Suryaa.co.in

Features

ఆపరేషన్ మిడ్‌నైట్..

దేశ విచ్ఛిన్నకర శక్తులపై.. భారతదేశ చరిత్రలో జరిగిన అతిపెద్ద దాడి..

22 సెప్టెంబర్ 2022, గురువారం, సమయం అర్ధరాత్రి ఒంటి గంట. పిఎఫ్‌ఐ సభ్యులు తమ ఇళ్ళల్లో ఆదమరచి, గాఢనిద్రలో ఉన్నారు. ఐతే తమ గాఢనిద్రకు మరికొద్ది సేపట్లో భంగం కలుగబోతోందని వారు కలలో కూడా ఊహించలా. ప్రతి రాష్ట్రంలోనూ.. సిఏపిఎఫ్ మరియు రాష్ట్ర పోలీసులతో జతకూడిన దాదాపు 200 మంది NIA అధికారులు.. నిర్దేశించిన వ్యూహాత్మక ప్రదేశాల్లో.. ప్రశాంతంగా నిలబడి తమ కమాండ్ సెంటర్ నుండి.. ఆపరేషన్ మొదలెట్టమనే ఆర్డర్ కోసం వేచి చూస్తున్నారు. సాధారణంగా.. వేకువఝామున 4:00 గంటలకు ఎవరైనా గాఢ నిద్రలో ఉండే సమయం.. ఇదే సమయాన్ని ఎంచుకున్నారు తమ ఆపరేషన్ మొదలెట్టడానికి. ఢిల్లీలో కూర్చున్న ఒక వ్యక్తి అందరినీ సమన్వయం చేస్తున్నాడు. ఉదయం 3:30 గంటలకు.. అనుకున్న సమయానికి అరగంట ముందు, ఆ సమన్వయకర్త నుండి “గో” అనే సూచన ఒచ్చేసింది. అంతే ఒక్కుమ్మడిగా రేసుగుర్రాల్లా ముందుకు దూసుకెళ్లారు.

ఐతే ఈ దాడుల పూర్వాపరాలు ఏంటసలు..?
ఢిల్లీలోని ఆజాద్ మైదాన్ నుండి షాహీన్ బాగ్ వరకు, కేరళ హత్యల నుండి రాజస్థాన్ – యూపీ అల్లర్ల వరకు, నిరంతరం వార్తల్లో వినపడే ఒక పేరు పిఎఫ్‌ఐ .. పూర్వ నామం సిమీ. 1990 ల్లోనూ ఆ తరువాత 2000 మొదట్లోనూ.. అనేక టెర్రర్ దాడులకు మూలకారణమైన వేర్పాటువాద సంస్థే సిమీ.
2001లో దీనిని వాజ్‌పేయి ప్రభుత్వం నిషేధిస్తే.. 2008లో సుప్రీంకోర్టు ఆ నిర్ణయం సరైందేనని సమర్థించింది. పిఎఫ్‌ఐ ఏర్పడింది 2006 లో. అప్పటి నుండి భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకూ తన కోరలు చాచింది. ఆర్నెల్ల క్రితం.. ఇంటెలిజెన్స్ బ్యూరో కేంద్ర హోమ్‌శాఖకు సిమీ అంటే పిఎఫ్‌ఐ తిరిగి తన విషపు కోరల తలను బయట పెట్టబోతోందనే క్లాసిఫైడ్ సమాచారం అందించింది. 2019 లో, మోడీ ప్రభుత్వం సీఏఏ చట్టాన్ని తెచ్చినప్పుడు.. ఆ చట్టాన్ని అడ్డుపెట్టుకుని.. బీజేపీ మరియు ఆర్‌ఎస్‌ఎస్‌లు ముస్లింలను దేశం నుండి తరిమికొట్టాలనుకుంటున్నారని.. అందుకే సీఏఏ చట్టాన్ని ముందుకు తెచ్చారని ముస్లింల బ్రెయిన్‌వాష్ చేయడానికి ఒక సాధనంగా పిఎఫ్‌ఐ వాడుకుంది. ముస్లింలలో భయభ్రాంతులను సృష్టించి.. వారిని కాపాడగల శక్తి తానని వారిని భ్రమింపజేసి.. వారి విశ్వాసం చూరగొని వేగంగా విస్తరించింది.

