-మన చంద్రన్న శ్రీరాముడు… జగన్ సైకో.
-చంద్రన్న విజనరీ… జగన్ ప్రిజనరి
-లక్ష రూపాయల చెప్పులు వేసుకునే వాడు పేదవాడా?
-వెయ్యి రూపాయల వాటర్ బాటిల్ తాగేవాడు పేదవాడా?
-పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రజల మనిషి గా ఎలా ఉండాలో అర్థమైంది
-నా కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కడిని వదిలి పెట్టను
-అమలాపురం లో ఉన్నా అమెరికాలో ఉన్నా పట్టుకొచ్చి లోపలేస్తా
-పోరాటం మన పసుపు సైన్యం బ్లడ్ లో ఉంది
-రాజమహేంద్రవరం బహిరంగ సభలో నారా లోకేష్
తెలుగుదేశం పార్టీ కుటుంబ పండగ మహానాడు కి వచ్చిన పసుపు సైన్యానికి, పార్టీ పెద్దలకు సలాం. రాజమహేంద్రవరం పేరులోనే రాజసం ఉంది. గోదావరి నీళ్లు ఎంత స్వచ్ఛంగా ఉంటాయో ఇక్కడ ప్రజల మనస్సు అంత స్వచ్ఛంగా ఉంటుంది. గోదారొళ్ల యటకారం, మమకారం రెండూ సూపర్.
తెలుగుదేశం పార్టీ పేరు చెబితే పౌరుషం, పసుపు జెండా చూస్తే పూనకం. తెలుగుదేశం పార్టీ కంచుకోటకు కాపలా కాస్తున్న పసుపు సైన్యానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. తెలుగు జాతిని ప్రపంచానికి పరిచయం చేసిన మూడు అక్షరాల పేరు ఎన్టీఆర్. రాముడైనా, కృష్ణుడైనా, రావణుడైనా అది ఎన్టీఆర్.
కష్టం వస్తే ప్రజల కన్నీరు తుడిచింది ఎన్టీఆర్. ఢిల్లీకి తెలుగోడి పవర్ చూపించింది ఎన్టీఆర్. ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజకీయ, ఆర్థిక స్వాతంత్య్రం ఇచ్చింది ఎన్టీఆర్. రూ.2 కే కిలో బియ్యం, పక్కా ఇళ్లు, జనతా వస్త్రాలు, మధ్యాహ్న భోజన పధకం ఇలా సంక్షేమాన్ని దేశానికి పరిచయం చేసింది ఎన్టీఆర్.
మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించి అన్నగారు అయ్యారు ఎన్టీఆర్.పార్టీ పెట్టడానికి హిస్టరీ ఉండాలి. పార్టీ నడపడానికి క్యాలిబర్ ఉండాలి.తెలుగుదేశం పార్టీ పెట్టిన ఎన్టీఆర్ గారికి హిస్టరీ ఉంది. పార్టీ ని నడుపుతున్న బాబు గారికి క్యాలిబర్ ఉంది. ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచ పటంలో పెట్టింది చంద్రన్న.హైటెక్ సిటీతో చరిత్ర సృష్టించింది చంద్రన్న, కియా, హెచ్సిఎల్, ఫ్యాక్స్ కాన్, టిసిఎల్ లాంటి ఎన్నో కంపెనీలు తీసుకొచ్చి అభివృద్ధికి అర్ధం చెప్పారు చంద్రన్న.
చంద్రన్న భీమా, పండుగ కానుకలు, పెళ్లి కానుక, రైతు రుణమాఫీ, పసుపు కుంకుమ లాంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టింది, అన్న క్యాంటిన్ తో పేదవాడికి అన్నం పెట్టింది మన చంద్రన్న. తెలుగుదేశం పార్టీ, మన అధినేతల రికార్డులు కొట్టే మగాడు పుట్టలేదు, పుట్టడు. టిడిపి అంటే తెలుగు వారు గర్వంతో మీసం మెలేసే పార్టీ…వైసిపి అంటే తెలుగు వారు తలదించుకునే పార్టీ. టిడిపి అంటే ఘన చరిత్ర ఉన్న పార్టీ…వైసిపి అంటే గలీజు పార్టీ. మనది సైకిల్ పాలన…వైసిపి ది సైకో పాలన.మన చంద్రన్న శ్రీరాముడు… జగన్ సైకో. చంద్రన్న ది అభివృద్ధి…జగన్ ది అవినీతి. చంద్రన్న విజనరీ… జగన్ ప్రిజనరి. చంద్రన్న నిలబెడితే…జగన్ పడగొడతాడు. చంద్రన్న హీరో…జగన్ జీరో.
ఎన్నికల ముందు ఒక్క ఛాన్స్ అంటూ జగన్ సాఫ్ట్ గా నటించాడు. సీఎం అయిన తరువాత సైకో గా మారిపోయాడు. అందుకే స్వీట్ గా సైకో జగన్ అని పేరు పెట్టా. నాలుగేళ్ళలో మనం పీకింది ఏంటి అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారని నాలుగేళ్ల తరువాత అపాయింట్మెంట్ ఇచ్చిన ఒక ఎమ్మెల్యే కలిసినప్పుడు సైకో జగన్ ని అడిగితే ఎం చెప్పాడో తెలుసా? ప్రజా వేదిక పీకా, పేదల ఇళ్లు పీకా, టిడిపి నాయకుల ఇళ్లు పీకా, ఓవర్ ఆల్ గా రాష్ట్రాన్ని పీక్కు తిన్నానని అని చెప్పాడట.
ఒక్క ఛాన్స్ ఇచ్చి 151 సీట్లు ఇస్తే సైకో జగన్ దేశంలోనే ధనిక సీఎం అయ్యాడు. పైగా పేదవాడ్ని అంటూ బీద అరుపులు అరుస్తున్నాడు. లక్ష కోట్లు ఆస్తి ఉన్నవాడు పేదవాడా? లక్ష రూపాయల చెప్పులు వేసుకునే వాడు పేదవాడా? వెయ్యి రూపాయల వాటర్ బాటిల్ తాగేవాడు పేదవాడా?బెంగుళూరులో ప్యాలస్, హైదరాబాద్ లో ప్యాలస్, తాడేపల్లి లో ప్యాలస్, ఇడుపులపాయలో ప్యాలస్, ఇప్పుడు వైజాగ్ లో మరో ప్యాలస్ కడుతున్నాడు. ఇన్ని ప్యాలస్ లు ఉన్నవాడు పేదవాడా? సిమెంట్ కంపెనీలు, పవర్ ప్లాంట్లు, సొంత టివి, ఛానల్ ఉన్నవాడు పేదవాడా?
సైకో జగన్ చిన్నప్పుడు చాక్లెట్ దొంగ…పెద్దయినా బుద్ధి మారలేదు. ఇప్పుడు బడా చోర్ గా మారాడు. పేదల జేబులో డబ్బులు కొట్టేస్తున్నాడు జగన్. ఎలా కొట్టేస్తున్నాడో తెలుసా? విద్యుత్ ఛార్జీలు 8 సార్లు బాదుడే బాదుడు, ఆర్టీసీ బస్ ఛార్జీలు 3 సార్లు బాదుడే బాదుడు, ఇంటి పన్ను బాదుడే బాదుడు, చెత్త పన్ను బాదుడే బాదుడు. పెట్రోల్, డీజిల్ ధరలు బాదుడే బాదుడు, నిత్యావసర సరుకుల ధరలు బాదుడే బాదుడు.
సైకో జగన్ కి పబ్లిసిటీ పీక్…మ్యాటర్ వీక్. ప్రతి ఇంటికి జగన్ స్టికర్ అతికిస్తున్నారు. కరెంట్ బిల్లు, ఆర్టీసీ టికెట్, చెత్త పన్ను, పెట్రోల్, డీజిల్ బిల్లు పై నీ బొమ్మ వేసుకునే దమ్ముందా సైకో జగన్? సైకో జగన్ రాక్షసుడు…పేదల ఆకలి అరుపులు ఆయనకి ఆనందాన్ని ఇస్తాయి. అందుకే అన్న క్యాంటిన్ కట్, పండుగ కానుక కట్, పెళ్లి కానుక కట్, చంద్రన్న భీమా కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కట్, ఫీజు రీయింబర్స్మెంట్ కట్, 6 లక్షల పెన్షన్లు కట్. సైకో జగన్ కి పరిపాలన చేత కాదు కానీ అతనో మంచి పెయింటర్. పేదలకు ఇళ్లు కట్టలేని జగన్ మన చంద్రన్న కట్టిన టిడ్కొ ఇళ్లకు వైసిపి రంగులు వేస్తున్నాడు.
