బహ్రెయిన్ లో ఎన్టీఆర్ శత జయంతి వేడుక

– ముఖ్య అతిధిగా నారా రోహిత్

శుక్రవారం సాయంత్రం ఎన్టీఆర్ శత జయంతి వేడుక కన్నుల పండుగా ఎన్టీఆర్ అభిమానులు తెలుగుదేశం శ్రేణులు ఘనంగా ఒక పండగ వాతావరణము లో జరుపుకున్నారు.

ఈ కార్యక్రమానికి స్వదేశం నుండి ముఖ్య అతిధిగా నారా రోహిత్ మరియి గుమ్మడి గోపాల కృష్ణ  ముఖ్య అతిధులుగా ఈ కార్యక్రమానికి విచ్చేశారు….ఈ కార్యక్రం జ్యోతి ప్రజ్వలన తో మొదలైంది.

తెలుగు దేశం బహ్రెయిన్ అధ్యక్షులు రఘునాధ్ బాబు మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగు జాతికి గర్వకారణమైన ఒక మహాపురుషుడు మరియు తర తరాలను తన్మయం చేయగల కారణజన్ముడు, చిరస్మరణీయుడు అని కొనియాడారు. . అలాగే నారా రోహిత్ గారు మరియు గుమ్మడి గోపాల కృష్ణ గారు తెలుగు దేశం ని గెలిపించవలసిన బాధ్యత మనపై ఉందని మనం అందరం కలిసి సహకరించ వలసిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పారు.

శివ కుమార్ , హరిబాబు , మురళీకృష్ణ , రాజశేఖర్ , గోపాల్ చౌదరి అనేకమంది వక్తలు నేతలు ఎన్టీఆర్ ని, వారు తెలుగు జాతికి అందించిన సేవలను కొనియాడుతూ , ఎన్టీఆర్ ని ఒక గొప్ప నాయకుడుగా, గొప్ప కళాకారుడు గా తెలుగు వారి ఆరాధ్య దైవంగా తెలుగు వారి హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయే ఒక మహాపురుషుడు గా వర్ణించారు.కార్యక్రమం ఆద్యంతం ఆట పాట లు తో ఒక్కో పాత్ర సభికులు ఉత్సాహ పరిచింది.ఎన్టీఆర్ శత జయంతి వేడుకలో ప్రవాసాంధ్రులు దాదాపు అయిదు వందల మందికి పైగా పాల్గొన్నారు. మహానాడు జ్ఞాపికగా కేక్ కట్ చేసి ముగించారు .

Leave a Reply