Suryaa.co.in

Andhra Pradesh

బాలకృష్ణ తుపాకీ పేల్చాల్సింది ఎవరి మీద..?

– మీ నాన్నను చంపేసిన వాడి మీద కాదా..?
– అతికించుకున్న మీసాల్ని గట్టిగా తిప్పితే..
– ఉన్నవి కాస్తా ఊడిపోతాయి బాలకృష్ణా..!
– గృహ నిర్మాణ శాఖ మంత్రి రమేష్‌ హితవు

ప్రెస్‌మీట్‌లో మంత్రి జోగి రమేష్‌ ఏం మాట్లాడారంటే..:
ఆ పని ఎవరు చేశారు?:
మూడు రోజుల తర్వాత స్పృహలోకి వచ్చిన నందమూరి బాలకృష్ణ ట్వీట్‌ చేశారు. ఎన్టీ రామారావు పేరును ఎవరూ చెడగొట్టలేరని, జాతికి, సమాజానికి ఆయనను ఎవరూ దూరం చేయరంటూ ఆయన ట్వీట్‌ చేశారు. కానీ నిజానికి ఎన్టీ రామారావును జాతికి, సమాజానికి ఎవరు దూరం చేశారు? మీ తండ్రికి వెన్నుపోటు పొడిచింది ఎవరు? ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీని, ట్రస్టును లాక్కుని, మీ బావ శునకాన్ని సీఎం పదవిలో కూర్చోబెట్టడం కోసం నీవేం చేశావు బాలకృష్ణ? సొంత తండ్రికి వెన్నుపోటు పొడిచి, ఆ శునకాన్ని సీఎం పదవిలో కూర్చోబెట్టిందెవ్వరు?

ఆ శునకం తోక మీరు కాదా?:
చంద్రబాబునాయడు ఒక శునకం.ఆ శునకానికి తోక ఎవరు? నీవు కాదా బాలకృష్ణా? కుటుంబ విలువలను దిగజార్చి, తుంగలో తొక్కి తండ్రి పెట్టిన పార్టీని లాక్కుని వెన్నుపోటు పొడిచిన శునకం వెంట నడిచింది నీవు కాదా? అంటే మీరు కాదా శునకాలు?
ఆరోజు ఎన్టీ రామారావుగారు తన పిల్లలతో ఏమన్నారు.. మీకు పౌరుషం ఉంటే, మీరు నా కడుపున పుట్టి ఉంటే, నా బిడ్డలే అయితే, నాకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబునాయుడుకు బుద్ధి చెప్పాలి అని అన్నారు. ఆనాడు 73 ఏళ్ల ఎన్టీ రామారావు చివరి కోరిక కోరితే, దాన్ని కూడా తీర్చలేని దద్దమ్మలు మీరు. శంఠలు మీరు.

ఎంగిలి మెతుకులు తిన్నారు:
మీరు ఈరోజు ఎన్టీ రామారావుగారి మీద ప్రేమ ఉన్నట్లు, ప్రపంచానికి మళ్లీ ఎన్టీ రామారావును తెలియజేస్తున్నట్లు ఎంతలా ప్రవర్తిస్తున్నారు. ఒక శునకాన్ని ఆ కుర్చీలో కూర్చోబెట్టారు. ఆ శునకం విసిరిన ఎంగిలి మెతుకులు తిన్నారు. అలాంటి మీరు మాట్లాడతారా?
అసలు మీకు నైతిక విలువలు ఉన్నాయా? మీరు శునకంలో పోల్చారు. కానీ నిజానికి శునకానికి విశ్వాసం ఎక్కువ. ఇది తెలిస్తే ఆ శునకం కూడా చిన్నబుచ్చుకుంటుంది.
ఆరోజు ఎన్టీ రామారావును పదవి నుంచి కూలదోసినప్పుడు మీరు ఎంత చక్కగా చిరునవ్వుతో ఉన్నారు. ఎంత చిద్విలాసంగా నవ్వారు.
మీ తండ్రి పీఠాన్ని లాగి, చంద్రబాబు శుకకాన్ని సీఎం పీఠంలో కూర్చోబెట్టిన బాలకృష్ణ, ఏ మాత్రం సిగ్గు లేకుండా ఆరోజు నవ్వుతూ కూర్చున్నాడు.

