Suryaa.co.in

Andhra Pradesh

మా భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్‌

– మహిళల రక్తదాన శిబిరంలో ఆదిరెడ్డి శ్రీనివాస్‌
– 150 మంది తెలుగు మహిళలు రక్తదానం

రాజమహేంద్రవరం : తెలుగు మహిళ రాజమహేంద్రవరం సిటీ నియోజవకర్గ కమిటీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. లోకేష్‌ పుట్టిన రోజును పురష్కరించకుని స్థానిక దానవాయిపేట గానుగ వీధిలో ఉన్న సంజీవిని బ్లడ్‌ బ్యాంకులో 150 మంది మహిళలు రక్తదానం చేసి లోకేష్‌ పట్ల, తెలుగుదేశం పార్టీ పట్ల వారికి ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్‌ ముఖ్య అతిధిగా హాజరై ఈ రక్తదాశిబిరాన్ని ప్రారంభించి రక్తదానం చేసిన మహిళలకు ప్రశంసా పత్రాలు అందచేశారు. అనంతరం ఆదిరెడ్డి శ్రీనివాస్‌, రాజమండ్రి పార్లమెంట్‌ మహిళ కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి, టీడీపీ రాజమండ్రి నగర కమిటీ అధ్యక్షురాలు కోసూరి చండీప్రియ, అంగన్‌ వాడీ కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి కప్పల వెలుగు కుమారి మాట్లాడుతూ రక్తదానం ఎక్కువగా పురుషులు చేయడం చూస్తుంటామని, కానీ రాజమహేంద్రవరంలో అందుకు భిన్నంగా అధిక సంఖ్యలో మహిళలు రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. చంద్రబాబు నాయుడి వలే లోకేష్‌ కూడా మంచి విజన్‌ ఉన్న నాయకుడని, తమ భవిష్యత్తు నాయకుడు ఆయనేనన్నారు.

యువగళం పేరిట ఆయన నిర్వహించిన పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరధం పట్టారని, ప్రతి చిన్న విషయాన్ని, సమస్యను ఆయన క్షుణ్ణం పరిశీలించారన్నారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం తధ్యమని, ప్రతి సమస్యకు లోకేష్‌ పరిష్కారం చూపిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర కమిటీ ఉపాధ్యక్షులు ఉప్పులూరి జానకి రామయ్య, కార్యనిర్వాహక కార్యదర్శి ద్వారా పార్వతి సుందరి, తెలుగు మహిళలు మీసాల నాగమణి, గొర్రెల సత్యరమణి, కూరాకుల తులసి, కానేటి కృపామణి, సింహా నాగమణి, కోన సత్య, కర్ణం లక్ష్మీ నాయుడు, దంగేటి అన్నవరం, అప్సరి, తుళ్లి పద్మా, మోతా నాగలక్ష్మి, బర్ల గిరిజ, దొంగ నాగమణి, కె శ్యామలా తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE