-ఇకపై మా అధినేత జోలికొస్తే జరిగబోయేది యుద్ధమే
-ముఖ్యమంత్రి వీధిరౌడీ కావడంవల్లే మారణహోమం!
-జగన్ రెడ్డి కులం ఫ్యాక్షనిజం…మతం సైకోయిజం
-రిషాంత్ రెడ్డి లాంటి సైకోలను మాపై ఉసిగొల్పుతున్నారు
-వైసిపి నేతల మాటలు విని వేధించే పోలీసులను వదలం…
-ఉద్యోగాలనుంచి డిస్మిస్ చేసి, కటకటాల వెనక్కి పంపుతాం
-వైసిపి బాధితుల ముఖాముఖిలో నిప్పులు చెరిగిన లోకేష్
పెదకూరపాడు: ముఖ్యమంత్రి వీధిరౌడీ కావడం వల్లే ఆయనను ఆదర్శంగా తీసుకొని వైసిపి సైకోలు రెచ్చిపోతున్నారు…51నెలల్లో 64మంది టిడిపి కార్యకర్తలను పొట్టనబెట్టుకున్నారు, వేలాదిమందిపై తప్పుడు కేసులు బనాయించారు, ఇక మా ఓపిక నశించింది… చంద్రబాబు ఆగమన్నా ఆగేది లేదని టిడిపి యువనేత నారా లోకేష్ నిప్పులు చెరిగారు. పెదకూరపాడు నియోజకవర్గం దొడ్లేరులో వైసిపి బాధితులతో యువనేత ముఖాముఖి సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… జగన్ రెడ్డి కులం ఫ్యాక్షనిజం, మతం సైకోయిజం. అందుకే రాష్ట్రంలో మారణహోమం సృష్టిస్తున్నాడు. బ్యాంకులను ముంచేసి లక్షకోట్లు దొబ్బి 14నెలలు చిప్పకూడు తిన్న 420 ముఖ్యమంత్రి కావడంవల్లే టిడిపి కేడర్ తో పాటు రాష్ట్రప్రజలు నరకం చూస్తున్నారు. మేం కార్యకర్తలను రెచ్చగొడుతున్నానని సజ్జల అంటున్నారు, మా వాళ్లను ఊచకోత కోస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? కేడర్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. ఇక మా ఓపిక నశించింది… మా వాళ్ల జోలికొస్తే జరగబోయేది యుద్ధమే.
రాష్ట్రంలో రాక్షసపాలనకు జగన్ శ్రీకారం చుట్టాడు… నేను ఫుల్ స్టాఫ్ పెడతాను. కార్యకర్తలను హతమార్చారు, తప్పుడు కేసులు పెట్టారు, ఇప్పుడు ఏకంగా మా అధినేతపైనే హత్యాయత్నం చేశారు, మరోసారి ఆయన జోలికొస్తే జరగబోయే పరిణామాలకు జగన్మోహన్ రెడ్డే బాధ్యత వహించాల్సి ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఇంటిపైకి దాడిచేసిన వాడికి, మమ్మల్ని బూతులు తిట్టేవారికి మంత్రి పదవులు ఇస్తున్నారు, దీనిద్వారా ప్రజలకు ఏమి సంకేతాలు ఇవ్వాలనుకుంటున్నారు?
జగన్ ఒక సైకో… చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి లాంటి సైకోలను జిల్లాకు ఒకర్ని తయారు చేసి మా కార్యకర్తలపైకి ఉసిగొల్పుతున్నారు. వైసిపి గూండాల మాటలు విని మా కేడర్ ను వేధించే పోలీసులను వదిలేదిలేదు. 9నెలల్లో అధికారంలోకి రాబోయేది మేమే. టిడిపి కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిపై జ్యుడీషియల్ విచారణ జరిపి, ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేస్తాం, తీవ్రతను బట్టి కటకటాల వెనక్కి కూడా పంపుతాం. వైసిపినేతలకు తొత్తులుగా మారి మా వాళ్లను ఇబ్బంది పెట్టిన వాళ్లు మూల్యం చెల్లించుకోక తప్పదు.
