-జగన్ రెడ్డి వైజాగ్ పర్యటనకు స్కూల్ బస్సుల కోసం 31 స్కూల్స్ 6 కాలేజీలకు సెలవులు ఇవ్వడం దారుణం
-సీఎం పర్యటన కోసం విద్యా సంస్థల వాహనాల చోరీ – అధికారులు నిబంధనలు ఉల్లంఘన
-14-7-2022న కలెక్టర్ ఆదేశాలతో లిఖితపూర్వకంగా బస్సుల చోరీకి ఆదేశాలివ్వడం అత్యంత దుర్మార్గం
-ఇప్పటికే 8వేల ప్రభుత్వ స్కూళ్లను మూసేసి లక్షలాది మంది విద్యార్థులను విద్యకు దూరం చేసిన జగన్ రెడ్డి, నేడు ప్రైవేటు పాఠశాలలను కూడా వదలడం లేదు
-జగన్ రెడ్డి బయటకు వస్తుంటే జనాలు భయటకు రావద్దంటూ ఆంక్షలు
-వాహన మిత్ర పేరుతో ఇచ్చేది రూ.10వేలు దోచేది రూ. లక్ష
– తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం
జగన్ సర్కార్ అధికార దుర్వినియోగం, బరితెగింపు రోజురోజుకూ మితిమీరుతోంది, పరాకాష్టకు చేరుతోంది. ప్రభుత్వ కార్యక్రమాలకు, వాళ్ల సొంతపార్టీ కార్యక్రమాలకు పెద్దఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడడం, సామాన్యులను ఇబ్బందులకు గురిచేయడం, సమాజంలోని వివిధ వర్గాల ప్రజలపై భారాలు మోపడం, వారి ఆస్తులు, పరికరాలను బలవంతంగా గుంజుకోవడం వంటివి సర్వ సాధారణంగా చూస్తున్నాం.
గత చరిత్రలో ఏనాడూ ప్రభుత్వం వైపు నుండి ఇంత బరితెగింపును చూడలేదు. ముఖ్యమంత్రి పర్యటన ఉందంటే చాలు అధికారులు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు. ఒంగోలులో ముఖ్యమంత్రి పర్యటన ఉన్న సమయంలో ఒక కుటుంబం ప్రయాణిస్తున్న కారును సీఎం కాన్వాయ్ కోసం బలవంతంగా లాక్కున్నారు. నేడు సీఎం ఎక్కడికి వెళ్లినా కిలోమీటర్ల కొద్దీ బారికేడ్లు కడుతున్నారు, పరదాలు కప్పేస్తున్నారు. ప్రజల మొఖం చూడడం సీఎంకు ఇష్టంలేకనే పరదాలు కట్టించుకుంటూ తప్పించుకుంటూ తిరుగుతున్నారు.
పరదా సీఎంగా జగన్ రెడ్డి మారారు. చివరికి సొంత నియోజకవర్గం పులివెందుల వెళ్లడానికి కూడా దొంగలా పరదాలు చాటున వెళ్లే పరిస్థితికి సీఎం సిగ్గుపడాలి. ఇటువంటి వాళ్లు రానున్న ఎన్నకల్లో 175నియోజకవర్గాలు గెలుస్తారా? ముఖ్యమంత్రి విశాఖలో వాహనమిత్ర పథకానికి బోగస్ బటన్ నొక్కడానికి నేడు వెళ్లిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. వాహనమిత్ర పథకానికి రూ.261 కోట్లు 2.61లక్షల మందికి పంపిణీ చేస్తున్నామని పేపర్లలో ప్రకటనలు ఇచ్చారు. కానీ నేడు రాష్ట్రంలో 8.20లక్షలు పైబడి ఆటోలు, ట్యాక్సీ క్యాబ్ లు మొదలగు వాహన యజమానులు ఉంటే నేడు కేవలం 2.61లక్షల మందికి అంటే కనీసం 30 శాతం మందికి కూడా వాహన మిత్ర పథకం అమలుచేయడం లేదు.
