– రాష్ట్ర సమగ్రాభివృధ్దికి అదే ఏకైక మంత్రం
-రాష్ట్రంలో అందరు,అన్ని ప్రాంతాలు బాగుండాలి అందులో అమరావతి ఒక భాగంగా ఉండాలి. ఇదే నినాదంగా ప్రజలలోకి వెళ్లాలి
రాజధాని ఒకటే ఉండాలంటూ చంద్రబాబు,దోపిడీకి అలవాటుపడిన ముఠా చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి
పార్టీ జిల్లా అధ్యక్షులు,శాసనసభ్యులు,నియోజకవర్గసమన్వయకర్తలతో టెలీకాన్ఫరెన్స్ లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి
రాష్ట్ర సమగ్రాభివృధ్దికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ నిర్దేశించిన వికేంద్రీకరణ అనేదే ఏకైక మంత్రం అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.పార్టీ జిల్లాఅధ్యక్షులు,శాసనసభ్యులు,నియోజకవర్గసమన్వయకర్తలతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సోమవారంనాడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన పార్టీ ప్రజాప్రతినిధులు,నేతలు,పార్టీ కార్యకర్తలకు వారి కుటుంబాలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియచేశారు.అమ్మవారి ఆశీస్సులతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ పరిపాలనలో రాష్ట్రం బాగుండాలని,ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను అని అన్నారు.ఇంకా ఆయన ఏమన్నారంటే……
వికేంద్రీకరణకు సంబంధించినంత వరకు ప్రజావేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లు జరుగుతున్నాయి.మొన్న కాకినాడ, ఈరోజు రాజమండ్రిలలో జరుగుతున్నాయి. అమరావతి….29 గ్రామాలకు సంబంధించి రియల్ ఎస్టేట్ వెంచర్ లాంటి చంద్రబాబు పెట్టిన సోకాల్డ్ క్యాపిటల్. అది ఎండమావిలా ఆచరణలోనికి రానిది. చంద్రబాబు దోపిడీమార్గంగా ఎంచుకున్నమార్గానికి భిన్నంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆలోచనలతో డీసెంట్రలైజేషన్ లో భాగంగా మూడు రాజధానులను ప్రపోజ్ చేశాం. అది శాశ్వతంగా వికేంద్రీకరణ ఉండేలా భవిష్యత్తులో వేర్పాటువాదాలు తలెత్తకుండా మూడు ప్రాంతాల ప్రజల ఆకాంక్షలు నెరవేరేటట్లుగా ఆలోచన చేశారు.
ఈ వికేంద్రీకరణ వల్ల రాష్ర్టం సమగ్రంగా అభివృధ్ది చెందుతుందని అంతకుమించి ప్రత్యామ్నాయం లేదని నమ్ముతున్నాం. ప్రజలందరూ కూడా దీనికి మధ్దతు ప్రకటిస్తున్నవిషయం కూడా తెలిసిందే. దీనికి ప్రజలు మధ్దతు ఇస్తున్నారు అనేందుకు ఉదాహరణగా స్ధానికసంస్ధలనుంచి వరుసగా జరుగుతున్న ఎన్నికలలో ఫలితాలు దానిని ప్రతిఫలిస్తున్నాయి.ఈనేపధ్యంలో ప్రత్యర్ధులు ఆఖరికి దింపుడు కళ్లెం ఆశలాగా ఎలాగోలా బలవంతంగా అమరావతిని రాష్ర్టం అంతటా రుద్దాలని చూస్తున్నారు.
