– గజగజ వణికిపోతుండు. అందుకు ఢిల్లీకి పోయి కూర్చుండు
– మోదీని కలిసేందుకు కేసీఆర్ శతవిధాలా ప్రయత్నిస్తుండు
– బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్
‘‘ టీఆర్ఎస్-బీజేపీ ఒక్కటేననే తప్పుడు సంకేతాలను పంపాలని కుట్ర చేస్తుండు. బీజేపీ టీఆర్ఎస్ తో దోస్తీ ఉండదు. ఎప్పుడైనా టీఆర్ఎస్ తో కలిసి పనిచేసిందా? టీఆర్ఎస్ తో కాంగ్రెస్, టీడీపీ, ఎంఐఎం, కమ్యూనిస్టులు పార్టీలు పోటీ చేసినయ్ తప్ప ఏనాడూ బీజేపీ టీఆర్ఎస్ తో కలిసి పోటీ చేయలేదు. మోదీని కలిసి బయటకు రావడమే తరువాయి…. మోదీ ‘ శభాష్ కేసీఆర్.’ అని కితాబిచ్చినట్లుగా మనసు విప్పి మాట్లాడినట్లుగా మీడియాకు లీకులిస్తూ అబద్దపు వార్తలు రాయించి ప్రజలను తప్పుడు సంకేతాలు పంపే దుర్మార్గుడు కేసీఆర్. కోతల రాయుడు మాటలు నమ్మి మీడియా మోసపోవద్దని కోరుతున్న.
మోదీ ప్రజాస్వామ్యవాది. ఏ సీఎం వెళ్లినా కలిసి సమస్యలు వింటడు. కేసీఆర్ మాట్లాడితే కాళేశ్వరం….అంతకు ముందు పెద్దాయన ప్రాణహిత-చేవెళ్ల తో నీళ్లు ఇష్తానన్నడు. ఆయన డిజైన్ పేరుతో నీళ్లు తేలకపోయిండు. కేసీఆర్ రీడిజైన్ పేరుతో అంచనాలు పెంచి దోచుకున్నడే తప్ప నీళ్లు తీసుకురాలేకపోయిండు. ఈ మూర్కుడు నాడు చంద్రబాబు, జగన్ తో కుమ్మక్కవడంవల్ల క్రిష్ణా జలాల్లో తెలంగాణకు 555 టీఎంసీల నీరు రావాల్సి ఉంటే….299 టీఎంసీల నీటికే అంగీకరించి తెలంగాణ నోట్లో మట్టి కొట్టిన నీచుడు. దుర్మార్గుడు.
అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కు పిలిచినా హాజరుకాని దౌర్భాగ్య సీఎం కేసీఆర్. పక్క రాష్ట్రం వాళ్లు ప్రాజెక్టులు కడుతుంటే కమీషన్లకు కక్కుర్తి పడి పట్టించుకోని నీచుడు. కేఆర్ఎంబీ మీటింగ్ కు వెళితే ఇవన్నీ ప్రశ్నిస్తారనే భయంతోనే తెలంగాణ అధికారులను ఆ సమావేశానికి హాజరుకానివ్వడం లేదు. ఇప్పటికైనా సీఎం చెప్పాలి. ఎందుకు మీటింగ్ కు వెళ్లడం లేదు. నువ్వు మీటింగ్ బాయ్ కాట్ చేస్తే….నిన్ను, టీఆర్ఎస్ పార్టీని రాష్ట్ర ప్రజలు బహిష్కరిస్తారని గుర్తుంచుకో… ఉదయం నుండి రాత్రి వరకు ఫాంహౌజ్ లో, ప్రగతి భవన్ లో పడుకునే కేసీఆర్ ఏనాడూ సీఎం హోదాలో రోజువారీ షెడ్యూల్ ను రిలీజ్ చేయని ఏకైక సీఎం.
