Suryaa.co.in

Andhra Pradesh

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చిత్ర‌ప‌టానికి క్షీరాభిషేకం

గాజువాక హౌస్ క‌మిటీ ఆధ్వ‌ర్యంలో సంబ‌రాలు

ఎన్నో ఏళ్లుగా అప‌రిష్కృతంగా ఉన్న గాజువాక హౌస్ క‌మిటీ స‌మ‌స్య‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌రిష్కారం చూప‌డం ప‌ట్ల ముఖ్య‌మంత్రి చిత్ర‌ప‌టానికి స్థానికులు, వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు క్షీరాభిషేకం చేశారు. గాజువాక హౌస్ కమిటీ సమస్యను ప‌రిష్క‌రిస్తూ ప్ర‌భుత్వం జీవో నంబ‌ర్ 71 విడుద‌ల చేయ‌డం ప‌ట్ల స్థానికులు, వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు సంబ‌రాలు చేసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా గాజువాక ప్రాంతానికి పట్టి పిడుస్తున్న.. 4 దశాబ్దాలుగా ఎవరూ పట్టించుకోలేదు. గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, గాజువాక వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జ్ దేవన్ రెడ్డి కృషి ఫలితంగా ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం ల‌భించింద‌ని హ‌ర్షం వ్య‌క్తం చేశారు. స‌మ‌స్య ప‌రిష్కారం కావ‌డంతో ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌కు దన్యవాదాలు తెలుపుతూ..ఆయ‌న చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం చేశారు. సర్వే నంబరు 86,87, 274 హైస్కూలు రోడ్ , కణితిరోడ్ , బానోజీతోట ప్రాంతాలలో 30 ఎళ్ళుగా పట్టి పీడిస్తున్న సమస్య నేటికి వీడింది. ఇప్పటి నుండి హౌస్ కమిటీలో వున్న ఇళ్ళు భూములు క్రయవిక్రయాలకు, రిజిస్ట్రేషన్లకు ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

LEAVE A RESPONSE