టీడీపీ వాళ్ళు దానిలో భాగంగా తిరుపతికి పాదయాత్ర చేశారు. ఆరోజు రెచ్చగొట్టడానికి ప్రయత్నించారు. ఈరోజు అరసవెల్లికి పాదయాత్ర చేస్తున్నారు. గతంలో రాయలసీమకు వెళ్లి అమరావతికి మధ్దతు ఇవ్వాలని పాదయాత్ర ద్వారా ట్రై చేశారు.అలజడులు రేపడానికి ప్రయత్నించారు. ఈరోజు మీరు గమనిస్తే విశాఖపట్నంవైపుకు వెళ్ళి అదే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ నేపధ్యంలో అమరావతి పేరుతో కొందరు కృత్రిమ స్వరాన్ని వినిపిస్తున్నారు. మరోవైపు వికేంద్రీకరణకు మధ్దతుగా తామంతా ఉన్నామని రాష్ర్టంలోని ప్రజలంతా గొంతుకలిపి నినదిస్తున్నారు. ఈ అభిప్రాయాలును ప్రతిధ్వనించేలాగా కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఉంది. అలా చేయకపోతే కృత్రిమ స్వరం నిజమైన స్వరం అనిపించే అవకాశం ఉంది. రాష్ర్టంలోని ప్రజలందరి అభిప్రాయాలు రిఫ్లెక్ట్ అయ్యేవిధంగా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
29 గ్రామాలలో రియల్ ఎస్టేట్ వెంచర్ టేకప్ చేశారో దానిని క్యాంపెయిన్ చేస్తున్న టిడిపి, చంద్రబాబు, దోపిడీ అలవాటు పడిన ముఠా చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలి. వదిలేస్తే వారి ఆలోచనే రాష్ర్టం ఆలోచన అనుకునే అవకాశం ఉంది. మనం కూడా గట్టిగా సమన్వయంతో తిప్పికొట్టే కార్యక్రమంలో భాగంగా ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లు జరుగుతున్నాయి. సహజంగా దీనిని ఛాంపియన్ చేసే విధంగా 29 గ్రామాల అభివృధ్దే రాష్ర్ట అభివృధ్ది అన్నట్లు వారి రియల్ ఎస్టేట్ వెంచరే ఐదుకోట్ల ప్రజల ఆకాంక్ష అన్నట్లు తెలుగుదేశం పార్టీ దాని తైనాతీలు చేస్తున్నదానిని బలంగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది.వారి పొలిటికల్ అజెండా అది.
మన రాజకీయలక్ష్యం అధికారవికేంద్రీకరణ,అదే రాష్ర్ట సమగ్రాభివృధ్ది ఏకైక మంత్రం. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజల ఆకాంక్షలు నెరవేరడం అనే బలమైన ఆలోచన. అన్ని వర్గాల మధ్దతు ఇచ్చే సహజమైన మన ఆలోచనా విధానం ప్రజలలోకి తీసుకువెళ్ళాలంటే మనమే నడుంకట్టాలి.
ఇది ప్రజలందరికి అనుకూలమైంది. సామాజిక అభివృద్దికి పనికివచ్చేది. సామాజిక సృహ కలిగిన వారు. ఓవరాల్ డెవలప్ మెంట్ మీద తపన పడేవారందరూ మధ్దతు ఇచ్చే పొలిటికల్ అజెండా ఇది. ఇలాంటిఆలోచనకు బలం ఎక్కువ ఉంటుంది. అయితే ఈ ఆలోచన ఉన్నవారందర్ని చేయి చేయి కలిపించి వారిని ముందుకుపెట్టి ప్రజలలో దీనిపై ఓ చర్చ జరిగేటట్లు చేసి తెలుగుదేశం పార్టీ దుర్మార్గమైన ఆలోచనను తిప్పికొట్టేట్లు కార్యాచరణను ఫిక్స్ చేసుకోవాలని ఇటీవల జరిగిన సమావేశాలలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ దిశానిర్దేశం చేశారు. పార్టీ సీనియర్ నేతలు అందరితో చర్చించి ఈ కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయం చేయడం జరిగింది.
