Suryaa.co.in

Telangana

చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణకు ఉస్మానియా వర్శిటీ డాక్టరేట్‌

– 21 ఏళ్ల తొలిసారి డాక్టరేట్‌ ఇవ్వనున్న ఉస్మానియా వర్శిటీ

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి త్వరలో డాక్టర్ ఎన్వీ రమణ కాబోతున్నారు. ఆయనకు ఉస్మానియా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ ఇవ్వాలని నిర్ణయించింది. దేశ సర్వోన్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తిగా గతేడాది ఏప్రిల్‌ 24 నుంచి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వచ్చే నెల ఆగస్టు 26 వరకు ఆయన సీజేఐ హోదాలో కొనసాగనున్నారు. దీంతో..పలువురు ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లు ప్రధానం చేసిన ఉస్మానియా యూనివర్సిటీ సీజేఐ ను ఎంపిక చేసింది.

ఉస్మానియా నుంచి అందుకున్న వారి జాబితాలో ఆగస్టు 5న సాయంత్రం వర్సిటీలో జరగనున్న 82వ స్నాతకోత్సవంలో జస్టిస్‌ ఎన్‌.వి.రమణకు గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసారు. యూనివర్సిటీ ఛాన్సలర్ హోదాలో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఈ డాక్టరేట్ ప్రధానం చేయనున్నారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయం చివరిసారిగా 2001లో ప్రముఖ భారత-అమెరికన్‌ కంప్యూటర్‌ ఇంజినీర్‌ అరుణ్‌నేత్రావలికి గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది. తర్వాత రెండు దశాబ్దాలుగా ఎవరికీ ఇవ్వలేదు. 105 ఏళ్ల ఉస్మానియా యూనివర్సిటీకి ఎంతో ఘన చరిత్ర ఉంది తెలుగు వ్యక్తిగా ఇప్పుడు సీజేఐ ఇప్పటి వరకు ఈ విశ్వ విద్యాలయంలో 81 స్నాతకోత్సవాలు నిర్వహించారు.

LEAVE A RESPONSE