వరి వేస్తే ఉరి అనడం సరైంది కాదు

– పాదయాత్ర లో సీఎల్పీ నేత భట్టి

రేషన్ షాపుల ద్వారా అమ్మహస్తం పథకం పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం 9 సరుకులు పంపిణీ చేస్తే బంగారు తెలంగాణ పాలకులు కేవలం బియ్యం ఇస్తూ సంక్షేమాన్ని అమలు చేయడంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ 1 స్థానంలో ఉందని ప్రగల్భాలు పలకడం విడ్డూరంగా ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు.

రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వ హామీ అమలు కావడం లేదని దుయ్యబట్టారు. సంపద పెరిగిన రాష్ట్రంలో డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తామని ప్రకటించిన టీఆర్ఎస్ ప్రభుత్వం , హౌసింగ్ శాఖను ఎత్తివేసిందన్నారు. ఎనిమిదేళ్లుగా డబుల్ బెడ్ రూం ఇండ్లు ఎంత మందికి పంపిణీ చేశారో ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

కూలినాలి పనులతో కాయకష్టం చేసి పిజి, ఇంజనీరింగ్ చదివించిన పిల్లలకు ఎనిమిది సంవత్సరాలుగా ఉద్యోగాలు రాకపోవడంతో… ఉన్నత చదువులు చదివిన పిల్లలు సుతారి పనులకు వెళుతుడటం చూసి తల్లిదండ్రులు మానసికంగా కృంగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

300 కిలో మీటర్ల దూరం నడిచి ఈ దేశినేని పాలెం వచ్చా. రాత్రిపూట ఆలస్యమైనా కూడా గుండెల నిండా ప్రేమతో స్వాగతం పలికి మరలా ఈరోజు ఉదయం మరలా నాతో కలిసి నడిచిన దేశినేని పాలెం ప్రజలకు ధన్యవాదాలు. ఈ గ్రామంలో ఎంపీటీసీ గా గెలిచిన తులశ్యమ్మ గారు చెప్పినట్లే, ఏ ప్రజా ప్రతినిధి కూడా గెలిపించిన ప్రజల సమస్యలు తీర్చలేని పరిస్థితి కలిపించిది ఈ ప్రభుత్వం. ఈ ప్రాంతం అంత కూడా వ్యవసాయ ఆధారిత ప్రాంతం అలాంటి ఈ ప్రాంతం లో వరి వేయక ఏమి వేస్తారు…మన భూమిలో ఏమి పంట పండుతోంది మనకే తెలుస్తుంది…అలాంటిది ఎక్కడో కూర్చున్న ముఖ్యమంత్రికి ఏమి తెలుసు?

రాజరిక వ్యవస్థలో కూడా మార్కెట్లు ఉండేవి. కానీ ఇప్పుడు వరి వేస్తే ఉరి అనడం సరైంది కాదు. రైతులు వేసినా పంటలు ప్రభుత్వాలు కొనడం ప్రభుత్వాల బాధ్యత,గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా కొన్నాయి. ఎండలు మండుతున్నాయి అయినా ఈ ప్రజల కోసం ఎవరో ఒకరు పోరాటం చేయాలి. అందుకే రాష్ట్ర ప్రజల అందరి తరపున నేను పోరాటం చేస్తున్నా. ఒక్క అసెంబ్లీ లో పోరాడితే సరిపొకనే ఈ పాదయాత్రతో ప్రజల మధ్యకు వచ్చినా.

ఫ్రెండ్లీ పోలీస్ ప్రజలకా? టీఆర్ఎస్ నాయకులకా?
టిఆర్ఎస్ పార్టీకి సెకండ్ కేడర్గా పని చేస్తున్న పోలీసులు. తల్లి కొడుకుల మృతికి కారకులైన టిఆర్ఎస్ నాయకులను శిక్షించాలి. ఖమ్మంలో యువకుడి ఆత్మహత్య ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలి. ఖమ్మం పట్టణంలోని 57 డివిజన్ కార్పొరేటర్ భర్త ముస్తఫా టిఆర్ఎస్ ఆగడాలను ప్రశ్నించినందుకు పిడియాక్ట్ కేసులు పెట్టి అక్రమంగా జైల్లో నిర్బంధించారు. టిఆర్ఎస్ నాయకులు పాల్పడుతున్న అరాచకాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కట్టడి చేయాలని డిమాండ్. లేకపోతే ప్రజాగ్రహం చవిచూడాల్సి వస్తుంది.

Leave a Reply