందే నెదర్లాండ్స్ దేశం, టర్కీ తో మారు బేరం కుదుర్చుకొని షిప్ ని టర్కీ కి పంపింది. కానీ ఇది ఒప్పందానికి విరుద్ధంగా జరిగింది. టర్కీ కి తెలుసు
TARKEYచెల్లింపులు నేరుగా డచ్ దేశానికి చేసినా, అవి భారత్ కి వెళతాయి అని. అందుకే ఏదో ఇప్పటి వరకు తెలియని రూబెల వైరస్ గోధుమలలో ఉందని తిరస్కరించింది. ఇది కేవలం భారత్ మీద విద్వేషంతో చేసిన పని తప్పితే, ITC లాంటి సంస్థ అలాంటి పని చేయదని తెలుసు. చివరికి ITC గోధుమలు ఈజిప్ట్ కొన్నది.

ఏదన్నా వివాదం ఉంది అంటే, అది డచ్ దేశానికి ITC ల మధ్య తప్పితే.. అది భారత దేశ ప్రభుత్వానికి సంబంధించినది కాదు. పనిలో పనిగా ఈ విషయాన్ని కూడా పెద్దది చేశారు. గతంలో హెరిటేజ్ పాలలో రసాయనాలు ఉన్నాయని, కేరళ ప్రభుత్వం నిషేధం విధించింది హెరిటేజ్ పాలు దిగుమతి చేసుకోకుండా. కానీ అది ప్రముఖ వార్త కాలేదు ఎందుకో ? ప్రియా పచ్చళ్లలో పురుగుమందుల అవశేషాలు ఉన్నాయని అమెరికా తిప్పి పంపింది. కానీ అది వార్త కాదు. ఇంతకీ ఆ పచ్చళ్లు సముద్రంలో పడేశారా ? లేక భారత్ లోనే మళ్ళీ అమ్ముకున్నారా గుట్టు చప్పుడు కాకుండా ?

అసలు విషయం ఏమిటంటే గోధుమలు కొనడానికి టర్కీ దగ్గర తగినంత డాలర్లు లేవు. ప్రస్తుత టర్కీ దేశపు ద్రవ్యోల్బ ణం రేట్ ఎంతో తెలుసా ? 75.5 శాతం . 1998 తరువాత టర్కీ ఇప్పుడు విపత్కర పరిస్తితి లో ఉంది. కానీ టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ మాత్రం ఆర్ధికాభివృద్ధి కంటే మతమే ముఖ్యం అని కూర్చున్నాడు. చెరువు మీద అలిగాడు ఎర్డోగాన్!

అంతర్జాతీయంగా మనకి పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు, దానిని మరింతగా వృద్ధి చేసుకోవాలే కానీ దానిని క్రుంగదీయకూడదు. నూపుర్ శర్మ వ్యాఖ్యలు తప్పు కాకపోవచ్చు కానీ సందర్భం కాదు. బిజేపి అగ్ర నాయకత్వం నూపుర్ శర్మ ని, పార్టీ నుండి వెలివేయడం మీద చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కానీ అది సరి కాదు. బండి నడిపేవాడికి తెలుస్తుంది బరువు ఏమిటో ! ఒక్కరు ఎక్కువయినా బండి తిరగబడుతుంది. అలాంటప్పుడు కష్టమే అయినా ఎవరో ఒకరిని బండి దింపకతప్పదు బండి సాఫీగా ప్రయాణం కొనసాగించాలి అంటే !

