– ఏబీవీ రిటైర్మెంట్ కు ఇంకా 4 రోజులే సమయం
– ఏబీ వెంకటేశ్వరరావు పోస్టింగ్ పై ఉత్కంఠ
(అన్వేష్)
సీనియర్ ఐపీఎస్ ఏబీవీ రిటైర్మెంట్ కు ఇంకా 4 రోజులే సమయం ఉంది. పోస్టింగ్ లో ఉండి రిటైర్మెంట్ తీసుకోవాలన్న పట్టుదలతో సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు పోరాడుతున్నారు. ఏబీవీ సస్పెన్షన్ రద్దు చేస్తూ ఈ నెల 8న క్యాట్ తీర్పు ఇచ్చింది. క్యాట్ తీర్పు తర్వాత కూడా ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వలేదు. క్యాట్ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు వెళ్ళింది. కోర్టులో 4 రోజుల క్రితం ఇరు వర్గాల వాదనలు పూర్తయ్యాయి. తీర్పును రిజర్వ్ చేసిన ద్విసభ్య ధర్మాసనం. ప్రభుత్వ తదుపరి చర్యలపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతుంది. ఏబీవీకి పోస్టింగ్ పై పౌరసమాజం నుంచి భారీ మద్దతు కనిపిస్తుంది.
మరి హైకోర్టు రిజర్వు చేసిన తీర్పును ఎప్పుడు ఇస్తుంది? ఆయన రిటైర్మెంట్‌కు ఒక రోజు ముందా? లేక అదే రోజు ఇచ్చి, సాయంత్రానికి రిటైరయ్యే అవకాశం ఇస్తుందా? ఇదీ ఇప్పుడు సోషల్‌మీడియాలో హాట్ టాపిక్. నిజానికిది ఏ అధికారికీ రాకూడదని ఇబ్బంది. ఒక వ్యక్తిపై రాజ్యం కక్ష సాధించాలనుకుంటే ఎంత కఠినంగా వ్యవ హరిస్తుందనడానికి ఇదో నిదర్శనం. ప్రజాస్వామ్యదేశంలో ఒక సీనియర్ ఐపిఎస్ అధికారికే సత్వర న్యాయం జరగకుండా.. ఏళ్ల తరబడి ఒక కేసు నాన్చితే.. ఇక సామాన్యుల సంగతేమిటన్నది పౌరసమాజం సంధిస్తున్న ప్రశ్న.
హైకోర్టు, సుప్రీంకోర్టు, మధ్యలో క్యాట్ చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు. అన్నిచోట్లా తీర్పులు ఆయనకు అనుకూలంగానే వచ్చాయి. ఇన్ని సంవత్సరాలు ఆయనను సస్పెండ్ చేసి వికృతానందం పొందిన జగన్ సర్కారు.. ఏ ఒక్క కోర్టులోనూ ఆయనకు వ్యతిరేకంగా, చిన్న కాగితం ముక్కను కూడా సాక్ష్యంగాచూపలేకపోయింది. ‘నేరం రుజువయ్యేవరకూ సస్పెండ్ చేసే విచక్షాధికారం ప్రభుత్వానికి ఉంద’న్న వాదనే పై నుంచి కింది కోర్టు వరకూ వినిపించింది. అన్ని చోట్లా అదే ఆవు కథ!