తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ శుభాకాంక్షలు

0
51

: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల్లో భాగంగా పూలను పూజించి, ప్రకృతిని ప్రేమించే గొప్ప పండుగ బతుకమ్మ పండుగ అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్కఅన్నారు. ఈ మేరకు తెలంగాణ ఆడపడుచులు అందరికీ ఎంగిలి పూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రేపటి నుంచి తొమ్మిది రోజుల పాటు తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాన్ని చాటి చెప్పే, తీరొక్క రంగులతో తీరొక్క పువ్వులతో జరిగే బతుకమ్మ పండగ సంబురాలను తెలంగాణ ఆడబిడ్డలు అత్యంత ఆనందోత్సాహాల నడుమ ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.