అటువంటి ఉత్తుత్తి పథకం కోసం విశాఖలో నేడు కర్ఫ్యూ వాతావరణాన్ని విధించారు. అధికారులు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలకు ఐఎఎస్ అధికారి నుండి డీఈఓ వరకు గంగిరెద్దుల్లా తలూపి, విద్యార్థులను పాఠశాలలకు దూరం చేశారు. విశాఖపట్నంలోని 31 స్కూళ్లు, 6 కాలేజీలకు బలవంతంగా సెలవులు ఇచ్చి, వాటి బస్సులన్నీ ఇచ్చేయాలని అధికారులు లిఖిత పూర్వక ఆదేశాలివ్వడం దేశ చరిత్రలోనే ప్రప్రథమం, అత్యంత దుర్మార్గం. గత ప్రభుత్వాలలో ఎన్నడూ ముఖ్యమంత్రి కార్యక్రమం సందర్భంగా స్కూళ్లు మూసిన దాఖలాలు లేవు.
వైసీపీ ప్లీనరీ కోసం పెద్దఎత్తున స్కూళ్లు, కాలేజీ యాజమాన్యాలను ఆర్టీఓలు బెదిరించి వేలాది బస్సులు, మినీ వ్యాన్లను లాక్కుని, వాటిలో వైసీపీ కార్యకర్తలను బిర్యానీలు పెట్టించి తరలించడాన్ని కొద్ది రోజుల క్రితం చూశాం. నేడు విశాఖలో వాహనమిత్ర కార్యక్రమానికి జనాభా సేకరణకు జగన్ రెడ్డి ప్రభుత్వం ఇంకొక మెట్టు పైకెక్కి కలెక్టర్, డీటీసీ, డీఈఓలపై ఒత్తిడి పెంచిమరీ వారితో స్కూళ్ల యాజమాన్యాలకు ఆర్డర్లు ఇప్పించ్చి, సీఎం పర్యటనకు స్కూల్ బస్సులు కావాలి, స్కూళ్లు అన్నీ మూసేయాలని వాటిలో పేర్కొన్నారు.
13-7-2022న “Government of Andhrapradesh Transpoft Departmnent, G.C.RajaRatnam, Deputy Transport Commissioner, Visakhapatnam వారి నుండి డీఈఓ కు లేఖ రాశారు. దానిలో Subject: VVIPs-Visit of Hounourable Chief Minister Sri YS JaganMohanReddy for launching of YSR Vahana Mitra on 15-07-2022-With reference to the subject and reference above cited, It is to inform you that we are procuring buses from the private schools for the vahan mitra programme which is being launching by Honourable Chief Minister on 15-07-2022 at Andhra University, Engineering Grounds, Visakhapatnam. In this regard, it is requested to declare holiday for the following schools” అని పేర్కొంటూ 31స్కూళ్లు, 6 కాలేజీల జాబితాను దానిలో పొందుపర్చారు. ఇంత దుర్మార్గంగా ముఖ్యమంత్రి కార్యక్రమం కోసం బస్సులు సేకరించడం కోసం స్కూళ్లకు, కాలేజీలకు సెలవులు ఇస్తున్నామని లిఖితపూర్వక ఆదేశాలివ్వడం ఎప్పుడైనా చూశామా?
తదుపరి దీన్ని ఆధారంగా చేసుకుని విశాఖపట్నం డీఈఓ 14-07-2022న నేరుగా స్కూళ్లు, కాలేజీ యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశారు. దానిలో “As per the instruction of the District collector Visakhapatnam local holiday is here by declared on 15-7-2022 to the following institutions”అని ఉంది. దీన్ని బట్టి స్వయంగా జిల్లా కలెక్టర్ ఆదేశాలమేరకు 31స్కూళ్లు, 6 కాలేజీలే మూసేయాలని డీఈఓ ఆదేశాలు ఇచ్చారని తేటతెల్లం అవుతోంది. జిల్లా కలెక్టర్ మిస్టర్ మల్లిఖార్జున స్కూళ్లు మూసేయాలని ఆదేశాలు ఇవ్వడం ఏంటి? ప్రభుత్వం ఏం చెబితే దానికి గంగిరెద్దులా తల ఊపడమేనా?