హుజూరాబాద్ ఎన్నికలు రాంగనే బయటకొచ్చి మళ్లీ కథలు చెబుతుండు. వంద కోట్లు కాదు…వెయ్యి కోట్లు ఖర్చు పెట్టినా, తలకిందకు, కాళ్లు పైకి పెట్టినా అక్కడ గెలిచేది బీజేపీ మాత్రమే. టీఆర్ఎస్ గెలవడం అసాధ్యం ’’ అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ అన్నారు.
ఇంకా సంజయ్ ఏమన్నారంటే… ఈరోజు బీజేపీకి బ్రహ్మరథం పడుతున్నారని తెలిసే కేసీఆర్ మాయ మాటలు చెబుతుండు. ఇక్కడున్న రాకం చెర్ల వెంకటేశ్వర్లు స్వామి ఆలయం ఉంది. చాలా పవర్ ఫుల్. అనంతగిరిని టూరిజం హబ్ చేస్తానన్నడు. కానీ మాట తప్పిండు.
బీజేపీ ఈ నియోజకవర్గంలో ఏం చేసిందో కొందరు మూర్ఖులు అడుగుతుండు…ఏం చేసిందంటే..
• పరిగి అసెంబ్లీ నియోజకవర్గానికి కేంద్ర ప్రభుత్వం 2015 నుండి 20202 వరకు మొత్తం 391.86 కోట్ల రూపాయలు మంజూరు చేసింది.
• వీటిలో మౌలిక సదుపాయాల కోసం 67 కోట్ల 45 లక్షలు, మొక్కల పెంపకం కోసం 33 కోట్ల 37 లక్షలు, మరుగుదొడ్ల నిర్మాణానికి 81 కోట్ల 66 లక్షలతోపాటు ఆర్దిక సంఘం విడుదల చేసిన నిధులు 81 కోట్ల 66 లక్షలున్నయ్.
• ఈ ఒక్క పూడూరు మండలానికే కేంద్రం 34 కోట్ల 61 లక్షల రూపాయలు ఖర్చు చేసింది.
• పరిగి మున్సిపాలిటీకి కేంద్ర ప్రభుత్వం స్వనిధి పథకం కింద 808 మంది వీధి వ్యాపారులకు 81 లక్షల రూపాయలు మంజూరు చేసింది.
• ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద వికారాబాద్ జిల్లాకు 56 కోట్ల 68 లక్షల రూపాయలు కేంద్రం ఖర్చు చేసింది.
• ప్రధానమంత్రి క్రుషి సంచాయి యోజన పథకం కింద 70 కోట్ల 12 లక్షల రూపాయలు కేంద్రం ఖర్చు చేసింది.
అప్పా జంక్షన్ నుండి ఇక్కడి దాకా రోడ్లు వేసిందెవరు? బీజేపీ ప్రభుత్వమే కదా….నా లెక్కలు తప్పయితే నాపై కేసు పెట్టుకోవచ్చు.
పీఎంఏవై కింద పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో 70 వేల ఇండ్లు మంజూరు చేసింది కేంద్రమే. మరి ఇక్కడ ఎంత మంది పేదలకు ఇండ్లు ఇచ్చినవో కేసీఆర్ చెప్పాలి.