టిడిపి ది పక్కా ఇళ్ల పాలసీ … వైసిపి ది గుడిసెల పాలసీ.మన చంద్రన్న అద్భుతమైన టిడ్కో ఇళ్లు కట్టారు. ఇంకో ముప్పై ఏళ్లు అయినా ఆ ఇళ్లు చెక్కు చెదరావు. సైకో జగన్ సెంటు స్థలాలు ఇచ్చి చేతులు ఎత్తేసాడు. సెంటు స్థలాల స్కీం పెద్ద స్కాం. రైతుల దగ్గర తక్కువ ధరకు కొని ప్రభుత్వానికి ఎక్కువ రేటుకి అమ్మి 7 వేల కోట్లు కొట్టేసారు వైసిపి నేతలు.
పేదవాళ్లు శాశ్వతంగా అప్పుల్లో కూరుకుపోవడమే ఈ సెంటు స్థలాల స్కీమ్. ఎన్నికల ముందు ఇళ్లు నేనే కడతా అన్న సైకో జగన్ ఇప్పుడు అప్పు చేసి ఇళ్లు కట్టండి లేకపోతే స్థలం వెనక్కి ఇవ్వండి అని బెదిరిస్తున్నాడు. ఒక పేదవాడు రెండు రూపాయల వడ్డీకి 10 లక్షలు అప్పు తెచ్చి ఇళ్లు కట్టగలడా? కడితే ఆ అప్పు తీర్చగలడా? ఆ పేద కుటుంబం జీవితం మొత్తం కష్టపడినా అప్పు తీరదు. వాళ్లు శాశ్వతంగా అప్పుల్లో కూరుకుపోతారు.
ఈ స్కాం లో ఇంకో ట్విస్ట్ గురించి చెప్పనా? ఇళ్లు కట్టుకునే స్థోమత లేని వారి పట్టాలు వైసిపి నేతలు కొట్టేస్తున్నారు.సైకో జగన్ పాలనలో యువత, మహిళలు, వృద్ధులు, రైతులు, కార్మికులు, ఉద్యోగస్తులు అందరూ బాధితులే. ప్రజా సమస్యలు తెలుసుకోవాలి, ప్రజల తరపున పోరాడాలి అని నేను యువగళం పాదయాత్ర మొదలు పెట్టాను.
నాకు 40 ఏళ్ళు. ఈ నలభై ఏళ్ళు ఒక ఎత్తు…నేను పాదయాత్ర చేసిన 110 రోజులు ఒక ఎత్తు. 110 రోజుల యువగళం పాదయాత్ర లో ప్రజల కష్టాలు కళ్లారా చూశాను. సైకో జగన్ విధ్వంస పాలనతో రాష్ట్రం సర్వనాశనం అయ్యింది. చంద్రన్న పాలనలో జరిగిన అభివృద్ధి చూసాను. జగన్ పాలనలో జరిగిన డ్యామేజ్ చూసాను.
ఉద్యోగాలు లేక యువత ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు, నకిలీ విత్తనాలతో రైతన్న నష్టపోతున్నాడు, తాగునీటి కోసం మహిళలు బిందెలు మోసుకుంటూ ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మనం తెచ్చిన ఎలెక్ట్రానిక్స్, ఐటి కంపెనీలు కనిపించాయి… పాపాల పెద్దిరెడ్డి పది వేలకోట్ల అవినీతి సామ్రాజ్యం కనిపించింది.ఉమ్మడి అనంతపురం జిల్లాలో చంద్రన్న తెచ్చిన కియా, డ్రిప్ ఇరిగేషన్ కనపడింది… జగన్ తెచ్చిన కష్టాలు కనపడ్డాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో చంద్రన్న తెచ్చిన విమానాశ్రయం, మెగా సీడ్ పార్క్, జైన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, మెగా సోలార్ పార్క్, సిమెంట్ ఫ్యాక్టరీలు, సాగునీటి ప్రాజెక్టులు కనిపించాయి…జగన్ మిగిల్చిన కన్నీరు కనిపించింది.