చట్టబద్దంగా వ్యవహరించడం మీకు తెలియదా? జగన్మోహన్ రెడ్డి అనే రాక్షసుడు ఇటువంటి తప్పుడు ఆదేశాలు ఇస్తే దానికి అనుగుణంగా మీరు అధికార దుర్వినియోగానికి పాల్పడతారా?దీనికి స్కూలు పిల్లలు బలవ్వాలా, స్కూలు బస్సులు దొంగతనం చేస్తారా? జగన్ రెడ్డి కార్యక్రమానికి జనాన్ని తరలించడానికి స్కూళ్లను మూసేసిన మీరు, విద్యా వ్యవస్థను ఎలా బాగుచేస్తామంటే ప్రజలు నమ్మాలా?
పిల్లల తల్లిదండ్రులకు స్కూల్ యాజమాన్యం పంపిన మెసేజ్ లలో “Dear Parents in view of the launch of YSR Vahana Mithra on 15.07.2022 and as directed by District Collector viskhapatnam, kindly note tomorrow is declared as holyday for LKG to 10th section” అని ఉంది. విద్యా వ్యవస్థను సమూలంగా మార్పు చేయడమంటే ఇదేనా ద గ్రేట్ జగన్ రెడ్డి? పర్యటన కోసం విశాఖ పట్టణంలో 31 పాఠశాలలు, 6 కాలేజీలను బలవంతంగా మూయించారు. ఈయన మేనమామ కాదు కంసమామ. మేనమామ అయితే పిల్లలను పాఠాలకు దూరం చేస్తావా? రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్ధులకు చదువుకు దూరం చేసి క్షోభకు గురిచేస్తున్నావు. పాఠశాలల విలీనం పేరుతో లక్షల మంది విద్యార్ధులను రోడ్డున పడేస్తున్నారు.
ఇప్పటికే 8వేల ప్రభుత్వ పాఠశాలలను మూయించారు. బస్సుల కోసం స్కూల్ యాజమాన్యంపై రౌడియిజం చేయడమేనా విద్యా వ్యవస్థను బాగు చేయడమంటే? ఇక రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి పర్యటన కోసం స్కూల్ బల్లలు, కుర్చీలు, ఫ్యాన్లు, కూలర్లు వంటివి కూడా కావాలి కాబట్టి స్కూల్స్ మూసేసి అవన్నీ కావాలని కూడా ఆదేశాలిచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దేశంలో ఏ ప్రభుత్వం అయినా ఈరకమైన బరితెగింపుకు పాల్పడిందా? అని రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. ఒక ముఖ్యమంత్రి బయటకు వస్తే రోడ్లన్ని నిర్మానుషం అవ్వాలి. బారికేడ్లు, పరదాలు కట్టాలి. ఆయన వస్తుంటే అందరూ ఇళ్లల్లో ఉండాలి, దుకాణాలన్నీ మూసేయాలి. చివరకు విద్యార్థులను స్కూళ్లు మాన్పించి ఇళ్లలో కూర్చోబెడుతున్నారు.
జనం బయటకు రావడం జగన్ రెడ్డికి ఇష్టం లేదు. ఇటువంటి దిక్కుమాలిన పనులు చేస్తూ 175 సీట్లు రావాలని చెప్పడం హాస్యాస్యపదం. ఆఖరికి జగన్ రెడ్డి తన సొంత నియోజకవర్గం పులివెందులకు వెళ్లినా ఇదే పరదాలు, బారికేడ్ల దర్శనమిస్తాయి.
