నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్

మానవ హక్కుల పరిరక్షణలో, మానవ హక్కులను పెంపొందించడంలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కృషి చేస్తుందని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ మాంధాత సీతారామమూర్తి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక ఏ.సి కాలేజీ ఎదురుగా అంబేద్కర్ భవన్ లో మాదిగ సమైక్య పోరాట సమితి ఆధ్వర్యంలో రోడ్డు ప్రక్కన పాత చెప్పులు కుట్టే పనివారలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ మాంధాత సీతారామమూర్తి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ నా బాధ్యతగా మీకు సంతోషంగా నా వృత్తికి, ప్రవృత్తిగా మానవ హక్కుల పరిరక్షణ నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్మికులు తమ పిల్లలను2 బాగా చదివించాలని, సంస్కారంతో కూడిన విద్యను నేర్పించాలని , అందరిని గౌరవించేలా, మనకు ఉన్నంతలో ఇతరులకు సహాయపడాలని, ఉపకారం చేయకపోయినా అపకారం చేయరాదని బాధ్యతాయుతంగా పెంచాలన్నారు. ఇప్పటి పిల్లలే రేపటి పౌరులని, చేతి వృతులను వదులుకోకూడదని, అది అందరికి వచ్చే విద్య కాదన్నారు. భారత దేశంలో ఒక్కప్పుడు చాలా గొప్ప చేతి వృత్తులుండేవని, అగ్గి పెట్టెలో వస్త్రం పెట్టాలన్నా, ఒక శిల్పాన్ని చెక్కాలన్నా చేతి వృత్తిలో నైపుణ్యం వుండాలన్నారు. వృత్తే దైవం అని, తరతరాలుగా వస్తున్న కుల వృత్తులను గౌరవించాలన్నారు. వృత్తి వేరు, ప్రవృత్తి వేరని, మన
వృత్తే మనకు దైవమని పేర్కొన్నారు.

అనంతరం మాదిగ సంక్షేమ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు తంగిరాల యిర్మియా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ మాంధాత సీతారామమూర్తి, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సభ్యులు దండే సుబ్రహ్మమణ్యం ( జ్యుడిషియల్ ) డా. గోచిపాత శ్రీనివాసరావు ( నాన్ జ్యుడిషియల్ ) లతో కలసి పాత చెప్పులు కుట్టే పనివారలకు నిత్యావసర సరుకుల బియ్యం, కందిపప్పు, వంటనూనే, కూరగాయలు పంపిణీ చేసారు.

Leave a Reply