ప్రస్తుత ఆపరేషన్‌కు 5 సంవత్సరాల ముందు..
ఘజ్వా ఏ హింద్ కోసం పిఎఫ్‌ఐ పనిచేస్తోందని ఐబి నుండి మోడీ ప్రభుత్వానికి ఇన్‌పుట్ అందింది.
వారు ఆరెస్సెస్‌ను చూపించి ముస్లింలలో అభద్రతా భావాన్ని సృష్టించి వారిని ర్యాడికలైజ్ చేయడం ప్రారంభించారు. ఆరెస్సెస్‌పై.. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ లకు వ్యతిరేకి అనే ముద్ర వేసి.. హిందువులను విభజించడానికి విశ్వప్రయత్నం చేశారు.. ఇంకా చేస్తున్నారు. విషయం సున్నితమైనది కావడంతో.. నేరుగా మోదీ, మోహన్ భగవత్ మధ్య రహస్య సమావేశం జరిగింది. సమావేశంలో ఆ ముప్పును ఎదుర్కోవడానికి అనుసరించవలసిన అధికారిక, రాజకీయ వ్యూహాలపై సమగ్ర చర్చ జరిగింది.

రాజకీయంగా.. ఆరెస్సెస్, బీజేపీ లు రెండూ ముస్లింలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు మరింత చేరువై.. వారిని విభజించాలని.. తద్వారా దేశ విచ్చిన్నానికి అగ్గి రాజేయాలని.. పిఎఫ్‌ఐ వేసిన పన్నాగాన్ని చిత్తు చేశారు.
ఐక్యంగా ఉండే శత్రువర్గం, మరింత శక్తివంతం అవుతుందని క్షుణ్ణంగా తెలిసిన రాజకీయ దురంధరులు.. దాడికి ముందే ఆ వర్గాన్ని చీల్చి బలహీనపరచింది. ఎలాగంటే.. పిఎఫ్‌ఐ అధ్యక్షుడు ముస్లింలలోని అష్రఫ్ కమ్యూనిటీకి చెందినవాడు. అష్రఫ్ మరియు మరో బలమైన పాష్మాండ కమ్యూనిటీల మధ్య పోటీ నెలకొని ఉంది. ముస్లింలందరికీ మార్గదర్శకత్వం చేసే ఏకైక సంస్థ/ నాయకుడిగా మారాలనే పిఎఫ్‌ఐ ప్రణాళికను బలహీనపరిచేందుకు మోడీ పాష్మాండ వర్గాన్ని దగ్గరకు తీశారు.