విద్యార్ధుల జీవితాలను నేడు విశాఖ కలెక్టర్ ఇచ్చినటువంటి ఆదేశాలతో పూర్తిగా అంథకారంలో నెట్టేస్తున్నారు. నాడు నేడు పేరుతో వేల కోట్ల అవినీతి ఇప్పటికే బట్టబయలైంది. ప్రపంచ బ్యాంక్ నుంచి రూ.2వేల కోట్ల రుణం కోసం కక్కుర్తిపడి ఉపాధ్యాయ వ్యవస్థను, విద్యావ్యవస్థను నాశనం చేశారు. మొన్నటి వరకు ప్రభుత్వ మీటింగ్ లకు ఏదైనా కావాలంటే మౌఖికంగా అడిగి తెప్పించుకునేవారు కాని నేడు నేరుగా బరితెగించి లిఖితపూర్వక ఆదేశాలివ్వడం విడ్డూరంగా ఉంది. పాఠశాలలను తమ ఇష్టానుసారం మూయించే హక్కు జగన్ రెడ్డికి, అతని కింద తొత్తుల్లా పనిచేసే అధికారులకు ఎవరిచ్చారు? To procure busses from private schools for Hon’ble CM program we are declaring holiday. అంటూ జనగ్ సర్కార్ ఆదేశాలివ్వడం సిగ్గుచేటు. నాయకులు ఏదో చెప్పారని ఇలాంటి చట్టవిరుద్ద ఆదేశాలు అధికారులు ఇవ్వడం దౌర్బాగ్యం.
ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడానికి అధికారులు తమశక్తిని వాడాలి గాని, ఇలాంటి పనికి మాలిన ఆదేశాలిచ్చి మరింత చులకన కావొద్దు. ముఖ్యమంత్రి ఎంత బరితెగించి ప్రవర్తిస్తున్నారో, అధికారాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేస్తున్నారో, విద్యా వ్యవస్థను ఏ విధంగా బ్రష్టుపట్టించారో ప్రజలందరూ గమనించాలి. ప్రజలకు ఎప్పుడు అవకాశం వచ్చినా ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పాలని కోరుతున్నాను.
నేడు పెట్రోల్, డీజీల్ ధరల్లో టాప్ లో మనమే ఉన్నాం. అదనపు వ్యాట్, రోడ్ సెస్ పేరుతో వేల రూపాయలు ప్రతి వాహన యజమాని నుండి దోచుకుంటూ పైసా కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించకుండా నేడు వాహనమిత్ర పథకం గురించి ఎలా డప్పు కొట్టుకుంటారు? ఒక చేత్తో రూ.10వేలు ఇస్తూ, మరో చేత్తో పెట్రోల్, డీజిల్ ధరల బాదుడుతో కనీసం సంవత్సరానికి రూ.50వేలు ప్రతి వాహన యజమాని నుండి దోచుకుంటున్నారు. నేడు రోడ్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. రోడ్లు బాగోలేకపోవడం వల్ల వాహనాలు నిత్యం దెబ్బతినడంతో మరమ్మతులకే ప్రతి సంవత్సరం ప్రతి యజమాని హీనపక్షంగా రూ.30వేలు ఖర్చు చేయాల్సివస్తోంది.
ఇవి చాలవన్నట్లు వాహనాలపై వివిధ ఫైన్ల రూపంలో ప్రతి వాహన యజమాని నుండి కనీసంగా ప్రతి ఏడాది రూ.20వేలు రౌడీ వసూళ్లు చేస్తున్నారు. ఇలా ఒక్కో వాహనదారుడి నుంచి వేర్వేరు రూపాల్లో ఏడాదికి లక్ష రూపాయల వరకు దోచుకుంటూ నేడు కంటితుడుపు చర్యగా కేవలం రూ.10వేలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. రవాణా రంగాన్ని అష్టకష్టాల పాలు చేస్తున్నారు.ఇటువంటి పనికిమాలిన కార్యక్రమం కోసం నేడు విశాఖలో స్కూళ్లు,కాలేజీలు మూయించి విద్యార్థులను ఇబ్బందులకు గురిచేశారు.