మీకసలు సిగ్గు లేదు:
మీకు సిగ్గుండాలి అసలు. మిమ్మల్ని, హరికృష్ణను, దగ్గుపాటి వెంకటేశ్వరరావు.. అందరినీ వాడుకుని చెట్టుకు, పుట్టకు ఒకరిని చేశాడు చంద్రబాబునాయుడు అనే శునకం.
నీ తండ్రి మరణానికి కారణమైన చంద్రబాబునాయుడు అనే శునకం కొడుక్కి సిగ్గు లేకుండా నీ బిడ్డను ఇచ్చావు. మరి నిన్ను ఏమనాలి. శునకం అనాలా? సినిమాల్లో ౖడైలాగ్‌లు చెబుతావు. బయట మాత్రం దద్దమ్మవు.
ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ నుంచి చంద్రబాబునాయుడు శునకం ఏదో నీకు స్క్రిప్ట్‌ రాసిస్తాడు. దాన్ని నీవు ట్వీట్‌ చేస్తావు.

ఏనాడైనా ఆలోచించారా?:
14 ఏళ్లు నీ బావ సీఎంగా చేశారు. మీ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా పని చేశారు. ఏనాడైనా ఎన్టీ రామారావు పేరు చరిత్ర పుటల్లో ఉంచాలన్న ఆలోచన చేశారా? మీరు ఆ శునకం చంద్రబాబు దగ్గర పదవులు తీసుకున్నారు కదా. మరి ఏనాడైనా ఎన్టీ రామారావు పేరును చరిత్రలో నిలపాలన్న ఆలోచన చేశారా?

మేము గర్వంగా చెప్పగలం:
ఇవాళ మేము సగర్వంగా చెబుతున్నాం. ఎన్టీ రామారావు పేరు చరిత్రలో చిరస్థాయిగా నిల్చేలా కృష్ణా జిల్లాకు ఆయన పేరు పెట్టిన గొప్ప వ్యక్తి సీఎం వైయస్‌ జగన్‌. ఆ విధంగా సగర్వంగా చెప్పుకునేలా మా నాయకుడు చేశారు. మాకు ఎన్టీ రామారావుపై నిజంగా అభిమానం ఉంది. అందుకే ఆయన పేరు చరిత్రలో చిరస్థాయిగా నిల్చిపోయేలా చేశాం.
మీరు ఎన్టీ రామారావు బిడ్డ కదా? ఆయన రక్తం పంచుకుని పుట్టారు కదా? మరి ఈ ట్వీట్‌ అప్పుడు ఎందుకు చేయలేకపోయావు. జగన్‌ పేరు ఉచ్ఛరించడం మీకు ఇష్టం లేకపోతే, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా మంచిదని, గొప్పదని ఆరోజు ఎందుకు చెప్పలేకపోయావు.

ఆ ఇద్దరకీ నీవు రుణపడి ఉన్నావు:
బాలకృష్ణా నీకు ఎన్టీ రామారావు జన్మను ఇచ్చాడు. కానీ నీకు పునర్జన్మను ఇచ్చింది మాత్రం వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి. ఒక్కసారి గుర్తు చేసుకో. ఇవాళ అదే వైయస్సార్‌ తనయుడు కృష్ణా జిల్లాకు ఎన్టీ రామారావు పేరు పెట్టారు. కాబట్టి మీరు రుణపడి ఉండాల్సింది ఇద్దరికి. నీకు ఆరోజు పునర్జన్మను ఇచ్చిన వైయస్‌ రాజశేఖర్‌రెడ్డికి. ఆ తర్వాత జిల్లాకు నీ తండ్రి పేరు పెట్టిన వైయస్సార్‌ తనయుడు సీఎం వైయస్‌ జగన్‌కు. నిజానికి మీరు రుణం తీర్చుకోవాల్సింది ఆ ఇద్దరికీ.
కానీ మీకు మానవత్వం లేదు. ఆ మహానేతలకు రుణం తీర్చుకోలేక, శునకాలై పోయి, ఆ చంద్రబాబు అనే శునకం వద్ద చవట సన్నాసుల్లా చేరిపోయారు.

‘కేరాఫ్‌ నారా’ గా మారారు:
అసలు చంద్రబాబునాయుడు తొలుత ఎలా వచ్చాడు? కేరాఫ్‌ అడ్రస్‌ నందమూరి. ఇవాళ నందమూరి ఫ్యామిలీ అడ్రస్‌ కేరాఫ్‌ నారా అయింది. ఎంత పనికిమాలిన వారయ్యారు. మీ తండ్రి పదవి లాక్కున్నా, ఏమీ చేయని మీరు పరమశుంఠలు.
ఆరోగ్య వర్సిటీకి డాక్టర్‌ వైయస్సార్‌ పేరు పెడతారని, గత వారం, పది రోజులగా ప్రచారం జరుగుతూనే ఉంది. మరి నీవు దీనిపై ఎందుకు స్పందించలేదు? కనీసం అసెంబ్లీకి కూడా ఎందుకు రాలేదు? ఎందుకు మాట్లాడలేదు?. బాధ్యతలు, బంధాలు, రక్త సంబంధాలు వదిలేసి, ఎంగిలి మెతుకుల కోసం పనికిమాలిన చంద్రబాబునాయుడు పంచెన చేరారు. అందుకే మీకు సీఎం వైయస్‌ జగన్‌ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు.

ఏమనుకుని పిల్లనిచ్చావు?:
మీ తండ్రిని చంపి, వల్లకాడుకు పంపించిన ఆయన కొడుక్కి నీ కూతురును ఇచ్చావు. సిగ్గు, శరం వదిలేసి బతుకుతున్నారు. ఆ శునకం కొడుక్కి నీవు పిల్లనిచ్చినప్పుడు శునకం అని ఇచ్చావా? కనకం అని ఇచ్చావా?

మీసాలు ఊడిపోతాయి:
ఎన్టీ రామారావు చనిపోయి 26 ఏళ్ల తర్వాత ఇవాళ పెట్టుడు మీసాలతో ఏం మాట్లాడుతున్నారు. ఎన్టీ రామారావు అందరి గుండెల్లో ఉన్నాడని అంటూ ఆ మీసాలు మెలేస్తూ పెద్ద పెద్ద డైలాగ్‌లు చెబుతున్నారు. ఎన్టీ రామారావు అందరి గుండెల్లో ఉన్నారంటూ, పెట్టుడు మీసాలు మెలి తిప్పుతున్నారు. ఏం జరుగుతుంది. ఆ మీసాలు ఊడిపోతాయి.
ఈ డైలాగ్‌లు సినిమాల్లో చెప్పండి. మీరు సినిమాల వరకే పరిమితం.
ఈరోజు యూనివర్సిటీ అనేది చాలా చిన్నది. జిల్లా అనేది చాలా పెద్దది. దేశంలో చరిత్ర ఉన్నంతవరకు, ఆ జిల్లా శాశ్వతంగా చరిత్రపుటల్లో నిల్చిపోతుంది.
ఎన్టీ రామారావును గౌరవించాం. గుర్తించాం. ఆయన అంటే మా నాయకుడికి ఎంతో అభిమానం ఉంది కాబట్టే, కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెట్టాం.మొన్న కూడా హిందూపూర్‌ను జిల్లా కేంద్రం చేయమన్నావు. కానీ ఏ నాడైనా జిల్లాకు ఎన్టీ రామారావు పేరు పెట్టమని కోరావా? గతంలో కూడా ఏనాడైనా కోరిన పాపాన పోలేదు.