ఆపరేషన్‌కు 6 నెలల ముందు..
హోమ్ మినిస్ట్రీ లో ఒక అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేయబడింది. అమిత్ షా, అజిత్ దోవల్, ఎన్ఐఏ, ఐబీ అధికారులు హాజరయ్యారు. సమావేశంలో హాజరైన వారందరినీ ఉద్దేశించి.. మనం పిఎఫ్‌ఐ ని నిషేధించాలా? అని అమిత్ షా ఒకేఒక ప్రశ్న అడిగారు. దానికి సగం మంది అధికారులు “అవును” అని మరియు సగం మంది “లేదు” అని అన్నారు. దోవల్‌జీ మీరేమనుకుంటున్నారని అమిత్ షా .. ఎన్‌ఎస్‌ఎ దోవల్ ని ప్రశ్నించారు. దోవల్ ఎప్పటిలానే నేరుగా జవాబివ్వకుండా.. తనకు కొంత సమయం కావాలని అడిగారు. ఇందులో వింతేమీ లేదు. సమావేశాల్లో దోవల్ గారిని మోదీ, షా లు ప్రశ్నలు అడిగేది కేవలం ఫార్మాలిటీ కోసమే. అసలు నిర్ణయం ఏంటి దాని అమలు ఎలా ఉంటుందనేది.. దేశంలోపలి వ్యవహారమైతే.. మోదీ దోవల్ షాలు.. విదేశీ వ్యవహారమైతే.. మోదీ దోవల్ జైశంకర్ లు.. ఆంతరంగికంగా సమావేశమై నిర్ణయం తీసుకోవడం.. వ్యూహం సిద్ధం చేసే పని దోవల్, జైశంకర్ లు తీసుకొంటారు. సమావేశంలో ఎవరు ఏం మాట్లాడాలనేది ముందుగానే చర్చించు కోవడం జరుగుతుంది. చాలా విషయాలు మోదీ, దోవల్.. వీరిరువురి మధ్య మాత్రమే ఉంటాయ్. సున్నితమైన వ్యవహారాలు మోహన్ భగవత్ దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది.
ఆ తరువాత దోవల్ . ఐబి, రా, ల్లో పనిచేసి.. తరువాత ఎన్‌ఎస్‌ఎ లో చేరి తన ఆంతరంగిక బృందంలో పనిచేస్తున్న మెరికల్లాంటి అధికారులతో సమావేశమై.. పిఎఫ్‌ఐ ని అణచివేయడానికి పూర్తి బ్లూప్రింట్ సిద్ధం చేశారు.
ఐబి – ఈడీ తో ఒక ఉమ్మడి బృందం తయారు చేయబడింది
పిఎఫ్‌ఐ పనితీరు మదింపు చేయమని ఐబి ని నిర్దేశించడం జరిగింది.
పిఎఫ్‌ఐ కు నిధుల ప్రవాహాన్ని కనిపెట్టమని ఈడీని ఆదేశించడమైంది.
ఇరు సంస్థలు తమ పనిని వెంటనే మొదలెట్టి.. ఈ ఆపరేషన్‌కు రెండు నెలల ముందే.. పూర్తి సమాచారం సేకరించి ఉంచారు.
ఇదిలా కొనసాగుతుండగా.. బీహార్‌లోని పిఎఫ్‌ఐ వ్యవహారాలను డేగకళ్ళతో గమనిస్తున్న NSA/IB/NIA సరైన సమయం చూసి అనూహ్యదాడితో.. వారివద్ద నుండి రహస్యమైన అత్యంత సున్నితమైన విజన్ 2047 డాక్యుమెంట్‌ను దొరకబుచ్చుకుంది. అసలా డాక్యుమెంట్ NSA చేతికి ఎప్పుడో అందింది.. కానీ ఈ దాడుల్లో భాగంగా బయటపెట్టారు. ఇది సాధారణంగా జరిగేదే. పిఎఫ్‌ఐ కార్యకలాపాల గురించి అన్నీ తెలిసినా.. దాని కార్యకర్తలందరినీ ఒక్కుమ్మడిగా కుమ్మే సమయం సందర్భం కోసం వేచి చూస్తూ ఒచ్చారు.

ఆపరేషన్‌కు 53 రోజుల ముందు..
అజిత్ దోవల్ ఒక సర్వమత సమావేశంలో ముస్లిం మతగురువులను కలుసుకుని.. దేశ వ్యతిరేక, విభజన సంస్థలన్నిటినీ తప్పనిసరిగా నిషేధించాలని.. వారి చేత తీర్మానం చేయించారు.
పిఎఫ్‌ఐ కి కూడా తెలుసు.. తమ సంస్థను ఏక్షణమైనా నిషేధించొచ్చని.. దానికనుగుణంగానే.. వారు ప్లాన్ బి తయారు చేసుకుని ఉంచుకున్నారు. ఆ విషయాల గురించి కూడా ఎన్‌ఎస్‌ఎ వద్ద పూర్తి సమాచారం ఉంది.
వారు అనేక ఇతర సంస్థలను.. SDPI, క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, NWF, AILC ఆల్ ఇండియా లీగల్ కౌన్సిల్, HRDF, SDTU, రిహాబ్ ఇండియా ఫౌండేషన్ వంటి అనేక సంస్థలను సిద్ధం చేసుకున్నారు.ప్రభుత్వం పిఎఫ్‌ఐ ని నిషేధిస్తే, వారు వేరే పేరుతో వెంటనే తమ కార్యకలాపాలు కొనసాగించవచ్చు.

ఆపరేషన్‌కు 1 నెల ముందు..
దోవల్ తన ప్రణాళికను మోదీ షా లకు సమర్పించారు. దాని పేరు ఆపరేషన్ మిడ్‌నైట్.. దాని లక్ష్యం.. పిఎఫ్‌ఐ ని బ్యాన్ చేసే ముందు.. కూకటి వేళ్ళతో సమూలంగా నాశనం చెయ్. దాంతో.. పిఎఫ్‌ఐ కీలక నేతలందరినీ ఒకేసారి అరెస్టు చేయడానికి.. భారతదేశ చరిత్రలో అతిపెద్ద దాడికి అంకురార్పణ జరిగింది.