మరుగుదొడ్లకు, చెట్ల పెంపకానికి, రైతు వేదికల నిర్మాణానికి, ఫ్రీ వ్యాక్సిన్, ఉచిత బియ్యం ఇఛ్చంది మేమే. రోడ్లకు, లైట్లకు సహా చివరకు స్మశానాలకు నిధులిచ్చింది కేంద్రమే. మరి టీఆర్ఎస్ చేసిందేమిటో చెప్పాలి. ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు. నిరుద్యోగ భ్రుతి లేదు. కందులకు సబ్సిడీ ఇవ్వలేదు. కానీ ప్రజలను మాత్రం మోసం చేస్తుండు. గోర్లు, బర్లు, చేపలిస్తే కోటీశ్వర్లను చేస్తానని కేసీఆర్ కథలు చెబుతుండు. ఫాంహౌజ్ లో ఎకరాకు కోటి రూపాయలు సంపాదిస్తుండట. ఎట్ల సంపాదిస్తుండు. గంజాయి ఏమైనా పండిస్తుండా? ఆ కిటుకు ఏందో మా రైతులకు కేసీఆర్ చెప్పాలి. గొల్లలకు టీఆర్ఎస్ సంగతి అర్ధమైంది? బీజేపీ పక్షానే ఉంటరు. గొల్లకొండపై బీజేపీ జెండా ఎగరేస్తాం. పాతబస్తీలో ముస్లిం యువకులకు ఉద్యోగాలు ఎందుకు రావడం లేదు? మెట్రో రైలు ఎందుకు రావడం లేదో ముస్లిం ప్రజలు టీఆర్ఎస్-ఎంఐఎం పార్టీలను నిలదీయాలి. హిందువులను హేళన చేసే పార్టీ ఎంఐఎం పార్టీ. హిందూ ధర్మాన్ని కించపరిస్తే అడ్డుకునే పార్టీ బీజేపీ. ఓల్డ్ సిటీని హైటెక్ సిటీగా ఎందుకు మార్చలేదు?
కంపెనీలు ఎందుకు ఓల్డ్ సిటీకి రావడం లేదో పాతబస్తీ ప్రజలు కూడా ఆలోచన చేస్తుండ్రు. ఎంఐఎంకు సరైన మొగుడు బీజేపీయేనని చెబుతుండ్రు. ప్రజల సమస్యలు, ఆలోచనలు తెలుసుకునేందుకే ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నం. ఈ నియంత, అవినీతి, నయా నిజాం పాలనను కూకటి వేళ్లతో పెకిలించేందుకే పాదయాత్ర చేస్తున్నం.సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినం జరిపేదాకా బీజేపీ పోరాడుతుంది.రజాకార్ల పాలన నుండి తెలంగాణను విముక్తి చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ కు బీజేపీ మోకరిల్లితే, నిజాం సమాధి ముందు మోకరిల్లిన నీచుడు కేసీఆర్.
నియంత పాలనకు వ్యతిరేకంగా కొట్లాడిన పార్టీ బీజేపీ. రుణమాఫీ, నిరుద్యోగ భ్రుతి, ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం లాఠీదెబ్బలు తిన్నది బీజేపీ కార్యకర్తలే.మీ కోసం అన్నింటికీ తెగించి కొట్లాడే బీజేపీ కావాలా? టీఆర్ఎస్ కావాలా? ఒక్కసారి ఆలోచించండి..కోవిడ్ వస్తే టీఆర్ఎస్ నేతలు గడీల్లో సేద దీరుతుండ్రు. మేం నరేంద్ర మోదీ పిలుపుతో మీ ఇంటింటికీ తిరిగి పీపీ కిట్లు, మందు గోళీలుసహా చివరకు చెప్పులు కూడా కొనిచ్చినం…మీకు సేవ చేసే క్రమంలో 8 మంది బీజేపీ కార్యకర్తలు చనిపోయిండ్రు. 12 మంది జిల్లా అధ్యక్షులు ఆసుపత్రిపాలైండ్రు.
ఎట్టి పరిస్థితుల్లోనూ గడీల పాలనను బద్దలు కొడతాం. అందుకే ఈ ప్రజా సంగ్రామ యాత్రను చేపట్టినం.అరెస్టులకు, జైళ్లకు భయపడే పార్టీ బీజేపీ కాదు. నక్సలైట్ల బుల్లెట్లకు భయపడకుండా చావుకు తెగించిన పార్టీ బీజేపీ.ఆ స్పూర్తితోనే టీఆర్ఎస్ అవినీతి, నియంత, కుటుంబ పాలనను కూకటివేళ్లతో పెకిలించే వరకు పోరాడతాం..