Suryaa.co.in

Andhra Pradesh

వంశీని ఏ మొహం పెట్టుకుని పరామర్శిస్తావ్ జగన్ రెడ్డి?

– మాజీ సీఎంకు ప్రశ్నలు సంధించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్

మంగళగిరి : జైలులో ఉన్న దళిత వ్యతిరేకి, మహిళా ద్రోహి వంశీని పరామర్శించేందుకు వచ్చారా..? జగన్. దోపిడిదారుడు వంశీని ఎందుకు ములాఖత్ అయ్యారో సమాధానం చెప్పాలని మంగళవారం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన కొన్ని ప్రశ్నలను సంధించారు. దళిత ఉద్యోగి సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసి హింసించి హత్య చేస్తానని బెదిరించి ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీని దిక్కరించిన వంశీని ఏ మొహం పెట్టుకుని పరామర్శిస్తావ్ జగన్ రెడ్డి.. నీకు దళితుల కన్నా నేరస్తుడు ఎక్కువైపోయాడా..?

ప్రజాస్వౌమ్య దేవాలయం అసెంబ్లీలోనే దుశ్యాసునిలాగా మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచిన నేరస్తుడిని ఏరకంగా పరామర్శిస్తావ్ జగన్ రెడ్డి..? మహిళల వ్యక్తిత్వం కన్నా నేరస్థుడు వంశీ ఎక్కువైపోయాడా..? గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని నిలువున తగలబెట్టించి గన్నవరం మహిళ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టించి వారాల తరబడి హింసించిన వంశీని ఎలా పరామర్శిస్తావ్ జగన్ రెడ్డి..? తల్లి, చెల్లిపై అసభ్యకరంగా పోస్టులు పెట్టించిన మీకు.. ఇతర మహిళలపైన గౌరవం ఉంటుందా..? సంకల్ప సిద్ధి చిట్స్ ఫండ్స్ 16 వేల మంది కుటుంబాలను రోడ్డున పడేసిన వంశీని ఎలా పరామర్శిస్తావ్ జగన్ రెడ్డి..? పట్టిసీమ గట్టు మట్టిని అక్రమంగా తరలించి రైతుల ద్రోహిని ఎలా పరామర్శిస్తావ్ జగన్ రెడ్డి..?

గన్నవరం నియోజకవర్గం ప్రజలకు 11 వేల దొంగ ఇళ్ల పట్టాలు ఇచ్చి సొంత ఇంటి కలను దూరం చేసిన వంశీని ఏవిధంగా మద్దతు పలుకుతావ్ జగన్ రెడ్డి..? బాపులపాడు, గన్నవరం, మండవల్లి ప్రాంతాల్లో చెరువులను, కొండలను అక్రమంగా తవ్వించి అమ్ముకున్న గ్రావెల్స్ మాఫియా వంశీకి జగన్ మద్దతు ఎలా మద్దతు ఇస్తాడు..? ఎయిర్ పోర్టు భూములను సైతం కబ్జా చేసిన వంశీని ఎందుకు కలుస్తున్నారో అత్మపరిశీలన చేసుకో జగన్ రెడ్డి.. విజయవాడ రూరల్ మండలంలో ఉన్న 9 గ్రామాల్లో ఒక్క లే అవుట్ లో కూడా కామన్ సైట్‌ను కబ్జా చేసిన వంశీని ఎందుకు పరామర్శిస్తున్నావ్ జగన్ రెడ్డి..?

LEAVE A RESPONSE