• అడ్డగోలుగా అప్పులుచేయడం.. అయినవారికి కాంట్రాక్టర్లకు దోచిపెట్టడం
• ఆగస్ట్ లో మద్యం బాండ్ల అమ్మకంతో రూ.15వేలకోట్ల అప్పు
• ఆగస్ట్ 15 నాటికి రూ.65వేలకోట్ల అప్పులతో రాష్ట్రం, దేశంలోనే అగ్రస్థానంలో నిలవనుంది
• జగన్ రెడ్డి ఇప్పటికే రూ.11.30లక్షల కోట్లు అప్పులుచేశాడు
• జగన్ సర్కార్ పరిమితికి మించి అడ్డగోలుగా అప్పులు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ?
• ఏపీ ప్రభుత్వంపైనే కేంద్రప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఎందుకు ఇంత ఉదారత చూపుతున్నాయి?
– టీడీపీ అధికారప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్
2022-23 ఆర్థికసంవత్సరంలో మొదటి మూడునెలల (ఏప్రియల్, మే, జూన్) ఫలితాలను కాగ్ బయటపెట్టిందని వాటిని పరిశీలిస్తే, కేంద్రం నిధులు కాకుండా జగన్ ప్రభుత్వం రూ.29,032 కోట్ల ఆదాయాన్ని అర్జించిందని, దానితో పాటు, రూ.39,498 కోట్ల అప్పులు చేసినట్టు బయటపడిందని, మొత్తానికి త్రైమాసిక ఫలితాల్లో జగన్ సర్కారు ఘోరంగా విఫలమైందని టీడీపీ అధికారప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
రోజుకి రూ.322కోట్ల ఆదాయం వస్తోంది… అదిచాలక జగన్ రెడ్డి రోజుకి రూ.439కోట్ల అప్పుచేస్తున్నాడు. అప్పులకు రోజుకి రూ.70.68కోట్ల వడ్డీ కడుతున్నాడు
“జగన్ సర్కార్ అప్పుల లెక్కల్లోని డొల్లతనాన్ని కాగ్ నివేదిక రూపంలో బయటపెట్టిం ది. జూన్ నాటికే రూ.39,498 కోట్ల అప్పులుచేసిన జగన్ సర్కార్ ఆదాయార్జన కంటే అప్పులకే అధికప్రాధాన్యత ఇస్తోందని తేలిపోయింది. సంపాదించిన దానికంటే 36 శాతం అదనంగా అప్పులుచేయడం ఎలాంటి పాలనో జగన్మోహన్ రెడ్డే సమాధానం చె ప్పాలి. రోజుకి రూ.322కోట్ల ఆదాయం సాధిస్తున్న జగన్, ఆ సొమ్ముచాలక రోజుకి రూ.439కోట్ల అప్పులుచేస్తున్నాడు. చేసిన అప్పులకు జగన్ సర్కార్ ప్రతిరోజు రూ. 70.68కోట్ల వడ్డీ కడుతోంది.
భవిష్యత్ లో జగన్ రెడ్డి భారీస్థాయిలో అప్పులకు సిద్ధమ వుతోంది. రూ.15వేలకోట్లకు సావరిన్ మద్యంబాండ్లను విడుదలచేసి భారీగా అప్పు చే యడానికి సిద్ధమైంది. టిప్స్ అండ్ అసోసియేట్స్ సంస్థను అండర్ మీడియేటర్ గా పెట్టి, ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా రెండువిడతల్లో రూ.15వేలకోట్ల అప్పు తీసుకోనుంది. మొదటివిడతలో ఆగస్ట్ 10నాటికి 9.62శాతం వడ్డీతో రూ.10వేల కోట్ల అప్పు పొందనుంది. బ్యాంకులు 6శాతం వడ్డీకి రుణాలిస్తుంటే, జగన్ సర్కార్ అడ్డగో లుగా 9.62శాతం వడ్డీకి అప్పులు తెస్తోంది.
ఏపీ ప్రభుత్వానికి మద్యం అమ్మకాల ఆదాయమే ప్రధాన ఆదాయవనరని తెలుసుకాబట్టి, మద్యంబాండ్లు కొనడానికి సిద్ధపడతారు. గత ఏడాదే ఏపీ.బీ.సీ.ఎల్ ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ కలిపి రూ.21వేలకోట్ల ఆదాయం వచ్చింది. సంవత్సరానికి రూ.25వేలకోట్లు కచ్చితంగా వస్తున్నాయని తెలిసినప్పుడు మద్యం బాండ్లు అమ్ముడుపోవడంలో ఆశ్చర్యంలేదు. మద్యం బాండ్లు తాకట్టుపెట్టి అప్పులు తీసుకొస్తున్న ఏకైక ప్రభుత్వం దేశంలో జగన్ ప్రభుత్వమే. మద్యం అమ్మకాలు లేకపోతే ఈ ప్రభు త్వం ఎప్పుడో చతికిలపడేది.
