నీ చుట్టూ ఉన్న..
అమాయకులను తొక్కేసి..
డబ్బు సంపాదించడం తెలివి కానే కాదు!
ఆ అమాయకులను
కాపాడుతూ..
బాగు పరుస్తూ..
వారితో పాటుగా
నువ్వు కూడా ఎదగడం మాత్రమే..
నిజమైన తెలివి అనిపించుకుంటుంది!
ఆత్మవిశ్వాసం ఉన్నవాడు మాత్రమే..
అలా ధైర్యంగా,మనశ్శాంతితో బ్రతుకుతాడు!
అభద్రతాభావంతో..
ఉన్నవాడు మాత్రమే..
ప్రజలను దోచుకుని బ్రతుకుతాడు!
అలాంటి
మానసిక రోగాలు ఉన్నవారికి..
పాలించే
అధికారం,హక్కు రెండూ లేనే లేవు!