Suryaa.co.in

Andhra Pradesh

మాది ప్రజా ప్రభుత్వం.. ప్రజలకు అండగా ఉంటా

– ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు.
– ప్రజా దర్బార్ లో అర్జీలు స్వీకరించిన మంత్రి సుభాష్

రామచంద్రపురం: ప్రజలే దేవుళ్ళు.. సమాజమే దేవాలయం అనే నినాదంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని, ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజా దర్బార్( ప్రజల నుంచి వినతుల స్వీకరణ కార్యక్రమం ) నిర్వహిస్తున్నామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. శనివారం మంత్రి రామచంద్రపురంలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించి వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.

ప్రతి అర్జీలను క్షుణంగా పరిశీలించి తక్షణ చర్యలు గైకొంటామని ఈ సందర్భంగా మంత్రి సుభాష్ అర్జీదారులకు హామీ ఇచ్చారు. ఇది ప్రజా ప్రభుత్వమని, ప్రజా సమస్యల పరిష్కారమే తమ తొలి ప్రాధాన్యత అని వెల్లడించారు. అర్జీదారుల సమస్యలు కూలంకుషంగా విన్న మంత్రి సుభాష్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.

ఇది ప్రజలచే ఎన్నుకోబడిన మంచి ప్రభుత్వం అని, ప్రజా సంక్షేమం, రాష్ట్ర పురోభివృద్ధి స్వర్ణాంధ్ర విజన్ -2047 లక్ష్యంతో కూటమి ప్రభుత్వ పాలన ముందుకు సాగుతుందన్నారు. రామచంద్రపురం నియోజవర్గంలోనే కాకుండా కూటమి ప్రభుత్వo రాష్ట్ర రాజధాని అమరావతిలో కూడా ప్రజాదర్బార్ ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు.

LEAVE A RESPONSE