చేదు నిజం క్షమించండి.
తక్కువ బట్టలు వేసుకునే అమ్మాయిలకు, ఒక తండ్రి నుండి వారికి అంకితం:
ఒక అమ్మాయికి… ఆమె తండ్రి ఐఫోన్ బహుమతిగా ఇచ్చాడు.
ఒకరోజు తండ్రి ఆ అమ్మాయిని అడిగాడు.
ఐఫోన్ తెచ్చుకున్న తర్వాత నువ్వు మొదట ఏం చేశావు..?
అమ్మాయి : నాన్న నేను స్క్రాచ్ గార్డ్ , కవర్ ఆర్డర్ చేసాను.
తండ్రి : ఇలా చేయమని ఎవరైనా బలవంతం చేసారా…?
అమ్మాయి : ఎవరూ లేరు
తండ్రి : ఐఫోన్ తయారీదారుని అవమానించినట్లు అనిపించలేదా..?
కుమార్తె : లేదు, కానీ తయారీదారు స్వయంగా కవర్ , స్క్రాచ్ గార్డును వేసుకోమని సలహా ఇచ్చాడు.
తండ్రి : సరే ఐతే ఐఫోన్ కూడా చెడ్డగా కనబడుతోంది, అందుకే దానికి కవర్ ఆర్డర్ చేశావా..?
అమ్మాయి : లేదు, అది చెడిపోకూడదు, అందుకే కవర్ ఆర్డర్ చేసాను..
తండ్రి : కవర్ వేశాక దాని అందం తగ్గిందా..?
అమ్మాయి : లేదు, దానికి కవర్ వేసిన తర్వాత ఐఫోన్ మరింత అందంగా కనిపిస్తుంది.
తండ్రి ఆప్యాయంగా కూతురి వైపు చూస్తూ ఇలా అన్నాడు….
అమ్మా ఒక మొబైల్ ఫోన్ కాలపరిమితి సుమారు మూడు నుండి నాలుగు సంవత్సరాలు. అది ఎలా ఉన్నా పని చేస్తుంది. కానీ కవర్ వేసుకోమని నిన్ను ఎవ్వరు బలవంతపెట్టలేదు.పైగా కవర్ వేయడం వల్ల అది ఇంకా అందంగా కనిపిస్తుంది.ఇంకా ఎక్కువ రోజులు మన్నికగా ఉంటుంది.
కాబట్టి దానికి శ్రద్దగా స్క్రీన్ గార్డ్ వేసి కవర్ వేసి జాగ్రత్తగా ఉంచావు కదా?
మరి నీ శరీరం ఐఫోన్ కంటే విలువైనది, మరియు అందమైనది.
ఐ ఫోన్ కాదు ఈ ప్రపంచంలో ప్రతి ఆడపిల్లకి అన్నిటికంటే ఎక్కువ తన శరీరం, తన అందం.
అలాగే ఆడపిల్ల ఇంటికి గౌరవం.
నిండుగా బట్టలు ధరించడం వలన ఆడపిల్ల శరీర భాగాలను బట్టలతో కప్పడం వల్ల ఆమె అందం పెరుగుతుంది. తగ్గదు తల్లి అన్నాడు.
అంతే దీనికి తండ్రి ముందు కన్నీళ్లు తప్ప ఆ కూతురి వద్ద సమాధానం లేదు.
బాలికలకు వినయపూర్వకమైన విన్నపం – భారతీయ సంస్కృతి, విలువలు మరియు గుర్తింపును కాపాడుకోండి…
ఏదైనా పొరపాటు ఉంటే మన్నించండి.
అందంగా రక రకాల జడలతో అలంకరించుకునే జుట్టును పాశ్చాత్య ధోరణి భ్రమలో పడి విరబోసుకుని తిరుగుతున్నారు. జుట్టు విరబోసుకుని తిరిగేవి దయ్యాలు మాత్రమే.ఆ విషయం ఎవ్వరూ ఈ చిన్నారి తల్లులకు అర్థమయ్యే విధంగా చెప్పడం లేదు.వారి కాలేజీ లలో ఈ విషయాలు చెప్పరు.
కనుక ఓ బంగారు తల్లులారా మీరు హిందూ సంస్కృతికి ప్రతినిధులు.కనుక దయచేసి హిందూ సంస్కృతిని ప్రపంచానికి తెలియజేయడానికి ప్రయత్నించండి.పాశ్చాత్యులు మన హిందూ సంస్కృతిని నేర్చుకుంటున్నారు.
గమనించండి.
ఆలోచించండి.ఆలోచించండి.
శుభం భూయత్…
– రాంకర్రి జ్ఞాన కేంద్ర
www.ramkarri.org
8096339900