– లేకుంటే 2024 తరువాత జముకిలికిడి జారు మిఠాయే…
ప్రతిపక్షాల చీలిక…వాళ్ల అవినీతి..కుల కుటుంబ పాలన..ఇవేమీ భాజపాను కాపాడవు. బీజేపీ కి రాహుల్ గాంధీ స్టార్ కేంపైనర్ గా ఎంత ప్రచారం చేసినా లాభం లేదు.అంటే కనీసం ఇరవై శాతం ఓట్లు పెంచుకోవాలి.
ఒకటి స్పష్టమైన …క్లారిటీ…ఏంటంటే…ప్రజలు అభివృద్ధిని చూసి ఓట్లు వేయరు. ఆ చక్కర్లో పడితే… అంతే సంగతులు.. చిత్తగించవలెను. ఈ లౌకికులు పన్నే వలలో పడనే పడకూడదు. భాజపా ఇప్పటివరకూ చేసిన అభివృద్ధి పనులు…ప్రజలు ఆశించిన దానికంటే అనేక రెట్లు ఎక్కువ.ఇంకేమీ చేయకపోయినా వాళ్లేమీ అనుకోరు.
కడుపు నిండిన తరువాత కావాల్సింది మనసు నిండడం.కూసింత కలా పోసన. హృదయం ఉప్పొంగే…వంద సంవత్సరాలో…ఇంకా ఎక్కువో గుర్తుండి పోయే గూస్ బంప్స్ తెప్పించే విషయాలు.
ఆ ఆశలు నిరాశ చెయ్యొద్దు..ప్లీజ్… భాజపానే చేయగలదు..ప్లీజ్.
దాంట్లో మొదటిది…
పాక్ ఆక్రమిత కశ్మీర్ ఆక్రందనకు ముగింపు పలకడం.గిల్గిత్ కు గిలిగింతలు కలిగించడం…బాల్టిస్తాన్ కు బలం ఇవ్వడం.అక్కడ మిగిలిన 24 అసెంబ్లీ సీట్లను పునర్విభజన చేసేసి…ఒక పది సీట్లు గా మార్చేసి…మన కశ్మీర్ ఎన్నికలతో బాటు ఎన్నికలు జరిపెయ్యడం.
మొన్న ఇంద్రేష్ జీ ఒక మాట చెప్పారు.పుట్టిన ప్రతి దానికీ చావు డేటు కూడా నిర్ణయింప బడుతుందిట.అందుకే పాకిస్తాన్ ఎక్స్పైరీ డేట్ దగ్గరికి వచ్చేసింది.దాన్ని అమెరికా..చైనా వంటి తెలివైన దేశాలు ఎప్పుడో వాడుకోవడం మానేశాయి.దాన్ని పటంలోంచి తొలగిస్తే…ఏడ్చే ప్రియుడు ఎవడూ ప్రపంచంలో లేడు.
ఉంటే గింటే..మన తెలంగాణా నిజాం ముసలి ముతకా తప్ప…ఇంకెవ్వరూ ఉండరు.మరీ ఎన్నికల ముందు అయితే…ఎన్నికల కోసం అంటారు.ఈ సెప్టెంబర్..అక్టోబర్లో అయితే…పెద్దగా ఏడ్చే ప్రతిపిచ్చ గాల్లు ఎవరూ ఉండరు.
ఈశాన్యం గురించి తరువాత చూసుకోవచ్చు..మణిపూర్ మణిపూస లాంటిది.. …చర్చిని…దానికొచ్చే ఫండ్స్ నీ చించితే….వెన్న పూస లాంటి ప్రజలు ఇట్టే కరిగిపోతారు.
చైనా వాళ్లకి ఆకలెక్కువ పాపం. వాళ్ల విదేశాంగ మంత్రిని మాయం చేసినట్టే… ఎప్పుడైనా అధ్యక్షుడ్నీ హాంఫట్ చేసేస్తారు. వాళ్లకి పస్తూన్ కొండల్లో ఉన్న మేకల్ని.. గొర్రెల్నీ తాత్కాలికంగా ఇచ్చేస్తే చాలు… తినుకుంటూ కూర్చుంటారు.
సో..ఇప్పుడు…యూ సీ సీ అనీ…ఓవైసీ అనీ ఏమీ చెయ్యక్కర్లేదు.
ఆ పాక్ చిలకల కాయలు..వాటంతట అవే ఒత్తబడతాయి…తేడా వస్తే బుల్డోజర్లు ఉండనే ఉన్నాయి కదా.
ఏతా వాతా చెప్పొచ్చేేదేమిటంటే…
పాకిస్తాన్ అనే పవిత్రతకు(పతివ్రత అని చదివారా ఏంటి!!!?)వాతలు పెడితే…ఇక్కడ వాతలు తేలేది ఎవరికో..ఓటర్లకు ఇట్టే తెలిసిపోతుంది…అప్పుడు వాళ్ల పని వాళ్ళు పక్కా చేస్తారు.
బాబ్బాబు.. ఆ పీ ఓ కే ను ఓకే చేసి పెట్టండి చాలు.
కొస పీకులాట:
అప్పటికీ యాభై శాతం ఓట్లే గ్యారంటీ సుమా…మిగతావి కూడా రావాలంటే…తరువాత చెబుతా…చాలా ఉంది…!!!
– పండరీనాధ్