ఆగస్ట్ 15 నాటికి రూ.65 వేలకోట్ల అప్పులు…మూడున్నర నెలల్లో రికార్డుస్థాయి అప్పులతో జగన్ దేశంలో నెంబర్-1 గా నిలిచాడు
ఏప్రిల్ నెలలో బ్యాంకులు, ఇతర ఆర్థికసంస్థల నుంచి ప్రభుత్వం తీసుకొచ్చిన అప్పు రూ.17,487కోట్లు, ఏప్రియల్ నుంచి జూన్ వరకు రిజర్వ్ బ్యాంక్ ద్వారా చేసిన అప్పు లు రూ.25,500కోట్లు. జూలైలో ఇప్పటివరకు చేసిన అప్పులు రూ.4వేలకోట్లు. ఆగస్ట్ 2న రూ.2వేలకోట్ల అప్పుకు ఇప్పటికే ప్రభుత్వం ఇండెంట్లు పెట్టింది. మద్యం బాండ్ల అమ్మకం ద్వారా ఆగస్ట్ లో తీసుకునేఅప్పు రూ.15వేలకోట్లు. మొత్తంగా ఆగస్ట్ 15 నాటికే జగన్ సర్కార్ రూ.65వేలకోట్ల అప్పులు చేయనుంది. కేవలం మూడున్నర నెల్లలో ఈ స్థాయిలో అప్పులుచేసిన ముఖ్యమంత్రి జగన్ ఒక్కడే. నిజంగా అప్పులు చేయడంలో జగన్ రెడ్డే నంబర్ 1 అని దేశమంతా తెలిసిపోయింది.
జగన్ సర్కార్ అడ్డగోలుగా అప్పులుచేస్తున్నా, కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? రాష్ట్రప్రజలపై భారంపడుతుందని తెలిసీ అప్పులివ్వడం ద్వంద్వప్రమాణాలకు నిదర్శం కాదా?
జగన్ సర్కార్ ఆగస్ట్ 15కే రూ.65వేలకోట్లు అప్పులు చేయనుందని టీడీపీ చెబుతుం టే, ఎఫ్.ఆర్.బీ.ఎం ఏం చేస్తోంది? ఎఫ్.ఆర్.బీ.ఎం లిమిట్ రూ.30,275కోట్లు అయితే, జగన్ సర్కార్ మూడున్నరనెలల్లో దానికంటే రెండున్నర రెట్ల అప్పు ఎక్కువ చేసింది. 9నెలల్లో రూ.30వేలకోట్ల అప్పుకు అనుమతిస్తే, జగన్ సర్కార్ మూడునెలల్లోనే ఆ లిమిట్ దాటేసింది. అన్నిరాష్ట్రాలు ఎఫ్.ఆర్.బీ.ఎంకు లోబడి వ్యవహరిస్తుంటే, ఏపీ ప్రభుత్వం మాత్రమే ఎందుకు హద్దులు మీరుతోంది? జగన్ సర్కార్ పరిమితికి మించి అడ్డగోలుగా అప్పులుచేస్తుంటే కేంద్రప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?
కేంద్ర ఆర్థికశాఖకు జగన్ రెడ్డి చేస్తున్న అప్పులు కనిపించడంలేదా? ఊరికే పైకి ఇంత అప్పు చేశారు.. అంతచేశారని చెప్పడమే కానీ చర్యలు ఎందుకు తీసుకోరు? బీజేపీ రాష్ట్ర శాఖ ఇటీవల వెల్లడించిన అప్పుల వివరాల్లో కూడా ఎఫ్.ఆర్.బీ.ఎం ప్రస్తావన లేకుండానే జగన్ ప్రభుత్వం ఇంత అప్పుచేసిందని చెప్పింది. బీజేపీ రాష్ట్రవిభాగం జగన్ చేసిన అప్పులపై మాట్లాడిన కొన్ని గంటలకే రిజర్వ్ బ్యాంక్ ఏపీప్రభుత్వానికి రూ.3వేలకోట్ల అప్పులు ఇస్తున్నట్టు వెబ్ సైట్లో పెట్టింది.