20 రోజుల ముందు..
ఐఎన్‌ఎస్ విక్రాంత్ ప్రారంభోత్సవానికి మోదీ కొచ్చి వెళ్లగా, ఆయనతో పాటు దోవల్ కూడా అక్కడికి వెళ్లారు. దోవల్ కేరళ రాష్ట్ర పోలీసు డీజీపీతో రహస్యంగా మాట్లాడి ప్లాన్‌ గురించి చెప్పారు. అక్కడి నుంచి ముంబయి వెళ్లి గవర్నర్‌ హౌస్‌లో ఉండి కీలక ఎన్‌ఐఏ అధికారులను కలుసుకుని ప్రణాళిక వివరాలు చెప్పారు.

3 రోజుల ముందు..
దోవల్ – అమిత్ షా సమక్షంలో NIA, IB మరియు ED ల మధ్య సంయుక్త సమావేశం నిర్వహించబడింది. ఆ సమావేశంలో దోవల్ మొత్తం ప్రణాళికను వివరించారు.
సెప్టెంబర్ 22 అర్ధరాత్రి NIA మరియు ED యొక్క సంయుక్త బృందం.. దేశవ్యాప్తంగా పిఎఫ్‌ఐ కున్న 93 స్థావరాలపై దాడి చేస్తుంది. కీలక నేతలందరినీ ఒకేసారి ఒకేసమయంలో అరెస్టు చేస్తారు. వారిని మూకుమ్మడిగా అరెస్టు చేయకపోతే.. పిఎఫ్‌ఐ రెండవ అంచె నాయకులు దేశంలో అశాంతిని సృష్టిస్తారు మరియు సాక్ష్యాలను దాచిపెడతారు.. కాబట్టి వారందరినీ కలిసి అరెస్టు చేయడం అవశ్యం.
పిఎఫ్‌ఐ నేతల అరెస్ట్ తర్వాత.. శాంతిభద్రతల పరిస్థితి ఎలా ఉంటుందో ముందే విశ్లేషించారు. వాటిని అదుపులో ఉంచడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు.. ముస్లిం సంస్థల నుండి ఎటువంటి సానుభూతి మరియు మద్దతు లభించని విధంగా ప్రణాళిక రచించారు.

1 రోజు ముందు..
200 మంది NIA అధికారులు, ED అధికారులు, 4 IG లు, 1 ADG, 16 ఎస్పీలు, 1000 రాష్ట్ర పోలీసులతో ఒక బృందం సిద్ధమైంది.సమన్వయం కోసం 6 నియంత్రణ కేంద్రాలు మరియు న్యూఢిల్లీలో ఒక కమాండ్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి అజిత్ దోవల్ అందరినీ సమన్వయం చేశారు.

