– నీ అయ్య జాగీరా.. రూ. లక్షా 50 వేల కోట్లు నీ విలాసాలకు ఖర్చు చేయటానికి?
– దేశంలో వచ్చే ఎన్నికల కోసం ఈ ప్రాజెక్ట్ ను కాంగ్రెస్ రిజర్వ్ బ్యాంక్ లా వాడుకోవాలని చూస్తోంది.
– నమామీ గంగే ప్రాజెక్టే రూ. 40 వేలు కోట్లు అయితే మూసీ ప్రాజెక్ట్ కోసం లక్షా 50 వేల కోట్లా?
– ఇందులో మతలబు ఏంటీ? ఇది కుంభకోణం కాక మరేమిటీ?
– ప్రజలకు ఇచ్చిన హామీలను కాదని మీ విలాసాలకు లక్షా 50 వేల కోట్లా?
– ప్రజల సొమ్ము మీ అయ్యా జాగీరా?
– బాధితుల అక్రందనలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు వినబడటం లేదా?
– ప్రజలు మీలాగ అయాచితంగా లక్కీ డ్రా లో వచ్చినట్లు ఎదగలేరు
– సావాస దోషంతో శ్రీధర్ బాబు కూడా ముఖ్యమంత్రి మాదిరిగా చెడిపోయిండు
– తెలంగాణ భవన్ లో కేటీఆర్
హైదరాబాద్: మూసీ బాధితుల పాలిట కాలయముడిగా రేవంత్ రెడ్డి మాటలు మారారు. ఇందిరమ్మ పాలన, ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఇందిరమ్మ చెప్పిందా? ఈ సోనియమ్మ చెప్పిందా? పేదల ఇల్లు కూల్చమని?
రాష్ట్రంలోని పేదలందరి తరఫున రాష్ట్ర హైకోర్టుకి ధన్యవాదాలు తెలుపుతున్న. రాష్ట్రంలో నడుస్తున్న బుల్డోజర్ అరాచకాలను పరిగణలోకి తీసుకొని చట్టపకారం వెళ్లామని సూచించిన హైకోర్టుకి హృదయపూర్వక ధన్యవాదాలు.
ఇచ్చిన హామీలను పక్కనపెట్టి ప్రజలకు అక్కరకు రాని అంశం పైన లక్షన్నరకోట్లు ఖర్చు పెట్టడం ఎవరికోసం? ఎవరి కోసం ఈ ప్రాజెక్ట్. మీ ప్రాధాన్యతలు ఏంటో చెప్పండి. మీరు అధికారంలోకి వచ్చి 300 రోజులు దాటింది. ఇప్పటికీ మీ హామీల అమలు సంగతి గురించి చెప్పటం లేదు. ఏ ప్రాధాన్యం లేకుండా రూ. లక్షా 50 వేల కోట్ల ఖర్చు చేస్తారా?
ఆక్రమణలకు సంబంధించి నేరం చేసిందెవరు? శిక్ష వేసేదెవరికి 1994 లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే పట్టాలు వచ్చాయని ప్రజలు చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే వాళ్లు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ప్రజలు మీలాగ అయాచితంగా లక్కీ డ్రా లో వచ్చినట్లు ఎదగలేరు.
మూసీ నది ప్రక్షాళన పేరుతో రూ. లక్షా 50 వేల కోట్ల ఖర్చు చేస్తారంట. 2400 కిలోమీటర్ల నమామీ గంగా ప్రక్షాళన కోసం మొత్తం ఖర్చు చేసిందే 40 వేల కోట్లు. మాత్రమే. 55 కిలోమీటర్ల మూసీ సుందరీకరణకు రూ. లక్షా 50 వేల కోట్లా? దీని వెనుక ఉన్న మతలబు ఏంటీ? ఇది స్కాం కాకపోతే ఏంటి? కూల్చాల్సి వస్తే ముందు హైడ్రా, జీహెచ్ఎంసీ బిల్డింగ్ లను కూలగొట్టాలే. అవి నాలాల మీద ఉన్నాయి.