కేసులకు కార్యకర్తలెవరూ భయపడాల్సిన పనిలేదు. నాపై 20 కేసులు ఉన్నాయి, జెసి ప్రభాకర్ రెడ్డిపై 74 కేసులు బనాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులుపెట్టి, దాడులు పెడుతున్నారు. గతంలో బీహార్ లో ఇలాంటి పరిస్థితులు ఉండేవి, ఇప్పుడు జగన్ ఎపిని బీహార్ లా మార్చేశాడు. అధికారంలోకి రాగానే తెలుగుదేశం పార్టీ కేడర్ పై పెట్టిన తప్పుడు కేసులన్నీ ఎత్తేస్తాం. పసుపు సైనికులు ధైర్యంగా ఉండండి… ఈ లోకేష్ మీకు అండగా నిలచి గుండెల్లో పెట్టుకొని కాపాడతాడు.
ముఖాముఖి సమావేశంలో వైసిపి బాధితుల ఆవేదన:
1. శేషమ్మ, తంగెడ గ్రామం గురజాల : మాకు వైసీపీలో న్యాయం జరక్క 2019లో టీడీపీలో చేరాం. టీడీపీలోకి వచ్చామని మా అమ్మను గొడ్డలితో నరికి చంపారు. నోట్లో పురుగుల మందుపోసి చంపారు. టీడీపీలోకి వెళ్లి బతుకుతావా..నువ్వు ఎలా బతుకుతావో చూస్తాం అని వైసీపీ నేతలు అన్నారు. ఒక్కదాన్ని చేసి చంపారు. ఇళ్లంతా చిల్లాకొల్లం చేశారు. మాకు న్యాయం జరగాలి..మా అమ్మను ఇబ్బంది పెట్టిన వాళ్లను శిక్షించాలి. మీకు ఎవరున్నారు అని అన్నారు.
2. ఎల్లయ్య, జంగమహేశ్వరపాడు : కంచర్ల జాలయ్య, నేను దుర్గి నుండి బండిపై పెళ్లికి వెళ్లి వస్తుంటే వైసీపీ నేతలు బండిని అడ్డుకున్నారు. నా కాళ్లు, చేయి నరికారు. కంచర్ల జాలయ్యను ఊర్లోకి లాక్కెళ్లి చంపేశారు.
3. కంచర్ల జాలయ్య తల్లి, మాచర్ల : నా కొడుకు జాలయ్యను చంపే సమయంలో నేను బస్సులో వస్తున్నా. నా కొడుకుని కొడుతుంటే వదిలేయమని దండాలు పెట్టినా వదల్లేదు. ఎన్నికలయ్యాక మేము ఊరు విడిచి మాడుగులలో ఉంటున్నాం..పెళ్లికి వచ్చాం. నీ కొడుకు ప్రెసిడెంట్ అవుతాడా అంటూ గొడ్డలితో నరికారు. నా కొడుక్కి ముగ్గురు పిల్లలున్నారు. నువ్వు లోకేష్ దగ్గరకు వెళ్లే వాడివా అంటూ నా కొడుకును అన్నారు. చంపినవాళ్లను వదిలేసి, మాపైనే కేసు పెట్టారు. పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి, ఆయన తమ్ముడు వెంకట్రామిరెడ్డి తన మనుషులతో నరికి చంపించాడు.
