పట్టభద్రుల యం ఎల్ సి ఓటరు నమోదు కార్యక్రమం లో పాల్గొనాలని రాజోలు శాసన సభ్యులు దేవ వరప్రసాద్, పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధుర్, ఉత్తరాంద్ర యం ఎల్ సి వేపాడ చిరంజీవి లు పిలుపునిచ్చారు.
ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లా ల పట్టభద్రుల శాసన మండలి సభ్యునిగా పేరాబత్తుల రాజశేఖర్ ను చంద్రబాబు నాయుడు ప్రకటించడం చాలా సంతోషం అన్నారు. రాజోలు నియోజకవర్గం లో భారీగా ఓటర్లను చేర్చాలని యన్ డి ఎ నాయకులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమం లో మాజీ శాసనసభ్యులు మానేపల్లి అయ్యాజీ వేమా, నియోజకవర్గ పరిశీలకులు చిటికెల రామ్మోహన్ రావు, మార్క్ పెడ్ రాష్ట్ర డైరెక్టర్ గుండుబోగుల పెద్దకాపు, మంగెన భూదేవి, అడబాల యుగంధర్, ముప్పర్తి నాని, చాగంటి స్వామి, మొల్లేటి శ్రీనివాస్, బందెల పద్మ, తాడి సత్యనారాయణ, వర్ధినీడి బాబ్జి, రాపాక నవరత్నం, మల్లిపూడి సత్తిబాబు, సూరిశెట్టి శ్రీనివాస్, గుబ్బల ఫణి కుమార్, దొడ్డ జయరాం తదితరులు పాల్గొన్నారు.