కాళేశ్వరంతో వచ్చే ఆదాయం ఎంత అన్నట్లు మమ్మల్ని అప్పుడు అడిగారు. ప్రపంచంలోనే బహుళార్థ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్. లక్షల ఎకరాలకు నీళ్లు, హైదరాబాద్ కు నీళ్ల కరవు లేకుండా చేసిన ప్రాజెక్ట్ కాళేశ్వరం. దానికి రిటన్ ఆన్ ఇన్వెస్టిమెంట్ ఎంత అని అడిగారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తో దేశంలోనే వరి ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ వన్ అయ్యింది. నీళ్ల కరవు లేకుండా పోయింది.
మరి మూసీ ప్రాజెక్ట్ తో మురిసె రైతులెంత మంది? ఒక్క ఎకరానికైనా కొత్తగా నీళ్లు వస్తాయా? మరి అలాంటిది ప్రాజెక్ట్ కు లక్షా 50 వేల కోట్లా ఖర్చు ఎందుకు? మూసీ ప్రాజెక్ట్ కు లక్షా 50 వేల కోట్లంటే అది కాంగ్రెస్ కు రిజర్వ్ బ్యాంక్ లాంటిదే. సబర్మతి ప్రాజెక్ట్ కు 7 వేలకు పైగా ఖర్చు అయ్యింది. యుమునా నది ప్రక్షాళనకు వెయ్యి కోట్లు ఖర్చు అయ్యింది.
థేమ్స్ నదికి కూడా వాళ్లు ఖర్చు చేసింది రూ. 40 వేల కోట్ల మాత్రమే. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఎవరికీ ప్రయోజనం, దీనికోసం రేవంత్ రెడ్డిని ఎవరు ఒత్తిడి చేస్తున్నారు. పక్క రాష్ట్రంలో ఫించన్ పెంచారు. మరి రేవంత్ రెడ్డి ఎందుకు పెంచటం లేదు. ఇప్పటి వరకు రైతుబంధు లేదు. ఇచ్చిన హామీలు ఒక్కటి అమలు చేయలేదు.
. సావాస దోషంతో శ్రీధర్ బాబు కూడా ముఖ్యమంత్రి మాదిరిగా చెడిపోయిండు. చిన్న పిల్లల ఆవేదన హైకోర్టుకు అర్థమైంది మీకు కావటం లేదా? రేవంత్ రెడ్డి ని తిట్టిన తిట్లు చూస్తుంటే నాకే బాధేస్తోంది. ఇంతవరకు ఇలాంటి తిట్లను నేను వినలేదు.
నీ అయ్య జాగీరా రూ. లక్షా 50 వేల కోట్లు నీ విలాసాలకు ఖర్చు చేయటానికి? హైకోర్టు చాలా స్పష్టంగా ప్రభుత్వాన్ని ఆక్షేపించింది. అవసరమైతే న్యాయం కోసం సుప్రీంకోర్టుకు కూడా వెళ్తాం.పేదవాళ్లతో పెట్టుకోవటం మంచిది కాదని కాంగ్రెస్ నాయకులు మీ రేవంత్ రెడ్డికి చెప్పండి.
ఎస్టీపీలను మేమే పూర్తి చేశాం. 15 బ్రిడ్జిలను మేమే మంజూరు చేశాం. ఇక దేనికి మీరు లక్షా 50 వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు. మురికి నీళ్లను బాగు చేయకపోతే నేను ముఖ్యమంత్రి ఎట్ల అవుతా అంటాడు. ఎస్టీపీ లను అందుకే కట్టామన్న విషయం ముఖ్యమంత్రికి తెల్వదు. ఆయనకు సబ్జెక్ట్ తెలియదు. ఎస్టీపీ లేదు కనుక ఇళ్లు కూలగొడుతామంటే…హైదరాబాద్ లో ఒక్క ఇళ్లు మిగలదు.
మీ ఊళ్లో మీ ఇల్లే ఎఫ్టీఎల్ లో ఉంది. మీ బ్రదర్ ఇళ్లు కూడా ఎఫ్ టీఎల్ లో ఉంది. నీకు చిత్తశుద్ది ఉంటే ముందు నీ ఇళ్లు, నీ అన్న ఇళ్లు కూలగొట్టు. జంట జలశయాలకు 500 మీటర్ల వరకు ఎలాంటి నిర్మాణాలు ఉండొద్దని మీరే జీవోలు ఇచ్చారు. ముందు మీ మంత్రులు, ఎమ్మెల్యే ఇళ్లు కూలగొట్టు. ఆ తర్వాత పేదల మీదికి రా.