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఒక బీసీ మహిళ మునీరాజమ్మ జగన్ పాలనలో పడుతున్న బాధని నాతో చెప్పుకుంది. మీడియాతో మాట్లాడింది.పిల్ల సైకో బియ్యపు మధుసూదన్ రెడ్డి మునిరాజమ్మ టిఫిన్ బండిని ధ్వంసం చేసాడు. కాళ్లు పట్టుకొని క్షమాపణ కోరితే వదిలేస్తాం అన్నారు అయినా ఆమె తగ్గలేదు. సైకో పాలన పై పోరాడింది ఆమెకు టిడిపి అండగా నిలబడింది. ఆమె ధైర్యాన్ని నేను స్ఫూర్తిగా తీసుకున్నాను.
పలమనేరుకి చెందిన మిస్బా తల్లితండ్రులు నన్ను కలిసారు. వైసిపి నాయకుడు కూతురు స్కూల్ ఫస్ట్ రావాలి అని మిస్బాకి టీసీ ఇచ్చి వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేసారు. డాక్టర్ అవుతానని డైరీ లో రాసుకున్న మిస్బా ని చంపేసిన పాపం ఈ సైకోలను ఊరికే వదలదు. ఇలాంటి బాధ ఏ కుటుంబానికి రాకూడదని కోరుకున్నాను.
ఎమ్మిగనూరులో రైతులతో సమావేశమైనప్పుడు రంగమ్మ అనే మహిళా రైతు తన భర్త 12 ఎకరాలు కౌలుకి తీసుకోని అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్నాడు అని కన్నీరు పెట్టుకుంది. ఆ మహిళా రైతు కష్టాన్ని చూసి తట్టుకోలేకపోయాను. వెంటనే ఆమెకు పార్టీ తరపున సాయం అందించాను. మంత్రాలయం నియోజకవర్గం వలస కూలీలను కలిసాను. వ్యవసాయ పనులు లేక పిల్లలతో సహా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి వస్తన్న వారితో మాట్లాడాను. వ్యాన్ లో వాళ్ళను చూసిన తరువాత నాకు బాధ కలిగింది. ఆలూరు నియోజకవర్గంలో నీళ్ల కోసం మహిళలు కిలోమీటర్లు నడవడం చూసాను. ప్యాలస్ లో పడుకునే సైకో కి మహిళలు పడుతున్న కష్టం కనపడటం లేదు.
జి.డి నెల్లూరు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు చిన్న టిఫిన్ సెంటర్ పెట్టుకొని జీవిస్తున్న మోహన అనే మహిళను కలిసాను. ఆమె భర్త చనిపోయాడు. కష్టపడి ఇద్దరు పిల్లల్ని చదివించారు. పెద్దబ్బాయి ఎంసిఎ, చిన్నబ్బాయి డిప్లొమా చేసారు. ఆమె ప్రభుత్వం నుండి మాకు ఎటువంటి సాయం వద్దు. పిల్లలకు ఉద్యోగాలు వచ్చేలా చూడండి చాలు అని అన్నారు. ఆ మాటలు విన్న తరువాత ఎంత బాధ్యతగా పనిచెయ్యల్లో అర్థమైంది.
పెనుకొండ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు పద్మావతి అనే యువతి వచ్చి నన్ను కలిసింది. ఆమె కియా అనుబంధ సంస్థలో పనిచేస్తుంది. అంతకు ముందు హౌస్ వైఫ్ గా ఉన్న ఆమె ఇప్పుడు కియా అనుబంధ సంస్థలో పనిచేస్తూ నెలకు రూ.30 వేల జీతం సంపాదిస్తుంది. ఆమె కళ్ళలో ఆనందం చూసిన తరువాత నాకు చాలా సంతోషం వచ్చింది.
