– మూడేళ్లలో ఖర్చుచేసింది 10శాతం నిధులు… ఇలాగైతే ఇళ్లు పూర్తిచేసేదిదెప్పుడు?
– జగన్ రెడ్డి ఏలుబడిలో ఇళ్ల నిర్మాణం పడకేసిన మాట అక్షర సత్యం
– ఇసుక కూడా సరఫరా చేయకుండా ఇళ్లు నిర్మిస్తామని చెబుతారా?
• అప్పటి హౌసింగ్ మినిస్టర్ గా ఉన్న రంగనాధరాజు 2014-19వరకు టిడిపి హయాంలో రాష్ట్రంలో 7,82,593 గృహాలు నిర్మించినట్లు 23-11-2021న అసెంబ్లీలో ఇచ్చిన సమాధానానికి రోగి రమేష్ ఏం చెబుతారు?
• గత మూడు సంవత్సరాలుగా 2019-22 మధ్య కోవిడ్ ఉండడంవల్ల రాష్ట్రంలో జగనన్న ఇళ్లు నిర్మించలేకపోయామని జారుకునే ప్రయత్నం చేసిన మంత్రి అదే సమయంలో ఉత్తర ప్రదేశ్ 7.51లక్షలు, గుజరాత్ 3.93లక్షలు, మహారాష్ట్ర 4.25లక్షల ఇళ్లు ఏవిధంగా నిర్మించగలిగారో జవాబు చెప్పగలడా?
• రాష్ట్రంలో తొలివిడత ఇళ్ల నిర్మాణానికి 3.10 కోట్ల టన్నుల ఇసుకను ఉచితంగా సరఫరా చేస్తామని చెప్పి గత సంవత్సరం ఆఖరికి సరఫరా చేసింది కేవలం 5లక్షల 43వేల మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమేనని మీ ప్రభుత్వం ఆర్ టిఐ ద్వారా సమాధానం ఇచ్చిన మాట నిజం కాదా?
తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజం
రాష్ట్రంలో జగన్ రెడ్డి చేతగాని పాలనలో గృహనిర్మాణం పడకేసిన మాట ముమ్మాటికీ వాస్తవమని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కొద్దిరోజుల క్రితం రాష్ట్రంలో గృహ నిర్మాణాలు ఏవిధంగా పడకేశావో వివరణాత్మకంగా ప్రధాన దినపత్రికలో వచ్చిన వార్త అక్షర సత్యమని అన్నారు. విలేకరుల సమావేశంలో పట్టాభిరామ్ ఏమన్నారో ఆయన మాటల్లోనే…!
జగన్ రెడ్డి అట్టహాసంగా తొలివిడతగా ప్రారంభించిన 15 లక్షల 60 వేల ఇళ్లల్లో ఇప్పటివరకు కేవలం 60వేలు మాత్రమే పూర్తయ్యాయి. అందులో అసలు పనులే ప్రారంభం కాని ఇళ్లు 3లక్షల 8వేల 563 కాగా, పునాదులే దాటని ఇళ్లు 8,18,057. బేస్ మెట్ లెవల్ లో ఉన్నవి 2,10,646 కాగా, పూర్తయిన ఇళ్లు కేవలం 60,783 మాత్రమే. అనకాపల్లిలో కేవలం 1 శాతం, శ్రీకాకుళంలో 5, పల్నాడు లో 2, కడపలో 3 , అనంతపురంలో 3, సత్యసాయి 3 శాతం, ఎన్టీఆర్ జిల్లాలో 2, కృష్ణా జిల్లాలో 2 శాతం మాత్రమే ఇళ్లు పూర్తయ్యాయి. వాస్తవాలు జీర్ణించుకోలేక అధికారమదమనే రోగంతో “రోగి రమేష్” గా మారిన మంత్రి జోగి రమేష్ ఇష్టానుసారం మీడియా అధిపతులపై, చంద్రబాబుపై నోరు పారేసుకున్నారు. 2014-19లో చంద్రబాబు ఇళ్లనిర్మాణాలే చేపట్టలేదు, ఈ విషయం ఏ పత్రికా ప్రశ్నించలేదన్న రోగి రమేష్ వ్యాఖ్య పచ్చి అబద్దం. గత ఏడాది నవంబర్ లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మా శాసనసభ్యులు అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, రామానాయుడు తదితరులు అడిగిన ప్రశ్నకు సంబంధిత మంత్రి ఇచ్చిన సమాధానాన్ని రోగి రమేష్ చదువుకుంటే వాస్తవం తెలుస్తుంది.