ఆపరేషన్ అర్ధరాత్రి…
పిఎఫ్‌ఐ కి ఆపరేషన్ గురించి తెలియదు. తమనెవరూ ఏమీ పీకలేరనే భ్రమలో ఉన్నారు.. కాదుకాదు ఉంచబడ్డారు.అర్ధరాత్రి ఒంటి గంటకు ఆపరేషన్ ప్రారంభమైంది. IB ఇన్‌పుట్‌ల ఆధారంగా 11 రాష్ట్రాల్లో గుర్తించబడ్డ 93 స్థావరాలకు NIA & ED బృందం చేరుకుని.. ఆదేశాల కోసం వేచి ఉంది.ఆపరేషన్ జరుగుతున్న ప్రదేశం వద్ద పిఎఫ్‌ఐ వాలంటీర్లు గుమిగూడకుండా చూడడానికి.. రాష్ట్ర పోలీసు బలగాన్ని సెకండ్ షీల్డ్‌గా ఉంచారు.
సరిగ్గా.. ఉదయం 4 గంటలకు ఆపరేషన్ షెడ్యూల్ చేయబడింది.
ఖచ్చితంగా సమయానికి అరగంట ముందు.. దోవల్ గారు ఢిల్లీ నుండి “గో” అనే ఆదేశం ఇచ్చారు.
అంతే.. జాయింట్ టీంస్ తమ దాడులను ప్రారంభించాయి. ఒక బృందం స్థావరాల్లో గాలింపు జరుపుతుండగా.. మరొక బృందం. పిఎఫ్‌ఐ నేతలను.. నిద్ర నుండి మేలుకునే అవకాశం ఇవ్వకుండానే.. అరెస్ట్ చేసి.. నిర్దేశిత ప్రాంతాలకు తోలుకెళ్ళారు.
పిఎఫ్‌ఐ నెట్వర్క్ కూడా తక్కువేమీ కాదు.. క్షణాల్లో వార్త వ్యాప్తి చెంది.. పిఎఫ్‌ఐ వాలంటీర్లు ఆయా స్థావరాలకు చేరుకోవడం ప్రారంభించారు. అయితే అప్పటికే నియమించబడిన పోలీసులు వారిని దూరంగా నిలిపివేశారు.
ఉదయం 5 గంటలకు దాడులు ముగిశాయి.
106 మంది పిఎఫ్‌ఐ నాయకులను, కార్యదర్శులను మరియు రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌లతో సహా అరెస్టు చేశారు. 150+ మొబైల్ ఫోన్‌లు, 50+ ల్యాప్‌టాప్‌లు, విజన్ డాక్యుమెంట్లు, నమోదు ఫారమ్‌లు, బ్యాంకు పత్రాలను NIA మరియు ED బృందం జప్తు చేసింది. నిషేధానికి ముందే.. 23 గురువారం ఉదయం సూర్యుడు ఉదయించకుండానే.. పిఎఫ్‌ఐ అస్తమించింది. పిఎఫ్‌ఐ మతం కార్డును ప్లే చేయడానికి ప్రయత్నించింది.. కానీ ముస్లిం మతపెద్దలతో ప్రభుత్వం ముందే జరిపిన చర్చలతో.. వారి నుండి మద్దతు లభించలేదు.భారతదేశంలోని అత్యంత శక్తివంతమైన వేర్పాటువాద సంస్థల్లో ఒకటి ఒక్క వేకువఝాములో అస్తవ్యస్తమైంది.. ధ్వంసమైంది.

ఇప్పుడీ కథ ఇంతటితో ముగియదు. NIA, ED లు.. వారు రికవరీ చేసిన సమాచారాన్ని మరింత తనిఖీ చేసి మరిన్ని చర్యలు తీసుకుంటారు.పిఎఫ్‌ఐ తమకు మద్దతుగా నిలిచే రాజకీయ పార్టీలు, NGO లు, న్యాయవాదులు, న్యాయవ్యవస్థలో చొరబడ్డ తమ అనుయాయుల సహాయంతో కోర్టుల్లో పోరాడటానికి ప్రయత్నిస్తుంది.పోరాటం చాలా కాలం సాగుతుంది కానీ బయటపడడం పిఎఫ్‌ఐ కి అంత సులభం కాదు.
ఆపరేషన్ మిడ్‌నైట్ అనేది ప్రపంచంలోనే అత్యంత చాకచక్యంగా అమలు చేయబడిన అతిపెద్ద ఆపరేషన్ మరియు భారతదేశాన్ని పిఎఫ్‌ఐ దుర్మార్గపు విజన్ 2047 నుండి రక్షించినది.

మీ ఇంటి ముందు ఎప్పుడూ ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉంటారు. ఒకరు మీకు హాని చేయాలనుకునే వ్యక్తి. మరొకరు మిమ్మల్ని రక్షించాలనుకునే వ్యక్తి. మీరు ఎవరితో నిలబడి ఉన్నారు అనేది నిర్ణయిస్తుంది మీ మనుగడను. 2004-14 మధ్య వందలాది బాంబు పేలుళ్లు జరిగాయి. కానీ 2014 తర్వాత ఒక్కటి కూడా లేదు. నీ ఒక్క “ఓటు” చాలా ముఖ్యం.. కుల కుటుంబ రాకీపాలకు తాకట్టు పెట్టొద్దు.

– పెంజర్ల మహేందర్ రెడ్డి
( అఖిల భారత ఓసి సంఘం మరియు
EWS ఎకనామికల్ వీకర్ సెక్షన్ జాతీయ అధ్యక్షుడు)

LEAVE A RESPONSE