మనకి విదేశాల నుండి వచ్చే ప్రతీ 100 డాలర్లలో 68 డాలర్లు, గల్ఫ్ దేశాలలో మన వాళ్ళు పంపించేవే ఉన్నాయి. దేశం ఆర్ధికంగా వృద్ధి చెందిన తరువాత ఎన్ని ఆటలు అయినా ఆడవచ్చు చైనా లాగా.
అలా అని తల వంచాల్సిన అవసరం లేదు. కేవలం పెట్రోలు మీద ఆధారపడి ఏ దేశమూ జీవించలేదు.OIL పెట్రోల్ తప్ప ఆయా దేశాలు దిగుమతి చేసుకోవాల్సినవి చాలానే ఉన్నాయి. వాటిలో భారత్ నుండి కూడా దిగుమతి చేసుకునేవి ఉంటాయి కాబట్టి, ఆట ఏకపక్షంగా ఏమీ ఉండదు. ఇప్పటికే OIC దేశాలకి భారత్ గట్టిగానే బదులు ఇచ్చింది. ప్రపంచంవలోనే క్రూడ్ దిగుమతి చేసుకునే దేశాలలో అమెరికా,చైనా ల తరువాతి స్థానం మనదే అన్న సంగతి గల్ఫ్ దేశాలకి తెలుసు. కాదూ కూడదు అని మొండికేస్తే రష్యా, వెనుజులా, అమెరికాల నుండి దిగుమతి చేసుకుంటాము అన్న సంగతి వాటికి తెలుసు.

నిన్న యూరపియన్ యూనియన్ మరోసారి తమ లక్ష్యం మీద ప్రకటన చేసింది. 2030 కల్లా 50% ఎలెక్ట్రిక్ వాహానాలని నడపాలని నిర్ణయం తీసుకుంది గట్టిగా. అదే సమయంలో ముందుగానే పెట్రోల్ తో నడిచే వాహనాల ఉత్పత్తి మీద నిషేధం విధించబోతున్నాయి. వాహన ఉత్పత్తి దారులకి ముందుగానే ఈ విషయం తెలియచేసింది EU. కాబట్టి మరో 8 ఏళ్లు ఈ దేశాలకి గౌరవం దొరుకుతుంది. తరువాత ? 2030 కి భారత్ కూడా తన క్రూడ్ దిగుమతుల్లో 20% కోత విధించే అవకాశం ఉంది. ఇప్పటికే ఎలెక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు జోరు అందుకుంటున్నాయి. మరో మూడేళ్లకే డీజిల్ ఇంజిన్ల తయారీ కొనసాగుతుంది మన దేశంలో. ఆ తరువాత డీజిల్ ఇంజిన్ తయారీ ఉండదు.

1939 లో గల్ఫ్ లో మొదటి ఆయిల్ బావి తవ్వకం మొదలయ్యింది అలాగే 2039 కి అదే బావి మూత పడే అవకాశం ఉంది.ఇప్పటికే ఫ్రాన్స్,నెదర్లాండ్స్,బెల్జియం లాంటి 14 దేశాలు భారత్ కి మద్దతుగా నిలిచాయి. జర్మనీ బయటపడలేదు కానీ మద్దతు మనకే ఉన్నది. అసలు సౌదీ లోని మక్కా లో బార్లు,కాసినో లు పెట్టె యోచనలో ఉంది సౌదీ ప్రభుత్వం. అలాంటిది మిగతా దేశాల మనోభావాలని లెక్కలోకి తీసుకుంటుందా ? మామూలు ప్రజలకి ఈ లెక్కల సంగతి తెలియక అలా అరుస్తూ ఉంటారు తప్పితే, కాలమే సమాధానం చెప్తుంది వాళ్ళకి.ఒక సినీ కవి అన్నట్లు ‘’అంగళ్ల రతనాలు అమ్మినారట ఇచట ‘’ అంటూ నాటి రాయలసీమ వైభవాన్ని గుర్తుచేస్తాడు.రెండు సంవత్సరాల క్రితమే చెప్పాను 2022 మోడీ గారికి కష్ట కాలం అని. మరో ఆరు నెలలు బండి నెట్టుకొస్తే తరువాత మళ్ళీ వేగం పుంజుకుంటుంది. గుర్తు పెట్టుకోండి నూపుర్ శర్మలు,జిందాల్ లు వస్తుంటారు పోతుంటారు. కానీ మోడీ లాంటి వారు ఒక్కసారే వస్తారు.

– పులగం సురేష్‌, జర్నలిస్టు

LEAVE A RESPONSE