Suryaa.co.in

Features

పేపరే పెప్పర్..!

పొద్దున్నే వచ్చినా
తలుపు తట్టని అతిథి..
చూసుకోడు ఏ తిథి..
వానొచ్చినా..
హుదూదే ముంచినా..
కరోనా కష్టమైనా..
విసిరేయడంలో పేపర్
అతడు టాపర్!
పొద్దున్నే నీ కోసం ఎదురుచూపులు..
నువ్వెలా పోయినా
పేపర్ ఇచ్చేస్తే చాలు!

గతంలో ఆరోజు సంచలనం గురించి అరుస్తూ సేల్..
ఇప్పుడు సెల్లు వచ్చాక
అతడితో పాటు
అందరి బతుకులూ
గోల్ మాల్..!
సెల్లులో సగం ఫ్లాషులు
ట్రాషులే!

తెల్లారే కట్టలు చేతబట్టి
అవసరమైతే రబ్బర్ చుట్టి…
విసిరితే గురి తప్పడు..
ఒక్కో రోజు రాకపోయినా ఎందుకో చెప్పడు..!
పార్ట్ టైం జాబ్..
వేన్నీళ్లకి చన్నీళ్ళు..
ఉండదు సైడ్ ఇన్కమ్..
పొద్దున్నే ఎవడూ
చెప్పడు వెల్కమ్..
అయినా తన పని తాను. చేసుకుపోయే రుషి..
సగటు మనిషి..
ఒక్కటే అడ్వాంటేజ్..
ఏజ్ తో సంబంధం లేకుండా
ఎప్పటికీ పేపర్ బాయే..!

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

LEAVE A RESPONSE