Home Andhra Pradesh జగన్ ఇంట్లో పనిచేయడానికి బీసీలు కావాలి.. పదవులు పొందడానికి మాత్రం రెడ్లు కావాలా?

జగన్ ఇంట్లో పనిచేయడానికి బీసీలు కావాలి.. పదవులు పొందడానికి మాత్రం రెడ్లు కావాలా?

0
41

-జగన్ కు ఆర్ధిక లావా, దేవీలతో సంబంధం ఉన్న రెడ్లను ఇంటిలోకి రానిస్తారు, బీసీలను మాత్రం ఇంటి బయట నిలబెట్టిస్తారు
-ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కులం గురించి మాట్లాడడం సిగ్గుచేటు
-మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్

ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కులం గురించి మాట్లాడడం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్యే కూన రవికుమర్ పేర్కొన్నారు. శనివారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… సీఎం పులివెందులలో బీసీ, ఎస్సీ, ఎస్టీలను అణగదొక్కి బీసీల గురించి మాట్లాడుతున్నారు.

బీసీల గురించి మాట్లాడే అర్హత జగన్ రెడ్డికి లేదు. బిసిలను ఉద్దిరిస్తున్నాం అని చెబుతూనే బీసీలను అణచేస్తున్నారు. జగన్ ఇంట్లో పనిచేయడానికి బీసీలు కావాలి, పదవులు పొందడానికి మాత్రం రెడ్లు కావాలా? కుప్పంలో చంద్రబాబునాయుడు బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. బలపనూరు నుంచి పులివెందులకు వచ్చి పులివెందులని కబ్జా చేసిన జగన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత లేదు. పులివెందులలో ఇవ్వాల్సిన ఓసీ పదవులను సొంత కుటుంబ సభ్యులకు కట్టబెట్టారు. రెడ్లు అంటే మీ కుటుంబం మాత్రమేనా? వేరొకరు ఉండకూడదా?

ఎక్కడో బలపనూరు నుండి వచ్చి పులివెందులను కబ్జా చేయడం వాస్తవం కాదా? జింకా నరసయ్య అనే బీసీని చంపినప్పటినుంచి మీ రాజకీయం మొదలైందని మరిచిపోయారా? జగన్ రెడ్డి గొడ్డలి వేటుకు తన, పర బేధం లేదు. అధికారం కోసం చిన్నాన్నను చంపారు. అలాంటివారికి చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత లేదు. 44 సంవత్సరాలుగా పులివెందులను కబ్జా చేసి ఏలుతున్నారు. కడపలో 10 ఎమ్మెల్యే స్థానాల్లో 9 రెడ్లకు ఇవ్వడం బీసీలను ఉద్దరించడమా? రాయలసీమలో 43 ఓపెన్ శాసనసభ సీట్లలో 33 చోట్ల రెడ్లకే ఇచ్చారు. బీసీలను, బలిజలను అణగదొక్కి.. బీసీల కోసం మాట్లాడడం గురివిందగింజ సామెత గుర్తొస్తోంది. క్రీడలకు సంబంధించిన అన్ని పదవుల్లో రెడ్లు ఉండడం నిజం కాదా? వైస్ ఛాన్సులర్ల నియామకంలో రెడ్ల స్థానం అధికం. టీటీడీ ఛైర్మన్లుగా తెలుగుదేశం ప్రభుత్వం ఇద్దరు బీసీలను నియమిస్తే, ప్రస్తుతం వైసీపీ సొంత రెడ్డికి ఇచ్చారు. . బీసీల రాజంపేట పార్లమెంటు సీటును మిథున్ రెడ్డికి కట్టబెట్టారు. ఇదేనా బీసీలను ఉద్దరించడమంటే? జగన్ రెడ్డి బీసీ మంత్రాన్ని జపిస్తున్నారు. బీసీలు నమ్మేందుకు సిద్ధంగా లేరు. చిత్తూరు జిల్లా గురించి మాట్లాడే జగన్ రెడ్డికి అక్కడి బీసీలు కనిపించలేదా?