మీకు నిజంగా పౌరుషం ఉంటే..:
బాలకృష్ణకు ఇవాళ చెబుతున్నాను. నీవు నిజంగా ఎన్టీ రామారావు రక్తం పంచుకుని పుడితే, నీకు పౌరుషం ఉంటే, ఇప్పటికైనా నీకు జ్ఞానోదయం అయితే.. నీ నాన్న పదవి లాక్కున్న, ఎన్టీఆర్‌ ట్రస్టును లాక్కుని, ఆయన మరణానికి కారణమైన నారా చంద్రబాబునాయుడును డిష్యూం డిష్యూం అని కొట్టు. అప్పుడు మేము నిన్ను నమ్ముతాం.
సినిమాల్లో మాదిరిగా బొమ్మ తుపాకులు కాకుండా, నిజమైన తుపాకీతో పేల్చు. లేదా ఇలాంటి పనికిమాలిన ట్వీట్లు చేయకుండా ఉండు.
ఒక జిల్లాకు ఎన్టీ రామారావు పేరు పెడితే, ఏ మాత్రం ఇంగిత జ్ఞానం ఉన్న వాళ్లైతే తప్పకుండా అభినందిస్తారు. కానీ మీరు ఆ పని చేయలేదు.

దమ్ముండాలి:
అంత పనికి మాలిన మీరా.. జగన్‌గారి గురించి మాట్లాడేది.
పాపం ఎన్టీ రామారావు కడుపున ఇంత మంది పుట్టారు. ఒట్టి చవటలు. సన్నాసులు. పోయి చంద్రబాబు మోచేతి నీరు తాగుతున్నారు.
ఆనాడు చంద్రబాబు నందమూరి కేరాఫ్‌ అడ్రస్‌ అయితే ఇవాళ మీరంతా నారా కేరఫ్‌ అంటున్నారు. మీకు అడ్రస్‌ ఉందా? కనీసం స్వతంత్య్రం ఉందా? మీకు సిగ్గు లేదు. ఖలేజా ఉండాలి. దమ్ముండాలి.
ఒక విమర్శ చేసేటప్పుడు, ఒక ట్వీట్‌ చేసేటప్పుడు దాని వెనక ఉన్న చరిత్ర తెలుసుకోవాలి. నీవు ఎక్కడో కూర్చుంటావు. ఇక్కడికి రావు. ట్వీట్లు మాత్రం చేస్తావు. మీకు సిగ్గుగా లేదా? ఆరోజు మీ తండ్రికి అంత అన్యాయం చేస్తే, ఎవరూ స్పందించలేదు. ఎవరైనా అలా ఉంటారా?

సీఎం స్పష్టంగా చెప్పారు:
మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.. నాకు తెలిసి షర్మిలమ్మ.. అసెంబ్లీలో జగన్‌గారు మాట్లాడిన మాటలు విని ఉండరు. ఆమె విని ఉండాలి. అలా ఆమె చేసి ఉంటే, అలా మాట్లాడి ఉండేది కాదు. ఒక యూనివర్సిటీకి వైయస్సార్‌ పేరు ఎందుకు పెట్టామన్నది సీఎంగారు చక్కగా వివరించారు. వైద్య ఆరోగ్య రంగంలో దేశంలో ఎక్కడాలేని విధంగా వైయస్సార్‌గారు సేవలందించారు.
నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆయన అమలు చేసిన అనేక కార్యక్రమాలు, ఇవాళ దేశంలో చాలా చోట్ల అమలు చేస్తున్నారు.
ఆరోగ్యశ్రీ. 108, 104 సర్వీసులు. వైయస్సార్‌ కంటే ముందెవ్వరూ అలాంటివి అమలు చేయలేదు. ఆయన నిజమైన డాక్టర్‌. అందుకే ఆయన పేరును యూనివర్సిటీకి పెట్టారు. ఇది తప్పనిసరిగా వన్నె తెస్తుంది.
యూనివర్సిటీకి వైయస్సార్‌ పేరు ఎందుకు పెట్టామన్నది జగన్‌గారు అసెంబ్లీలో చక్కగా చెప్పారు. దాన్ని విన్నవారెవరైనా ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తారు. ఒకవేళ బాలకృష్ణ కూడా వింటే, ఆయన కూడా హెల్త్‌ యూనివర్సిటీకి వైయస్సార్‌ పేరు పెట్టడాన్ని సమర్థించే వారు.

LEAVE A RESPONSE