4. దోమతోటి పిచ్చయ్య, అంబాపురం, గురజాల : నా తమ్ముడు విక్రమ్ 2019లో టీడీపీకి పనిచేశామని చంపారు. సీఐ దుర్గా ప్రసాద్ మా అన్నదమ్ములను పిలిచి స్టేషన్ లో కొట్టాడు. రూ.40 వేలు డబ్బులు తీసుకుని స్టేషన్ నుండి పంపారు. దీని తర్వాత నా తమ్ముడు హైదరాబాద్ వెళ్లాడు. ఓ గొడవ విషయంలో హైదరాబాద్ నుండి నా తమ్మున్ని స్టేషన్ కు పిలిపించారు. వైసీపీలోకి మారకపోతే చంపుతాం అని బెదిరించారు. మేము పార్టీ మారబోము అన్నాం..దీంతో నా తమ్ముడు స్టేషన్ నుండి వచ్చే సమయంలో దారికాచి చంపారు. ఇప్పటికీ మాపై ఒత్తిడి తెస్తున్నారు. నా తమ్మున్ని చంపిన వాళ్ల దగ్గర సీఐ డబ్బులు రూ.10 లక్షలు తీసుకుని కేసు లేకుండా చేశారు. నిందితున్ని జడ్పీటీసీని చేశారు.
5. అన్వర్ బాషా, మాచర్ల పట్టణం : పది రోజుల క్రితం కారంపూడి పట్టణంలో మండల పార్టీ అధ్యక్షున్ని వైసీపీ నేతలు కొట్టారు. ఫిర్యాదు చేయడానికి వెళ్తే నిందితులను ఆర్ అండ్ బి బంగ్లాలో పెట్టి మర్యాదలు చేశారు. ఎందుకు కొట్టారని అడగడానికి వెళ్తే మేమే కొట్టడానికి వచ్చామని 307 కేసులు పెట్టారు. మొదట నలుగురిపై పెట్టి, ఇతరులు అని రాసి 14 మందిపై కేసులు పెట్టారు. ఘటనలో నేను లేకపోయినా నాపైనా ఆ కేసులో 14వ ముద్దాయిగా పెట్టారు. బక్రీద్ కు ముందు రోజు కేసు పెట్టారు. నా కూతురు వచ్చి నాన్నా పండగకు ఇంటికి రావా అని అడిగింది. మేము స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నట్లు అనిపిస్తోంది. రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తి ఎమ్మెల్యేగా పనికిరాడు. బీసీ, ఎస్సీ, ఎస్టీలను ఇబ్బంది పెట్టాడు. మమ్మల్ని చంపితే పథకాలు ఇవ్వాల్సిన అవసరం ఉండదనే మా బలహీన వర్గాలను చంపుతున్నారు. ఎస్ఐ సీతారామాంజనేయులు 21 రోజులు కస్టోడియల్ టార్చర్ పెట్టారు. కోర్టుకు హాజరయ్యేదాకా నాపై ఏ కేసు పెట్టారో కూడా తెలియదు.
6. సోమేపల్లి గోవర్ధన్, కారుమంచి గ్రామం, వినుకొండ నియోజకవర్గం : జడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది. దీంతో బొల్లా బ్రహ్మనాయుడు తన డ్రైవర్ ను పంపించి మా ఇంటిపై దాడి చేయించాడు. దాడిలో నా ఎడమ కన్ను పూర్తిగా పోయింది. కుడికన్ను కూడా 30 శాతం దెబ్బతింది. అయినా నాపై కేసు పెట్టి వారం రోజులు రిమాండ్ కు పంపారు. అంతక ముందు రెండు సార్లు మాపై దాడి చేశారు. సీపీ ఫుటేజ్ లు కూడా అందించి కేసు పెట్టాలని అడిగితే పట్టించుకోలేదు. నాతో పాటు మరో వ్యక్తికి కళ్లు దెబ్బతిన్నాయి. 21 మందిపై కేసులు పెట్టారు..అందులో మహిళలు కూడా ఉన్నారు.
7. గంగినేని అంజయ్య, కారుమంచి : 2016లో కారుమంచి గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టాం. 2019 అక్టోబర్ లో విగ్రహం ప్రారంభించాం. కానీ ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించాలని బెదిరించారు. విగ్రహం ముందే వైసీపీ జెండా దిమ్మె పెట్టారు. విగ్రహానికి వైసీపీ జెండాలు కట్టారు. 2021 ఏప్రిల్ 4న మాపై దాడుల చేశారు. జడ్పీటీసీ గెలిచిన ఆనందంలో అడిగొప్పల గుడికి వెళ్లాం. మా గ్రామం నుండి వైసీపీ నేతలు ఫోన్లు చేసి కారంపూడిలో దాడిలో పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి అనుచరులతో దాడులు చేయించారు.
