Home » ఢిల్లీ బాద్‌ షా ఎవరు?

ఢిల్లీ బాద్‌ షా ఎవరు?

కేంద్రంలో అధికారం ఎవరి వైపు?

కేంద్రంలో భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ వస్తుందా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి వస్తుందా అనేది ఒక చర్చ. గత ఎన్నికల్లో భాజపాకు 303 సీట్లతో సంపూర్ణ మెజారిటీ వస్తే కాంగ్రెస్ పార్టీకి 52 సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఓటు శాతం చూసినా భాజపాలో సగం మాత్రమే. ఈసారి కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి రావాలి అంటే కాంగ్రెస్ భారీగా సీట్లు ఓట్లు పుంజుకోవాలి భాజపా ఆమేరకు ఓట్లు సీట్లు నష్టపోవాలి. ఇది ఏమేరకు సాధ్యం అని చూస్తే..

దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో భాజపా కాంగ్రెస్ మధ్య పోటీ ఉన్నది కేవలం 11 అందులో 5 పెద్ద రాష్ట్రాలు 6 చిన్న రాష్ట్రాలు మిగతా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు.

మహారాష్ట్ర 23/48 మధ్యప్రదేశ్ 28/29 కర్ణాటక 25/28 గుజరాత్ 26/26 రాజస్థాన్ 24/25 మొత్తం 156 స్థానాలల్లో 2019 ఎన్నికల్లో భాజపా 126 సీట్లు‌ మహారాష్ట్ర శివసేన (18) తో కలిసి 144/156

ఛత్తీస్గఢ్ 9/11 హర్యానా 10/10 ఉత్తరాఖండ్ 5/5 హిమాచల్ ప్రదేశ్ 4/4 గోవా 1/2 మణిపూర్ 1/2 మొత్తం 34 స్థానాల్లో భాజపా సొంతంగా 31 సీట్లు.

భాజపా కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఉన్న ఈ రాష్ట్రాల్లో మొత్తం 190 సీట్లలో భాజపా సొంతంగా 157 శివసేన తో కలిసి 175 సీట్లు సాధించి. ఇండి రావాలి అంటే ముందుగా కాంగ్రెస్ భారీ సీట్లు సాధించి భాజపా భారీగా నష్టపోవాలి. ఇది సాధ్యమేనా అనేది ప్రధమ ప్రశ్న.

ఆ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలలో భాజపా కాంగ్రెస్ మధ్య పోటాపోటీగా ఉన్నా పార్లమెంటు ఎన్నికలకు వచ్చేసరికి జనం మోది వైపు మొగ్గు చూపారు. ఇది కాంగ్రెస్ కి సవాల్.

పై రాష్ట్రాలలో భాజపా ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉన్నది కేవలం మహారాష్ట్రలో మాత్రమే అక్కడ శివసేన పొత్తు ఇప్పుడు లేదు అలా అని ఆ మేరకు కాంగ్రెస్ సొంతంగా లాభపడే అవకాశం కూడా తక్కువ.

భాజపా కాంగ్రెస్ మధ్య పోటీ ఉన్న 11 రాష్ట్రాలలో 190 సీట్లు కాకుండా భాజపా ఇతర పార్టీల మధ్య కాంగ్రెస్ ఇతర పార్టీల మధ్య పోటీ ఉన్న రాష్ట్రాలు చూస్తే..

