– డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
దర్శి : కేంద్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ తో ఏపీలో డబుల్ బెనిఫిట్ వస్తోందని, సూపర్ సిక్స్ జిఎస్టి 2.0 అమలు చేసి సామాన్యులకు మేలు చేస్తున్న ప్రజా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వమని టీడీపీ దర్శి ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. పట్టణంలోని పొదిలి రోడ్డులో గల పి.జి.యన్. కాంప్లెక్స్ లో శుక్రవారం ” సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ ” పథకంపై అవగాహన సదస్సు జరిగింది. ముఖ్యఅతిథిగా డాక్టర్ లక్ష్మి పాల్గొని ప్రసంగించారు. ఇంకా, ఈ కార్యక్రమంలో మాజీ శాసన సభ్యుడు నారపుశెట్టి పాపారావు, టిడిపి యువ నేత డాక్టర్ కడియాల లలిత్ సాగర్, దర్శి మార్కెట్ యాడ్ చైర్మన్ దారం నాగవేణి – సుబ్బారావు, డీసీడీవో సుధాకర్ రెడ్డి, దర్శి మండల ఎంపీడీఓ కల్పన, తదితరులు ఉన్నారు.