8. అచ్చిబాయి, రాజూ నాయక్ భార్య, భట్రుపాలెం, దాచేపల్లి మండలం : నా భర్తను పంచాయతీ చేద్దాం అని పలిచి చంపేశారు. నా భర్తను చంపినట్లు పోలీసులు వచ్చి నాకే చెప్పారు. కేసు పెట్టడానికి వెళ్తే తీసుకోలేదు. నా భర్తను చంపినవాళ్లలో ఎవర్నీ అరెస్టు చేయలేదు. తగాదా పెట్టుకున్నామని మాపైనే కేసు పెట్టారు.
9. తాళ్లూరు సుగుణమ్మ, పెదకూరపాడు, 75 తాళ్లూరు : చేయూత డబ్బులు పడలేదని సచివాలయానికి వెళ్లి అడిగితే రావన్నారు. ఎంపీడీవో కార్యాలయానికి 10 మందితో కలిసి వెళ్లి మాట్లాడిన తర్వాత, మా వాలంటీర్ ఆన్ లైన్ చేయడం లేదని మీడియాతో చెప్పాం. వైసీపీ కండువాలు వేసుకుంటే చేయూత వచ్చేలా చేస్తామని చెప్పారు. వైసీపీ నేతలు మా ఇంటిపైకి వచ్చారు. నా కొడుకును ఇష్టానుసారంగా కొట్టారు. వైసీపీ నేతలు కొట్టిన దెబ్బలతో నా కొడుకు కోమాలోకి వెళ్లాడు. తల ఆపరేషన్ చేస్తే మెంటల్ వస్తుందని డాక్టర్లు చెప్పారు. ఎంతో పోరాడితేకానీ నిందితులపై కేసు పెట్టలేదు.
10. సంతోష్, నర్సీపట్నం బీసీ యువకుడు : ఎస్పీ రిషాంత్ రెడ్డి మొదటి బాధితున్ని నేనే. అయ్యన్నపాత్రుడు జన్మదిన వేడుకల్లో బైక్ ర్యాలీ చేశాం. అప్పుడు మమ్మల్ని టార్గెట్ చేశారు. స్టేషన్ కు పిలిచి బల్లపై కూర్చోబెట్టి కర్రలతో కొట్టారు. కొట్టి పరుగెత్తాలని చెప్పారు..పరుగెత్తలేకుంటే మళ్లీ కొట్టేవాళ్లు. తలపై గన్ పెట్టి వాళ్లు పెట్టిన కేసులకు ఒప్పుకోవాలని అప్పట్లో ఏఎస్పీగా ఉన్న రిషాంత్ రెడ్డి బెదిరించారు.. కొడితే మేడపై నుండి పడ్డాను..దీంతో నా కాళ్లు విరిగాయి. 100 అడుగుల దూరంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లకుండా చిన్నపిల్లల ఆసుపత్రికి తీసుకెళ్లారు. తర్వాత నా తల్లిదండ్రులు వచ్చి పెద్దాసుపత్రికి తీసుకెళ్లారు. నాలుగేళ్లైనా నాకు న్యాయం చేయలేదు. రిషాంత్ రెడ్డి వ్యక్తిని సస్పెండ్ చేయాలి.
11. తురకా గంగమ్మ, సత్తెనపల్లి 31వ వార్డు : ఓ రెస్టారెంట్ లో నాకొడుకు అనిల్ పడి చనిపోయాడు. రూ.5 లక్షలు ప్రభుత్వ సాయం వచ్చింది. మున్సిపల్ చైర్మన్ ఇంటికి వెళ్తే రూ.2.5 లక్షలు ఇచ్చారు. దీంతో మంత్రి అంబటి రాంబాబు ఇంటికి వెళ్తే మాకు కూడా అవసరాలు ఉంటాయి, రూ.2.5 లక్షలు ఇవ్వాలని అన్నాడు. దీంతో మేము చెక్కు తీసుకోలేదు. నాకు టీడీపీ నేతలు అండగా ఉండి రూ.2.5 లక్షలు అందించారు. ప్రభుత్వం నుండి వచ్చిన రూ.5 లక్షల చెక్కు ఇప్పటికీ మాకు ఇవ్వలేదు.
