అబద్ధం, నిజం
ఒకరికొకరు బాగా పరిచయం.
ఈ బావిలో నీళ్ళు చాలా బాగున్నాయి కలిసి స్నానం చేద్దామా అని అడిగింది అబద్ధం, నిజంతో ఒక రోజు ! ఇద్దరు బట్టలు తీసి గట్టున పెట్టి కలిసి బావిలో దిగారు, స్నానం చేశారు. అకస్మాత్తుగా హడావుడిగా స్నానం ముగించుకున్న అబద్ధం బావి నుంచి బయటపడి పరుగు తీసింది నిజం బట్టలేసుకుని !
నిజానికి బాగా కోపం వచ్చేసింది. మెట్లెక్కి బావి బయటకు వచ్చేసింది. నిజానికి తన బట్టలు కనిపించలేదు. నగ్నంగానే నిజం వీధుల్లోకి వచ్చింది. నిజాన్ని నగ్నంగా చూసిన ప్రపంచానికి కోపమొచ్చింది. అసహ్యమేసింది, దాన్ని చూడలేక మొహం తిప్పేసుకుంది. ఈ అవమానాన్ని తట్టుకోలేని నిజం, నిస్సహాయంగా మళ్ళీ బావిలోకి దిగిపోయి శాశ్వతంగా కనపడకుండా అదృశ్యమైంది.
ఇది జరిగినప్పటి నుంచి, అబద్ధం…నిజం బట్టలేసుకుని, తన్నుతాను సింగారించుకుని ప్రపంచాన్ని చుట్టేస్తున్నది. దాన్ని చూసి సమాజం కూడా మహా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే ప్రపంచానికి .. నగ్న సత్యాన్ని తెలుసుకోవడంపై ఎలాగు ఆసక్తి లేదు కాబట్టి !
-Jean Leon Gerome, 1896
French painter