పాదయాత్ర పేరుతో టిడిపి చేస్తున్న దండయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో ఎంటర్ అయింది. ఇక్కడ్నుంచి విశాఖ మీదుగా అరసెవెల్లి వరకు వెళ్తుంది. ఈలోపు ప్రతిచోట ఈ దండయాత్ర తప్పు. తెలుగుదేశం ఆలోచనను ప్రజలపై బలవంతంగా రుద్దడం సరికాదు. అది వివిధ వర్గాలు,ప్రాంతాలమధ్య చిచ్చుపెట్టేది అనే వాయిస్ రెయిజ్ కావాలి. దీనిని ప్రజలలోకి బలంగా తీసుకువెళ్లాలి.
ఈ నెల ఐదో తేదీన విజయదశమి రోజున రాష్ట్రంలోని అన్ని దేవాలయాలలో పెద్ద ఎత్తున పూజలు జరగాలి. కొబ్బరి కాయలు కొట్టి వికేంద్రీకరణకు అమ్మవారి ఆశీస్సులు కావాలని కోరుకోవాలి. రాష్ర్టం అంతటా కూడా వికేంద్రకరణకు మధ్దతు ఉందనే విషయం బలంగా తీసుకువెళ్లాలి.
వైఎస్ జగన్ రాష్ట్రంపైన,ప్రజలపైన ఉన్న మమకారంతో తీసుకువచ్చిన వికేంద్రీకరణ అజెండాకు అమ్మవారి ఆశీస్సులు కోరాలి.రాష్ట్రం అంతటా ప్రయోజనం జరిగే ఆలోచనకు అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం. దుర్మార్గపు ఆలోచన చేసే చంద్రబాబు,టిడిపికి మంచి మనస్సు ప్రసాదించివారి మనస్సు మారేలాగా ప్రార్ధన చేయాలి. వికేంద్రీకరణవైపు వారి మనస్సు మళ్లేలా చేయాలని అమ్మవారిని కోరాలి. దీనికి సంబంధించిన పూజలు విజయదశమిరోజు రాష్ట్రం అంతటా ప్రతిధ్వనించేలా చేయాలి.
వికేంద్రీకరణ అనేదే ఏకైక మంత్రం. అదేవిధంగా అందరూ,అన్ని ప్రాంతాలు బాగుండాలి అందులో భాగంగా అమరావతి ఉండాలి. ఇదే నినాదంగా ప్రజలలోకి వెళ్లాలి. ఇక్కడ ఎవరూ అమరావతికిగాని,29 గ్రామాలకు గాని వ్యతిరేకం కాదు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అజెండాలో ఉన్న అమరావతిలో శాసన రాజధాని,విశాఖపట్నంలో పరిపాలన రాజధాని,కర్నూలులో న్యాయరాజధాని. ఈ మూడు గతంలో తమిళనాడునుంచి మనం విడిపోయినప్పుడు శ్రీభాగ్ ఒప్పందం ప్రకారమైనా ఆ తర్వాత అన్ని ప్రాంతాల ప్రజల నుంచి వస్తున్న ఆకాంక్షల పరంగా చూసినా ఏదైతే కేంద్రీకృతమైన అబివృధ్ది హైద్రాబాద్ లో జరగడం వల్ల అసమానతలు పెరిగి విభజన తర్వాత మనం దెబ్బతిన్నాం.
భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఇది ఒక్కటే తారకమంత్రం వేరేఆలోచన లేదు. ఇదే సమయంలో అమరావతి వేరే ఎక్కడో లేదు. అన్ని ప్రాంతాలు బాగుండాలి. ప్రజలంతా బాగుండాలి అందులో అమరావతి బాగుండాలి. ఇది నినాదంగా ముందుకు వెళ్ళాలి.
ఒకటే నినాదం మార్మోగాలి. వికేంద్రీకరణవైపు ఏదైతే రాష్ట్రం అడుగులు వేస్తుందో దానికి పూర్తిగా మా మధ్దతు ఉంది. వికేంద్రీకరణే రాష్ర్ట అభివృధ్దికి తారకమంత్రం. వికేంద్రీకరణే అభ్యుదయానికి తొలిమెట్టు.అనే ధ్యేయంతో ముందుకు వెళ్లాలి.