రాప్తాడు నియోజకవర్గంలో పాదయాత్ర చేసినప్పుడు టిడిపి నాయకుడు తగరకుంట ప్రభాకర్ గారి పిల్లలు నన్ను కలిసారు. 2004 లో వైఎస్ గారు సీఎం అయిన తరువాత తగరకుంట ప్రభాకర్ గారిని దారుణంగా హత్య చేసారు. వారి పిల్లల్ని ఎన్టీఆర్ మోడల్ స్కూల్ లో చదువుకున్నారు. అందరికి ఉద్యోగాలు వచ్చాయి.ప్రభాకర్ గారి చిన్న అమ్మాయి శ్రావణి వచ్చి అన్ని విషయాలు చెప్పి తనకి కూడా బెంగుళూరు లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం వచ్చింది అన్నా అన్నప్పుడు చంద్రన్న లో మానవత్వం గుర్తొచ్చింది.
పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రజల మనిషి గా ఎలా ఉండాలో అర్థమైంది. యువత, మహిళలు, రైతులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఎదుర్కుంటున్న సమస్యలు పాదయాత్రలో తెలుసుకున్నాను.అధినేత, పార్టీ పెద్దల దృష్టికి సమస్యలు తీసుకోచ్చాను. దానిలో భాగంగానే వారికి మేలు చేసే విధంగా కొన్ని హామీలు ఈ రోజు చంద్రన్న ఇస్తున్నారు.యువగళం పాదయాత్ర అడ్డుకోవడానికి సైకో జగన్ రాజారెడ్డి రాజ్యాంగం ప్రయోగించాడు. నేను అంబేద్కర్ గారి రాజ్యాంగంతో సమాధానం చెప్పాను.
నేను ముందే చెప్పాను సాగనిస్తే పాదయాత్ర అడ్డుకుంటే దండయాత్ర అని. పెద్దిరెడ్డి నుండి పెద్దారెడ్డి వరకూ నన్ను అడ్డుకుంటాం అని ఛాలెంజ్ చేసిన. అందరికి ఒకటే సమాధానం ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు. ఎవడు వస్తాడో రండి తగ్గేదేలే అంటే అంతా పారిపోయారు. విద్య, వైద్యం, ఆర్థిక సహాయం…దేశంలో కార్యకర్తల సంక్షేమం కోసం రూ.150 కోట్లు ఖర్చు చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. కార్యకర్తకు కష్టం వస్తే మీ లోకేష్ ఆగడు… కార్యకర్త ఇబ్బందుల్లో ఉంటే సైకో జగన్ స్పందించడు.
నా కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కడిని వదిలి పెట్టను అమలాపురం లో ఉన్నా అమెరికాలో ఉన్నా పట్టుకొచ్చి లోపలేస్తా. పోరాటం మన పసుపు సైన్యం బ్లడ్ లో ఉంది. ప్రతిపక్షంలో పోరాడిన ప్రతి కార్యకర్త బాధ్యత నాది.పెద్ద పెద్ద సైకోలనే ఫుట్ బాల్ ఆడిన పార్టీ టిడిపి. పిల్ల సైకో ఒక లెక్కా? పేదలు ఎప్పటికీ పేదరికం లో ఉండాలి అనేది సైకో జగన్ కోరిక.పేదరికం లేని రాష్ట్రం చూడాలి అన్నది మీ లోకేష్ సింగిల్ పాయింట్ ఎజెండా. రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఉరి తీసి భూమిలో పాతేద్దాం. సైకో ని ప్యాలస్ లో పెట్టి పర్మినెంట్ గా తాళం వేద్దాం.సైకో పోవాలి…సైకిల్ రావాలి. చివరిగా ఒక మాట చెబుతాను వందేళ్లు కాదు వేయేళ్లు అయినా ట్రూ లెజెండ్ ఎన్టీఆర్ లివ్స్ ఆన్. అందరూ క్షేమంగా జాగ్రత్తగా ఇంటికి వెళ్లండి.