‘‘అధికారం కోసం వచ్చిన వ్యక్తులము కాదు.భారత్ ను గొప్పగా నిర్మించడమే మాలక్ష్యం.
మహాన్ భారత్ ను నిర్మించే లక్ష్యంతో మా పార్టీ స్థాపించబడింది. అధికారం కోసం రాజకీయాల్లో వచ్చిన వ్యక్తులము కాదు‘‘ అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. అండమాన్ నికోబర్ లో బిజెపి కార్యకర్తలు, మేధావులతో ఏర్పాటు చేసిన సమావేశం లో ప్రసంగించిన అమిత్‌షా మేధావులు, పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అండమాన్ నికోబార్ బీజేపీ రాష్ట్ర ఇన్చార్జి అయిన పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్, ఆ రాష్ట్ర నేతలు సమావేశంలో పాల్గొన్నారు.ఇంకా అమిత్‌షా ఏమన్నారంటే..
‘‘ భారత దేశం అజాదీకా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న తరుణంలో, ప్రతి వ్యక్తి చిన్న చిన్న సంకల్పాలను తీసుకుంటే అది దేశంలో అతి పెద్ద మార్పుకు దారితీస్తుంది. జీవిత కాలంలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించను. ఎప్పుడు తల్లెలో అన్నం మెతుకులను వదలను. గది నుంచి ఎప్పుడు బయటకు వచ్చిన లైట్, ఫ్యాన్, ఎసీలను స్వీచ్ ఆఫ్ చేయనటువంటి చిన్న చిన్న సంకల్పాలు తల్లి భారతీని గొప్పగా తీర్చిదిద్దుతాయి. ఇలా 130 కోట్ల మంది ఎవరికి వారు ఇలాంటి సంకల్పాలను తీసుకొంటే ప్రపంచంలో మన సముచిత స్థానం మనకు లభించక తప్పదు ‘‘