బీసీ రిజర్వేషన్లు రద్దు చేసి బీసీలపై ప్రేమ ఉందంటారా? జగన్ రెడ్డి గొడ్డలి పోటుకు తన, పర భేదం లేదు. సొంత బాబాయినే హత్య చేయించారు. పులివెందులను 44ఏళ్ల నుండి ఫ్యాక్షన్ ప్రాంతంగా మార్చారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని పులివెందుల చుట్టుపక్కల ప్రాంతాలను కబ్జా చేశారు. రెడ్ల లిస్టు వివరిస్తే.. కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాధ్ రెడ్డి, పులివెందుల వైస్ చైర్మన్ వైయస్ మనోహర్ రెడ్డి, చక్రాయపేట వైసీపీ ఇన్ ఛార్జ్ వైయస్ కొండారెడ్డి, చింతకొమ్మదిన్నె జెడ్పీటిసి రామాంజులు రెడ్డి, కడప ఆర్టీసీ ఛైర్మన్ మల్లికార్జున రెడ్డి, టిటిడి చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి.
ఆఖరికి విద్యా సంస్థలను కూడ వదలలేదు. సింహపురి యూనివర్సిటి వైస్ చాన్సలర్ గా మీ మేనత్త మనువరాలిని పెట్టారు. కడపలో ఓసీ స్థానాలు 8 ఉన్నా అందులో ఒక్కటైనా బిసి, బలిజలకు ఇచ్చారా? కడపలో 10 ఎమ్మెల్యే స్ధానాలు ఉంటే 9 స్థానాలు రెడ్ల సామాజిక వర్గానికి కట్టబెట్టారు. రాయలసీమలో 43 అసెంబ్లీ సీట్లలో 33 రెడ్లకి కేటాయించారు. ఇటువంటి మీరు బిసిలు, బలిజలు గురించి మాట్లాడుతున్నారు.

జగన్ రెడ్డి కుల గజ్జిని ఇతరులకు ఆపాదిస్తున్నారు. ఆధ్యాత్మికం, క్రీడలలో మీ కుల, బంధు వర్గమే ఉంది. క్రీడాశాఖా మంత్రి రోజారెడ్డి, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్ద్ రెడ్డి, ఎండీ కూడా ఒక రెడ్డినే. రాష్ట్రంలోని ఏషియన్ స్పోర్ట్స్ కు విజయసాయి రెడ్డి, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెడ్డి. క్రీడలలో కూడ రెడ్డి వికాసాన్ని వికసింపజేశారు.

నాడు కుప్పంలో మేము దొరసామి నాయుడు, శ్రీనివాసులు లకు ఎమ్మెల్సీ పదవులు, కార్పొరేషన్ పదవులు ఇచ్చాం. కుప్పం అధారిటీని స్ధాపించి అనేక మంది దళితులకు రాజకీయ అధికారాలను కల్పించాం. కుప్పంలో బిసి, దళితులకు పదవులు కట్టబెట్టిన ఘనత చంద్రబాబు నాయుడుది. పులివెందులలో ఉన్న పదవులు అన్నింటిని జగన్ కుటుంబ సభ్యులకు కట్టబెట్టారు. కడపలో బిసి,బలిజలే లేరా? కడపలో వైసీపీలోని బలిజలు సమావేశం పెట్టుకొని ఈ ప్రభుత్వం బలిజలకు తీవ్ర అన్యాయం చేస్తోందని తెలిపిన విషయం వాస్తవం.

స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి రాజంపేట స్ధానం బలిజలకు ఇస్తున్నారు. ఆ ఎంపీ స్ధానాన్ని కూడ వదిలిపెట్టకుండా మిథున్ రెడ్డికి కట్టబెట్టారు. రాష్ట్రంలోని బిసి, బలిజలను రాజకీయ పాతర వేశారు. వారిని అణగదొక్కారు. జగన్ రెడ్డి బిసిలకు పదవులు ఇచ్చామని ఆర్భాటాలు చెప్పుకుంటున్నారే తప్ప ఆచరణలో శూన్యం. బిసిలకు నీ ఇంట్లో ఊడిగం చేసే పనులు కట్టబెట్టి వాళ్లని ఉద్దరిస్తున్నామని చెప్పుకుంటున్నారు.

చిత్తూరు జిల్లాలో బిసిలు లేరా? బిసిలుగా ఎన్నికైన వ్యక్తులే లేరా. దళితులలో ఎన్నికైనా శాసన సభ్యులే లేరా? చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామాచంద్రారెడ్డి కి మంత్రి, రోజారెడ్డి కేబినెట్ మంత్రి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రభుత్వ విప్ ఇచ్చారు. బిసి, దళితులెవరూ కూడ జగన్ రెడ్డికి కన్పించలేదా? పదవులన్ని రెడ్లకు కట్టబెట్టి బిసి, బలిజల గురించి మాట్లాడుతున్నారు. నాడు మేం టిటిడి చైర్మన్ గా కడప జిల్లాకు చెందిన పుత్తా సుధాకర్ యదవ్ కి ఇచ్చాం. నేడు జగన్ రెడ్డి చిన్నాన్న వైవి.సుబ్బారెడ్డికి కట్టబెట్టారు.

టీటీడీ ఈఓగా అనిల్ సింగాల్ ఉత్తారప్రదేశ్ ఐఏయస్ అధికారికి మేం ఇస్తే, నేడు ఇతర రాష్ట్రాలలో ఉన్న గ్రూపు-1 కేడర్ ని తీసుకొచ్చి అర్హత లేని వ్యక్తిని కూర్చుబెట్టారు. తిరుపతి ఎమ్మెల్యే పదవి బలిజ వర్గానికి మేం ఇస్తే, నేడు మీరు కరుణాకర్ రెడ్డికి కట్టబెట్టారు. తుడ చైర్మన్ బిసి సామాజిక వర్గం నరసింహం కు ఇచ్చాం, మీరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇచ్చారు. జిల్లాలో ఎస్పీగా అంబురాజన్ కి మేం ఇస్తే, నేడు మీరు పరమేశ్వర రెడ్డికి ఇచ్చారు. యస్వీ యూనివర్సిటి వైస్ చాన్సలర్ గా ప్రొఫెసర్ దామోదర్ దళిత వ్యక్తికి మేం ఇస్తే, మీరు మీ తాతగారి పేరు కలిసి వస్తుందని రాజారెడ్డికి కట్టబెట్టారు.

యస్వీ యూనివర్సిటి రెక్టార్ ప్రొఫెసర్ బిసి వర్గానికి చెందిన జానికి రామయ్యకు మేం ఇస్తే, మీ బంధువు సుందరవల్లీకి ఇచ్చారు. సిమ్స్ ఆసుపత్రి డా.రవికుమార్ బ్రాహ్మణ కులానికి చెందని వ్యక్తికి చంద్రబాబు నాయుడు అవకాశం ఇచ్చారు. మీరు డా.వెంగమ్మ రెడ్డికి ఇచ్చారు. బర్డ్స్ ఆసుపత్రి కమ్మా సామాజిక వర్గానికి ఇస్తే, మీరు డా.మదన్ మోహన్ కి ఇచ్చారు. మేం తిరుపతి సబ్ కలెక్టర్ శుక్లా యూపీ నుంచి వచ్చిన వ్యక్తికి అవకాశం కల్పిస్తే, మీరు కనక నరసారెడ్డికి ఇచ్చారు. కుప్పం వెళ్లి అవాకులు, చవాకులు మాట్లాడినంత మాత్రాన ప్రజలు నమ్మరు.

స్థానిక సంస్థల ఎన్నికలలో చంద్రబాబు నాయుడు 34శాతం రిజర్వేషన్ కల్పించారు. దానికి 10శాతానికి తగ్గించి 24 శాతానికి కుదించారు. 16,800 మంది బిసిలకు రాజకీయ అధికారాన్ని దూరం చేసి వారి గొంతు కోసింది జగన్ కాదా? జగన్ రెడ్డి బైరటీస్ గనులలో చేనేత వర్గానికి చెందిన వెంకట నర్సయ్య మేనేజర్ గా ఉంటే మీ తాత రాజారెడ్డి అతనిని చంపి ఆ గనులని దురాక్రమణ చేశారని ఒక ఆంగ్ల పత్రిక రాసింది. బిసి కి చెందిన వెంకట నర్సారెడ్డి రక్తం మీద మీ ఆర్ధిక పునాది వేసుకున్నారు. మీరా బిసిల గురించి మాట్లాడేది?జగన్ కు ఆర్ధిక లావా, దేవీలతో సంబంధం ఉన్న రెడ్లను ఇంటిలోకి రానిస్తారు, బీసీలను మాత్రం ఇంటి బయట నిలబెట్టిస్తారని మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ వివరించారు.

NO COMMENTS

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com