Home » కుప్పం పౌల్ట్రీ ఫారంలో 3600 కోళ్లు అగ్నికి ఆహుతి

కుప్పం పౌల్ట్రీ ఫారంలో 3600 కోళ్లు అగ్నికి ఆహుతి

కుప్పం: చిత్తూరు జిల్లా కుప్పం సరిహద్దులోని తమిళనాడు రాష్ట్రం వానియంబడి సమీపంలో ఆదివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వానియంబడీకి చెందిన రమేష్ తన వ్యవసాయ పొలం వద్ద పౌల్ట్రీ ఫారం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. పది రోజుల క్రితం రమేష్ 3600 కోళ్లను కొనుగోలు చేశాడు. కాగా ఆదివారం ఒక్కసారిగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో పౌల్ట్రీ ఫారం చుట్టూ మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో పౌల్ట్రీ ఫారం లోని 3600 కోళ్లు ఆగ్నికి ఆవుతవగా సుమారు మూడు గంటలసేపు అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలను అదుపు చేశారు.

Leave a Reply