జగన్ మోసపు రెడ్డిని ఆర్టీసీ అధికారులు ఆదర్శంగా తీసుకున్నారు

– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

యధా సీఎం తధా అధికారులు.. ప్రజల్ని మోసం చెయ్యడంలో నిపుణుడైన జగన్ మోసపు రెడ్డిని ఆర్టీసీ అధికారులు ఆదర్శంగా తీసుకున్నారు . నిన్న ప్రకటనకు నేటి బాదుడుకి సంబంధం లేదు. పెంపు స్వల్పమేనని ఛార్జీలు భారీగా పెంచడం దారుణం. కిలోమీటర్ల బట్టి ఛార్జీలు పెంచడం వలన ప్రజల పై పెను భారం పడింది.

పల్లెవెలుగులో 5 కి.మీ కు రూ. 5 ఉన్న ఛార్జీని రెండింతలు రూ.10 చేసి సామాన్యుడి నడ్డి విరిచారు. ఆ తరువాత కి.మీ కి 10 పైసల చప్పున కనిష్టంగా రూ.5 నుండి గరిష్టంగా రూ.15 పెంచి ప్రజల రక్తాన్ని పీలుస్తున్నారు. ఇతర సర్వీసుల్లో కి.మీ.ల చొప్పున కనిష్టంగా రూ.30 నుండి గరిష్టంగా రూ.120 భారం పడనుంది. పాస్ లు, ఏసీ బస్సులో బాదుడుకి అడ్డుఅదుపు లేదు. వైసిపి పాలనలో బస్సు ఎక్కడం కూడా అదృష్టంగా భావించాల్సిన దుస్థితి దాపురించింది. ఆర్టీసీని ఉద్ధరిస్తానని ప్రభుత్వంలో విలీనం చేసిన జగన్ రెడ్డి చేతులెత్తేసి భారమంతా ప్రజలదే అనడం అన్యాయం. పెంచిన ఆర్టీసీ ఛార్జీలు ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలి.

Leave a Reply