ఈ మతలబులోని ఆంతర్యం ఏమిటో, ఏపీ ప్రభుత్వంపై రిజర్వ్ బ్యాంక్ కు, కేంద్ర ప్రభుత్వానికి ఇంత ఉదారత ఏమిటో ఢిల్లీ పెద్దలే చెప్పాలి. అన్నిరాష్ట్ర్లాలకు ఒకేన్యాయం, ఒకే చట్టమని చెప్పే కేంద్రం దాన్ని ఆచరణలో ఎందుకు పాటించడంలేదు. జగన్ రెడ్డికి అప్పులిస్తే ఏపీప్రజలే నష్టపోతారని తెలిసీ పరిమితికి మించి అప్పులివ్వడం ద్వంద్వప్రమాణాలకు నిదర్శనంకాదా?
రూ.39వేలకోట్ల అప్పుల్లో కేవలం రూ9వేలకోట్లే జగన్ సర్కార్ బటన్ నొక్కుడుకు వినియోగించింది. మిగిలిన సొమ్ము అడ్డగోలుగా అయినవారికి దోచిపెట్టింది
ప్రజల కోసమే తాము అప్పులుచేస్తున్నామని జగన్ సర్కార్ చెప్పడం కూడా పచ్చి అబద్ధం. బటన్ నొక్కుడుకు గోరంత వెచ్చిస్తున్న జగన్ సర్కార్.. కొండంత సొమ్ముని అప్పనంగా కాజేస్తోంది. జూన్ నెలాఖరువరకు చేసిన రూ.39వేలకోట్ల అప్పులు + రూ.29వేల కోట్ల ఆదాయం మొత్తం కలిపి రూ.70వేలకోట్ల సొమ్ములో ఏపీప్రభుత్వం రూ.9,348 కోట్లు మాత్రమే సంక్షేమపథకాలకు (సబ్సిడీకి) వెచ్చించినట్టు కాగ్ నివేదికే చెప్పింది. ఆదాయంలో నుంచి ఖర్చు చేయకుండా కేవలం అప్పుల్లో రూ.10వేలకోట్లు బటన్ నొక్కుడుకు వెచ్చిస్తే, రూ.12.500 కోట్లు కాంట్రాక్టర్లకు ధారాధత్తంచేశారు. మిగిలిన సొమ్ముకి లెక్కాపత్రం లేవు.
నచ్చిన కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికి జగన్ వెనకా ముందు ఆలోచించడం లేదు. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల ముసుగులో పనులు చేయని కాంట్రాక్ట్ సంస్థలకు రూ.950 కోట్లు కట్టబెట్టారని పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ చెప్పారు. ఆయన వ్యాఖ్యలపై ప్ర భుత్వం ఎదురుదాడిచేసింది తప్ప వాస్తవాలు వెల్లడించలేదు. కాంట్రాక్టర్లకు ఇతర చె ల్లింపులకు టీడీపీప్రభుత్వం తీసుకొచ్చిన సీ.ఎఫ్.ఎం.ఎస్ విధానాన్ని జగన్ పక్కన పెట్టాడు. అడ్డగోలు చెల్లింపులకోసమే ఇలా చేశాడు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినవెంటనే మరలా సీ.ఎఫ్.ఎం.ఎస్ విధానాన్ని పునరుద్ధరించి, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ విధానంలోనే చెల్లింపులు చేస్తాం.
జగన్ రెడ్డి అడ్డగోలుగా చేసే అప్పులన్నీ ఎప్పటి కైనా చెల్లించాల్సింది ప్రజలే. నాలుగున్నరేళ్లలో జగన్ రెడ్డి ఇప్పటికే రూ.11.30లక్షల కోట్లు అప్పులుచేశాడు. ఆదాయం లేకుండా అప్పులుచేస్తూ, రోడ్లు, ప్రాజెక్టులు, ఇళ్లు ఏవీ నిర్మించకుండా ఆ సొమ్మంతా జగన్ రెడ్డే బొక్కేస్తున్నాడు. ప్రజలు వాస్తవాలు తెలుసుకొని జగన్ రెడ్డిని నిలదీయాల్సిన సమయం వచ్చింది. జగన్ రెడ్డి చేస్తున్న అడ్డగోలు అప్పులపై, అతనికి సహకరిస్తున్న వ్యవస్థలు, అధికారులపై టీడీపీ ప్రభుత్వం కచ్చితంగా చర్యలు తీసుకుంటుంది” అని విజయ్ కుమార్ హెచ్చరించారు.