భాజపా ఇతర పార్టీల మధ్య పోటీ ఉన్న రాష్ట్రాలు చూస్తే..
యూపీ 62/80 లో ఎస్పీ పశ్చిమ బెంగాల్ 18/42 లో టిఎంసీ తో పోటీ. 2019 లో ఈ రెండు రాష్ట్రాల్లో భాజపా మొత్తం 80 సీట్లు కొల్లగొట్టింది. ఇపుడు యూపీలో ఎస్పీ కాంగ్రెస్ పొత్తు వలన భాజపా నష్టపోయినా కాంగ్రెస్ పార్టీకి లబ్ది లేదు. కారణం కాంగ్రెస్ పోటీ చేసేది కేవలం 17 సీట్లు. పశ్చిమ బెంగాల్ లో భాజపాకు సీట్లు పెరగొచ్చు. బీహార్ (40) లో జెడీయు(17) తో కలిసి పోటీ చేసి 22 మొత్తం 39/40 సీట్లు భాజపా సాధించింది అయితే ఈసారి నితీష్ విశ్వసనీయత కోల్పోవడం వలన అక్కడ నష్టపోవచ్చు. ఇక్కడ కూడా కాంగ్రెస్ కి అదనపు లాభం లేదు.

కాంగ్రెస్ ఇతర పార్టీల మధ్య పోటీ ఉన్న రాష్ట్రాలు చూస్తే..
పంజాబ్ (13) కేరళ(20) మాత్రమే ఇక్కడ కూడా కాంగ్రెస్ పొత్తు తో కలిసి 2019 లో 23/28 ఇపుడు అంతకన్నా కాంగ్రెస్ పార్టీకి కొత్త లబ్ది లేదు

త్రిముఖ పోటీ ఉన్న రాష్ట్రాలు చూస్తే ఒరిస్సా (21) తెలంగాణ (17) అస్సాం (14) ఢిల్లీ(7). మొత్తం 59 2019 లో భాజపా 28 సీట్లు కాంగ్రెస్ 10 సీట్లు. తెలంగాణలో భాజపా కాంగ్రెస్ రెండూ సీట్లు పెంచుకుంటాయి. ఢిల్లీలో భాజపా నష్టపోతే ఒరిస్సా లో పెరగొచ్చు అస్సాంలో కాంగ్రెస్ లబ్ది ఉండే అవకాశం అధికంగా 5.

తమిళనాడు(38) లో కాంగ్రెస్ పార్టీ(8) ఇంతకన్నా అదనపు లబ్ది 1-3 ఉన్నా ఆంధ్రప్రదేశ్ (25)లో భాజపా 1-3 లాభం ఉండొచ్చు.

మిగిలిన 14 చిన్న రాష్ట్రాలు + కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నవి కేవలం 19 సీట్లు. వీటిలో అటు భాజపా ఇటు కాంగ్రెస్ పార్టీలకు పెద్దగా ఒరిగేది లేదు పెద్దగా పోయేది లేదు.

దక్షిణ భారతదేశంలో భాజపాకు కర్ణాటకలో ఎక్కువ నష్టం జరిగినా అదే దక్షిణ భారతదేశంలో తెలంగాణ ఒరిస్సా ఆంధ్ర ద్వారా భర్తీ అయ్యే అవకాశం ఉంది.

భాజపా నష్టపోయి కాంగ్రెస్ ఎక్కువ లబ్దిపొందే అవకాశం ఉండేది – ఆ రెండు పార్టీల మధ్య పోటీ ఉన్న 11 రాష్ట్రాలలో మాత్రమే. అక్కడ భాజపా 50 నష్టపోయి కాంగ్రెస్ 50 లాభం కలిగినా కాంగ్రెస్ పార్టీకి మొత్తం దక్కేది అధికంగా 100-110. మరోవైపు భాజపా 303 లో అధికంగా 50 యూపీ బీహార్ లో మరో 20 నష్టపోయినా కనీసం దక్కేది 230. It’s extreme case. రాజ్యాంగం ప్రకారం అధిక సీట్లు దక్కించుకున్న పార్టీకి మాత్రమే ప్రభుత్వ ఏర్పాటుకి అవకాశం ఉంటుంది అని మరువకూడదు.

కాంగ్రెస్ అధికారంలో రావాలి అనుకోవడం కల!
కాంగ్రెస్ అధికారంలోకి రావడం కల్ల!!

Leave a Reply