– నక్సలైట్ల చేతిలో బలైన అమరులకు ఇదే నిజమైన నివాళి
తుపాకి గొట్టం ద్వారా రాజ్యాధికారం సాధ్యం అవుతుందనే బూటకపు సిద్ధాంతాన్ని నమ్మి, వర్గ శత్రువు నిర్మూలన అని పడికట్టు పదాలను ఆవలించుకొని, వర్గ శత్రువు రక్తంతో తడవనిదే విప్లవం కాదని.. హింస సిద్ధాంతంతో ఎంతోమంది అమాయకులను పొట్టన పెట్టుకొని వామపక్ష హింస, విధ్వంసం సిద్ధాంతంతో తెలంగాణ పల్లెల్లో వీళ్ళు చేసిన అరాచకాలు అంతా ఇంత కాదు.
నక్సలైట్ల పేరిట చలామణి అవుతూ ప్రజాస్వామ్యం అపహాస్యం చేస్తూ భారతదేశ సార్వభౌమ అధికారాన్ని ప్రశ్నిస్తూ తెలంగాణ ,చత్తీస్గఢ్ ముఖ్యంగా ఆదివాసి గిరిజన ప్రాంతాల్లో వీళ్ళు చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కావు. ఆదివాసీ గిరిజనులను చదువుకు దూరం చేస్తూ పాఠశాలలను పేల్చివేస్తూ .. ఆదివాసులను విద్యకు దూరం చేసి తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేశారు.
సమాచార వ్యవస్థలో భాగస్వామ్యమైన సెల్ఫోన్ టవర్లను పేల్చివేస్తూ , విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్లను , విద్యుత్ లైన్లను పేల్చివేస్తూ అభివృద్ధి నిరోధకులుగా వీళ్ళు పని చేశారు. చత్తీస్గడ్ తెలంగాణలో ఉన్న ఆదివాసి పల్లెలు ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నాయి.
ముఖ్యంగా 1980,90 దశకం లో నంబాల కేశవరావు విశ్వవిద్యాలయాలను విద్య సంస్థలను రాడికల్స్ అడ్డగా మార్చే వేసే ప్రయత్నాన్ని ఆనాటి ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. వీళ్ళ బూజు పట్టిన సిద్ధాంతాల్ని ప్రశ్నిస్తు వీళ్ళ రాచకాలని అడ్డుకున్న పాపంగా, ఎంతో మంది ఏబీవీపీ కార్యకర్తలను పొట్టను పెట్టుకున్నరు .
వీళ్ళు సమాజంలో హింస వాదులుగా చలామణి అవుతూ మావోయిస్టుల హింస ని అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు సామా జగన్ మోహన్ రెడ్డి, ఏటూరు నాగారం కు చెందిన పూజారి మాణిక్యం , నల్గొండకు చెందిన ఏచూరి శ్రీనివాస్, జగిత్యాలకు చెందిన మూదిగంటి జితేందర్ రెడ్డి , మెట్పల్లి కి చెందిన బండి మధుసూదన్ గౌడ్, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు పాలమూరుకు చెందిన మేరెడ్డి చంద్రారెడ్డి లాంటి ఏబీవీపీ కార్యకర్తలని పొట్టన పెట్టుకున్న రక్త చరిత్ర వీళ్లది.
వీళ్ళ రక్తదాహానికి దాదాపు ఏబీవీపీ విద్యార్థి సంస్థలో 30 మంది వీళ్ళ చేతిలో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణలో నక్సలిజం, మావోయిజం పేరిట దందాలు చందాలు వసూలు చేస్తూ, అమాయకులైన ఎంతోమంది గ్రామ సర్పంచులు, వార్డ్ మెంబర్లను ఎంపీటీసీలను ఇతర రాజకీయ నాయకులను పొట్టున పెట్టుకోవడం జరిగింది.
కానీ ప్రస్తుత తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ ప్రమాణాలను వీడాలి. ఎందుకంటే తెలంగాణలో ఒక క్లారిటీ లేని ప్రభుత్వం నడుస్తున్నది . తెలంగాణ రాష్ట్రం మావోయిస్టులు నక్సలైట్ల వల్ల ఎంతో నష్టాన్ని చవిచూసింది. ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక డైలమాలో ఉన్నది. ఎందుకంటే నక్సలైట్ల వల్ల కాంగ్రెస్ పార్టీలో కూడా చాలామంది నాయకులు కోల్పోయారు. మంత్రిగా ఉన్న దుద్దిళ్ల శ్రీధర్ బాబు తండ్రి శ్రీపాద రావు ని స్వయంగా నక్సలైట్లు కాల్చి చంపేశారు.
అదేవిధంగా ఒకప్పటి కాంగ్రెస్ లీడర్, డీకే అరుణ తండ్రి చిట్టెం నర్సిరెడ్డిని కూడా నక్సలైట్లు చంపివేశారు. ఒకప్పటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డిని 2007లో అటాక్ చేయగా ఆయన తృటిలో తప్పించుకున్నారు. ముగ్గురు కాంగ్రెస్ కార్యకర్తలు హతమయ్యారు. అలిపిరిలో ఉమ్మడి రాష్ట్ర సీఎం చంద్రబాబునాయుడుపై నక్సల్స్ దాడి తెలిసిందే. కానీ ఇవేమీ పట్టనట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆపరేషన్ కగార్ ఆపివేయాలి అని కోరడం హాస్యాస్పదం.
మావోయిస్టులతో సత్సంబంధాలు కలిగిన ధనసరి అనసూయ అలియాస్ సీతక్కను మంత్రివర్గంలో కొనసాగించడమే, కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలకు అద్దం అద్దం పడుతోంది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ తన వైఖరి మార్చుకోవా లి. ఆపరేషన్ కగార్ కొనసాగించి నక్సలైట్లను పూర్తిగా ఏరివేయాలి. అర్బన్ నక్సలైట్ల మీద కూడా ఫోకస్ పెట్టాలి.
తెలంగాణ, చతిస్గడ్ రాష్ట్రాల్లో శాంతి నెలకొల్పాలి. తుపాకి పట్టిన వాడు అదే తుపాకికి బలవడం గమనార్హం. నక్సలైట్లతో శాంతి చర్య చేర్చాలనేవి హాస్యాస్పదం. నక్సలైట్లు హిం సా మార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలవాలి.
– ప్రొఫెసర్ మురళీ మనోహర్
( Martyrs Memorial Research Institute- నక్సలైట్ల బాధిత కుటుంబాల సంఘం అధ్యక్షుడు )