ఫార్మా కంపెనీల కోసం మా భూములు లాక్కుంటారు

-ఆ భూములు లేకుంటే మాకు బతుకే లేదు
-బండి సంజయ్ కు వెలిమినేడు బాధితుల మొర

ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో ఫార్మా కంపెనీలకు అప్పగించేందుకు తాము ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న అసైన్డ్ భూములను టీఆర్ఎస్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటోందని నల్లగొండ జిల్లా వెలిమినేడు గ్రామానికి చెందిన బాధితులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కు వాపోయారు. తమకు జీవనాధారం ఆ భూములేనని, అవి లేకపోతే తమకు బతుకే లేదని అన్నారు.
• ఆ గ్రామానికి చెందిన పలువురు బాధితులు ఈరోజు గుండ్రాంపల్లిలోని పాదయాత్ర శిబిరం వద్ద బండి సంజయ్ ను కలిసి వినతి పత్రం అందజేశారు.418, 415,396,348, 385 సర్వే నెంబర్లకు చెందిన దాదాపు 300 ఎకరాల అసైన్డు భూములున్నాయని, 150 కుటుంబాలు దశాబ్దాల తరబడి ఈ భూములను సాగు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు.
• అయినప్పటికీ ఫార్మా కంపెనీలకు అప్పగించేందుకు ప్రభుత్వం ఆ భూములను స్వాధీనపర్చుకునేందుకు యత్నిస్తోందని, అందుకోసం ఇప్పటికే రెండుసార్లు నోటీసులు కూడా తమకు పంపిందని ఆవేదన వ్యక్తం చేశారు.
• తమ ప్రాంతంలో ఇప్పటికే 18 ఫార్మా కంపెనీలున్నాయని.. అవి వెదజల్లే కాలుష్యంతో అల్లాడిపోతున్నామని వాపోయారు. అయినప్పటికీ మళ్లీ టీఆర్ఎస్ నేత ఏర్పాటు చేసే ఫార్మా కంపెనీ కోసం ఆ భూములను లాక్కోవాలని యత్నిస్తున్నారని, మీరే న్యాయం చేయాలని వేడుకున్నారు.
• సానుకూలంగా స్పందించిన బండి సంజయ్ కుమార్ తప్పకుండా బాధితులకు న్యాయం జరిగేలా చూస్తానని, అందుకోసం అవసరమైన కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు.

గుండ్రాంపల్లిని చౌటుప్పల్ లో కలపండి:బండి సంజయ్ కు స్థానికుల వినతి

చారిత్రాత్మక పోరాటాల నేపథ్యమున్న గుండ్రాంపల్లి గ్రామాన్ని చౌటుప్పల్ మండలంలో విలీనం చేయాలని కోరుతూ ఆ గ్రామానికి చెందిన పలువురు ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు.
• ప్రస్తుతం గుండ్రాంపల్లి గ్రామం 15 కి.మీల దూరంలో ఉన్న చిట్యాల మండలంలో ఉందని, అదే సమయంలో నల్గొండ రెవిన్యూ డివిజన్ లో ఉండటంవల్ల 50 కి.మీల దూరం వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామానికి 8 కి.మీల దూరంలోనే చౌటుప్పల్ మండలంతోపాటు రెవిన్యూ డివిజన్ కేంద్రం ఉందన్నారు.
• చౌటుప్పల్ లో తమ గ్రామాన్ని విలీనం చేయడం ద్వారా తమకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. సానుకూలంగా స్పందించిన బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వం ద్రుష్టికి ఈ విషయం తీసుకువెళతానని హామీ ఇచ్చారు.

Leave a Reply