Home » సీఎం లేఖను బాలినేని బయటపెట్టాలి: ఎమ్మెల్యే స్వామి సవాల్

సీఎం లేఖను బాలినేని బయటపెట్టాలి: ఎమ్మెల్యే స్వామి సవాల్

వెలిగొండ ప్రాజెక్టు అంశంపై వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వం టీడీపీపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని ప్రకాశంజిల్లా కొండెపి శాసన సభ్యులు డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు.ఇటీవల మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేయడంపై ప్రకాశంజిల్లా కొండెపి టీడీపీ ఎమ్.ఎల్.ఏ స్వామి స్పందించారు.
శుక్రవారం స్వామి మీడియాతో మాట్లాడుతూ .గెజిట్ లో వెలిగొండ ప్రాజెక్టు జరిగిన అన్యాయాన్ని సరి చేయాల్సిన ప్రభుత్వం, తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు బాధ్యతాయుతంగా పని చేస్తున్న ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేయడం తగదన్నారు. ప్రభుత్వ చేతగానితనం బట్టబయలు కావడంతో ప్రజల్లో అధికార వైసీపీ నవ్వుల పాలైందన్నారు. ఆడలేక మద్దెల దరువు అన్న చందంగా తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడలేక సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్ళలేక తెలుగుదేశం పార్టీపై నిందలు వేయడం వైసీపీకి తగునా అని ప్రశ్నించారు. వెలిగొండ సమస్యపై మంత్రి బాలినేని మొట్టమొదటి సారిగా స్పందించారని,… తెలంగాణ ప్రభుత్వం పై లేదా కేంద్రంపై ఏదో మాట్లాడుతారని అందరూ ఎదురు చూస్తే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేసి బొక్కబోర్లా పడ్డారనని స్వామి అన్నారు .
వెలిగొండ అంశంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్ర మంత్రితో మాట్లాడారని మంత్రి బాలినేని చెబుతున్నారని అటువంటప్పుడు … మీ సొంత ఛానల్ … మీ సొంత పత్రికలో ఆ వార్త ఎందుకు ప్రచురించలేదని ప్రశ్నించారు. జిల్లా మంత్రి అయిన బాలినేనికి చిత్తశుద్ధి ఉంటే మీరు మాట్లాడిన విషయాన్ని సీఎం రాసిన లేఖను, మీ పత్రికలో వచ్చిన వార్త క్లిప్పింగ్ ను చూపించాలని స్వామి కోరారు.


దొంగలు పడిన ఆరు నెలల తర్వాత… మీరు మాట్లాడినట్లు గెజిట్ వచ్చి ఒకటిన్నర నెల దాటిందని, వెలిగొండ అనుమతి లేని ప్రాజెక్టుగా గెజిట్ లో ప్రకటించబడిందని జిల్లాకు అన్యాయం జరిగిందని భావించి తాము ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళామని దీనిపై జిల్లా మంత్రులు గా మీరు స్పందించలేదని అన్నారు.
మీ చేతకాని తనాన్ని అలుసుగా, అవకాశంగా తీసుకొని ‘‘అనుమతిలేని ప్రాజెక్టు’’గా ‘‘అన్‌ అప్రూవ్డ్‌’’గా ఉందని తెలంగాణ ప్రభుత్వం వెలిగొండ కు నిధులు ఇవ్వద్దని చెప్పినా మీరు జిల్లా మంత్రి గా భాద్యత గా తెలంగాణ గురించి గానీ, కేంద్రం గురించి గానీ ఒక్క మాట మాట్లాడలేకపోయారని విమర్శించారు.
తెలుగుదేశం పార్టీతో రాజకీయాలు చేయకండి… ఇకనైనా మానండని స్వామి అన్నారు.వెలిగొండను రాజశేఖర్రెడ్డి ప్రారంభిస్తే జగన్మోహన్ రెడ్డి పూర్తి చేశారని మీరు చెబుతున్నారని ..? మీరు పూర్తి చేస్తే నీళ్ళు ఎందుకు ఇవ్వలేదని స్వామి ప్రశ్నించారు.వాస్తవ చరిత్ర కావాలంటే మీరు అధికారులను అడగండని … వెలిగొండ కు అప్పటికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు.
గత 5 సంవత్సరాలు గా టీడీపీ ఏమి చేశారని ప్రశ్నిస్తున్నారని ..టీడీపీ ప్రభుత్వంలో కొల్లంవాగు ద్వారా హెడ్రెగ్యులేటర్ పనులు పూర్తి చేస్తే, తదనంతరం . మీరు కాంట్రాక్టర్ను మార్చి కాసులకు కక్కుర్తి పడి గేట్లు అమర్చితే నాసిరకంగా పనులు చేయడం వల్ల గేట్లు లీకయ్యాయని స్వామి ఆరోపించారు.పులిచింతలలో గేటు ఊడిపోయినట్లు ఇక్కడ పరిస్థితి ఏమవుతుందని అన్నారు. జిల్లా ప్రజల గురించి, సమస్యలు మీకు అర్థం కావడం లేదా అని బాలినేని ని ప్రశ్నించారు.
రెండున్నర సంవత్సరాల పాలనలో మీరు ఏం చేశారు..? నీళ్లు ఇస్తామని మూడు సార్లు డేట్లు మార్చారని … ఎందుకు నీళ్ళు ఇవ్వలేక పోతున్నారని స్వామి అన్నారు.వెలిగొండ మొదటి దశ పనులు పూర్తయితే మీరు నీళ్లు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని స్వామి డిమాండ్ చేశారు.
పునరావాసం ఏడు వేల మందికి ఇవ్వాల్సి ఉండగా 50 మందికి మాత్రమే పునరావాసం ఇవ్వడం చోద్యం అని స్వామి వ్యాఖ్యానించారు. ఇదేనా మీకు ఉన్న చిత్తశుద్ధి అని స్వామి అన్నారు.
ముఖ్యమంత్రి రాయలసీమకు నీళ్లు తీసుకపోవాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు ను నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని, మాట్లాడితే మంత్రి పదవులు పోతాయని ఉద్దేశంతో మీరు మాట్లాడటం లేదని స్వామి ఎద్దేవా చేశారు. మీరు చేయాల్సిన పనులు మేము చేస్తున్నామని .. ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రిని కలిసి మా వెలిగొండ ప్రాజెక్టు ప్రశ్నార్ధకం కాకుండా అనుమతి కలిగిన ప్రాజెక్టుగా గెజిట్లో చేర్చాలని మేము మాట్లాడి వస్తే ..మీరు మా తెలుగుదేశం పార్టీపై మంత్రి బాలినేని విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని స్వామి అన్నారు.. ఇకనైనా భేషజాలు విడచి
వెలిగొండ ప్రాజెక్టు విషయంలో రాజకీయాలు చెయకుండా రాజకీయాలు పక్కన పెట్టి వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని స్వామి కోరారు.

Leave a Reply