12. వీరమ్మ, పీసీపాడు, క్రోసూరు మండలం : మా పెద్దబ్బాయి నేతాజీ 2006లో ఆర్మీలో చనిపోయాడు. చిన్న కోడలుకు అంగన్వాడీ టీచర్ గా ఉద్యోగం వచ్చింది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆడబిడ్డ అని కూడా చూడకుండా స్కూలుపై దాడి చేశారు..స్కూల్లోకి నా కోడలును రానివ్వలేదు. నా కొడుకుపైనే హత్యాయత్నం కేసు పెట్టారు. నీ కొడుకు ఆర్మీలో చనిపోతే నాకేంటమ్మా అని ఎస్ఐ అన్నారు. నా కొడుకుపై కేసు పెట్టాల్సిందే అని ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు అన్నాడు. సైనికుడి తల్లిగా నాకు ఏ ఆహ్వానం కూడా రాకుండా చేశారు. నా భర్తను స్టేషన్ లో కొట్టారు. కోర్టు ఆర్డర్ ఇచ్చినప్పటికీ నా కోడలును అంగన్వాడీ పోస్టులోకి తీసుకోలేదు. జగన్ ను సైకో అన్నందుకు వారం క్రితం నాపై హత్యాయత్నం కేసు పెట్టారు.
13. ఊర్మిళ, తుమ్మలచెరువు గ్రామం మాజీ సర్పంచ్, గురజాల నియోజకవర్గం : 2020లో మా 11 ఏళ్ల కొడుకు చనిపోయాడు. జడ్పీ హైస్కూల్ పక్కన ఆడుకోవడానికి వెళ్లి వైసీపీ నేతలు మైనింగ్ కోసం తీసిన గుంతల్లో పడి చనిపోయాడు. నా కొడుకు సంతోష్ కుమార్ తో పాటు మరో ఇద్దరు చనిపోయారు. ఘటనపై ఇప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. ఎందుకు జరిగిందో కూడా విచారణ చేయలేదు. కాసు మహేశ్ రెడ్డి అక్రమ మైనింగ్ కారణంగా 8 మంది చనిపోయారు.
14. వీరాంజనేయులు, వినుకొండ : ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కోట్ల రూపాయల మైనింగ్ చేశాడు. దాన్ని జీవీ ఆంజనేయులు మీడియా సమక్షంలో నిరూపించారు. దీనిపై నట్లు, బోల్టులు పోయినట్లు మాపై ఎమ్మెల్యే బొల్లా కేసులు పెట్టారు. దీనికి నిరసనగా అంబేద్కర్ విగ్రహానికి అర్జీ ఇవ్వడానికి వెళ్తుంటే ఎమ్మెల్యే మా మధ్యకు వచ్చి నా కొడకల్లారా రండి చూసుకుందాం అని తొడలు కొట్టాడు. పోలీస్ జీపుల్లోనే కర్రులు తెచ్చుకుని రాళ్లు విసిరారు. పోలీసులతో మాపైనే లాఠీఛార్జ్ చేశారు. పోలీసుల వెనక వైసీపీ కార్యకర్తలు వస్తున్నా వాళ్లను ఏమీ అనలేదు. సీఐ గన్ తీసి గాల్లోకి కాల్పలు జరిపారు. కావాలనే గన్ ఫైరింగ్ చేశారు. మావైపు గన్ చూపించి బెదిరించారు. నన్ను కొడితే తలకు 7 కుట్లు పడ్డాయి..నా వీపు మొత్తం లాఠీ దెబ్బలే ఉన్నాయి.