గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ,మున్సిపల్ కార్పొరేషన్ ఢిల్లీ(MCD) ఎన్నికల్లో బిజెపి అఖండ విజయం గుజరాత్ లో సాధించి, హిమాచల్ ప్రదేశ్ లో గత 35 సంవత్సరాలుగా వస్తున్న ఆన వాయితిని నిలువరించుటకు .9% (బిజెపికి 42 .98% ,కాంగ్రెస్ కు 43.9% ) దూరంలో ఆగిపోయింది.
మున్సిపల్ కార్పొరేషన్ ఢిల్లీ(MCD) ఎన్నికల్లో గత 15 సంవత్సరాలుగా బిజెపి అధికారంలో ఉంటే, బిజెపి 21 (మొత్తం సీట్లు 250 ఆప్ కు134 బిజెపికి 104) సీట్లదూరంలో బిజెపికి అధికారం చేజిక్కలేదు. అయితే బిజెపికి వ్యతిరేకంగా పోటీ చేసిన ఆమ్ ఆద్మీ, ఢిల్లీలో అధికార పార్టీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ లు ప్రజలకు కేవలం ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా, విపరీతమైన హామీలు గుప్పించి ఢిల్లీ లో (MCD) హిమాచల్ ప్రదేశ్ లో అధికారం దక్కించుకున్నారు .
కానీ ప్రాంతీయ పార్టీ ల్లాగా అలవి గాని హామీలు గుప్పించి, వాటిని అమలు చేయుటకు రాష్ట్రాలను అప్పుల పాలు చేయడం( ఆంధ్రప్రదేశ్ లాగా) బిజెపి విధానం కాదు కాబట్టి , బిజెపి జాతీయ పార్టీ జాతీయ విధానాలతో దేశం ఏ విధంగా ముందుకు పోవాలి. ప్రపంచ దేశాలలో అగ్రగామిగా ఉండాలి దేశాభివృద్ధి ఏ విధంగా జరగాలి అనే స్పష్టమైన విధానంతో, తలంపుతో బిజెపి మేనిఫెస్టో పెట్టి ఎన్నికల రంగలొకీ దిగింది.
బీజేపీ నినాదాలు విధానాలు సబ్ కా సాత్ ,సబ్ కా వికాస్ ,సబ్ కా విశ్వాస్, ఔర్ సబ్ కా ప్రయాస్. ఈ ప్రణాళికతోనే ప్రజలలో పనిచేస్తుంది. నేషన్ ఫస్ట్ ,పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అనే అభిప్రాయం పార్టీ కార్యకర్తలకు కలుగజేస్తూ బిజెపి కార్యకర్తలు ఈ విశ్వాసంతోనే పనిచేయాలని అధిష్టానం సూచనతో ఈ దేశం కోసం ఎన్నికల రంగంలో బిజెపి పార్టీ పనిచేస్తుంది . విజయాలు సాధిస్తుంది.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో నరేంద్ర మోడీ అభివృద్దే ధ్యేయం అదే నినాదంతో జరిగిన, జరుగుతున్న పనులను రోడ్ షో ద్వారా, బహిరంగ సభ ద్వారా సమాజానికి చెప్పి అఖండ మెజారిటీ తో పార్టీని గెలిపించారు.
ఆ రిజల్ట్స్ చూసిన తర్వాత బిజెపి విధానమే కరెక్ట్ అనే అభిప్రాయం, కచ్చితంగా దేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో కలుగక మానదు. ఎందుకంటే భారతదేశ ప్రజల మనస్తత్వం, పనిచేసే డబ్బు సంపాదించి అభివృద్ధి జరగాలనే ఆలోచనతో ఉంటారు వనరులు కల్పిస్తే ఎంతటి అభివృద్ధి నైనా చేయగల సామర్థ్యత, సమర్థత ఉన్న ప్రజలు కాబట్టి. ఉదాహరణకు ఇతర దేశాలలో మన దేశం నుండి ముఖ్యంగా మన రాష్ట్రం నుండి వేలాదిమంది విద్యార్థులు ఇతర దేశాలకు వెళ్లి, అక్కడ కష్టపడి పనిచేసే సంపాదించి, కోట్లు ఈ దేశానికి పంపిస్తున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. మల్టీ నేషనల్ సాఫ్ట్వేర్ తదితర కంపెనీల సీఈఓలు భారతీయులు ఎందరో ఉన్నారు.
అందుకు నేను ఒక ఉదాహరణను చెబుతాను. గుజరాత్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు.. మేము అధికారం నీకు వస్తే 300 యూనిట్లు వరకు కరెంటు ఉచితంగా ఇస్తామని, ఎన్నికల మేనిఫెస్టో లో పెట్టినప్పటికీ , గుజరాత్ రాష్ట్ర ప్రజలు మీరు మాకు 300 యూనిట్లు ఉచితంగా ఇచ్చేది ఏంటి? మేమే ప్రభుత్వానికి కరెంటు ఉత్పత్తి చేసే మేము వాడుకోను. ఫోను అమ్ముతామని ఇంటింటికి సోలార్ ద్వారా, కరెంటు ఉత్పత్తి చేసి ప్రభుత్వానికి అమ్ముతున్న విషయం మనకు తెలుసుపై విషయాన్ని వారు సమాజానికి తెలియచేశారు.