Suryaa.co.in

Andhra Pradesh

ఒట్టి మాటలు కాదు.. ఆధారాలతో రా..

-మంత్రి రోజాకు ట్విట్టర్లో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ సవాల్

మేము మా ప్రభుత్వంలో రాష్ట్రానికి తెచ్చిన కంపెనీలు అన్నీ జీవో లతో సహా ఉన్నాయి. మా ప్రభుత్వంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి అనేది, మంత్రిగా ఉన్నప్పుడు మీ పార్టీ నేత స్వర్గీయ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. మేము అన్ని జీఓ కాపీలతో, గౌతమ్ రెడ్డి గారి అసెంబ్లీ సమాధానం కాపీతో వస్తాము. గత ప్రభుత్వంతో అస్సలు సంబంధం లేకుండా, ఈ ప్రభుత్వంలో మీరు సొంతగా తీసుకు వచ్చిన కంపెనీల జీఓ కాపీలు, కల్పించిన ఉద్యోగాల వివరాలతో రోజా బహిరంగ చర్చకు రావాలి. జీఓ ల చర్చ వచ్చింది కాబట్టి అడుగుతున్నాము, ఈ ప్రభుత్వం అన్ని శాఖల జీఓ లను ఎందుకు దాస్తుంది? పారదర్శకంగా ప్రజలకు అందుబాటులో ఎందుకు ఉంచట్లేదు? స్కాం లు ఏవైనా బయట పడతాయి అని జీఓ లు అన్నీ దాస్తున్నారా?

LEAVE A RESPONSE