2014-19 మధ్య తెలుగుదేశం హయాంలో నిర్మించిన గృహాలు
2014-15 29,342
2015-16 65,551
2016-17 52,867
2017-18 3,03,164
2018-19 3,31,669
మొత్తం 7,82,593
అప్పుడు హౌసింగ్ మినిస్టర్ గా ఉన్న రంగనాధరాజ 2014-19వరకు టిడిపి హయాంలో రాష్ట్రంలో 7,82,593 గృహాల నిర్మించినట్లు ఇచ్చిన సమాధానానికి రోగి రమేష్ ఏం చెబుతారు? గత మూడు సంవత్సరాలుగా 2019-22 మధ్య కోవిడ్ ఉండడంవల్ల రాష్ట్రంలో జగనన్న ఇళ్లు నిర్మించలేకపోయామని జారుకునే ప్రయత్నం చేసిన మంత్రి అదే సమయంలో ఉత్తర ప్రదేశ్ 7.51లక్షలు, గుజరాత్ 3.93లక్షలు, మహారాష్ట్ర 4.25లక్షల ఇళ్లు ఏవిధంగా నిర్మించగలిగారో జవాబు చెప్పగలడా?
కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి పార్లమెంటులో ఇచ్చిన సమాధానం ఆధారంగా 2019-22 నడుమ వివిధ రాష్ట్రాల్లో నిర్మించిన ఇళ్ల వివరాలు:
రాష్ట్రం మొత్తం మంజూరైన ఇళ్లు 2022 నాటికి 2019 నాటికి మూడేళ్లలో
నిర్మించిన ఇళ్లు
(2019-22)
ఉత్తరప్రదేశ్ 17,14,013 11,16,196 3,64,441 7,51,755
గుజరాత్ 10,54,790 7,49,412 3,56,088 3,93,324
మహారాష్ట్ర 16,34,553 6,80,994 2,55,227 4,25,767
ఇతర రాష్ట్రాలు కోవిడ్ ఉన్నప్పటికి లక్షలాది ఇళ్లు ఎలా నిర్మించగలిగారో చేతగాని ప్రభుత్వం, రోగి రమేష్ ఆలోచించాలి. సన్నాసి ముఖ్యమంత్రికి పేదలకు మంచి చేద్దామనే ఆలోచన లేదు. మూడు సంవత్సరాల కాలంలో అతితక్కువగా 60,783 ఇళ్లు నిర్మించడం సిగ్గుచేటు. గృహనిర్మాణాలకు మొత్తంగా 50వేల కోట్లకు పైబడి నిధులు అవసరం కాగా, గత 3 సంవత్సరాల కాలంలో కేవలం 5,800 కోట్లు మాత్రమే ఖర్చుచేసినట్లు నీ బడ్జెట్ కాగితాలు చెప్పడం లేదా? రాష్ట్రంలో తొలివిడత ఇళ్ల నిర్మాణానికి 3.10 కోట్ల టన్నుల ఇసుకను ఉచితంగా సరఫరా చేస్తామని చెప్పి గత సంవత్సరం ఆఖరికి సరఫరా చేసింది కేవలం 5లక్షల 43వేల మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమేనని మీ ప్రభుత్వం ఆర్ టిఐ ద్వారా సమాధానం ఇచ్చిన మాట నిజం కాదా?
పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా మొదటి దశలో 2022 జూన్ నాటికి 28 ,084 కోట్ల వ్యయంతో 15.60 లక్షల ఇళ్లు నిర్మిస్తామని, రెండవ దశలో 22,860 కోట్లతో 12.70లక్షల ఇళ్లు వెరసి మొత్తంగా 50,940 కోట్లు ఖర్చుతో 28.3లక్షల ఇళ్లు కట్టేస్తామని ఫుల్ పేజి ప్రకటనలు ఇచ్చారు. జగన్ రెడ్డి ప్రభుత్వంలో హౌసింగ్ కి బడ్జెట్ లో ఎంతెంత కేటాయించారో పరిశీలిస్తే…. 2019-20లో బడ్జెట్ లో కేటాయించింది కేవలం 3,617 కోట్లు, ఖర్చు చేసింది 964 కోట్లు.
2020-21లో హౌసింగ్ కి కేటాయించింది 3,691 కోట్లు… ఖర్చు చేసింది కేవలం 1141 కోట్లు. 2021-22 బడ్జెట్ కేటాయించింది 4,715 కోట్లు కాగా, ఖర్చు చేసింది కేవలం రూ. 3,786 కోట్లు. మొత్తంగా గత మూడు సంవత్సరాల కాలంలో మీ గృహ నిర్మాణ శాఖ హౌసింగ్ కి 12,023కోట్లు కాగా ఖర్చు చేసింది కేవలం 5,891 కోట్లు. బడ్జెట్ లో కేటాయించిన దాంట్లో కేవలం 49 శాతం మాత్రమే ఖర్చు చేశారు. రోడ్లకి, డ్రైనేజీకి, కరెంటుకి, మౌలిక సదుపాయాల కల్పన, ఇళ్ల నిర్మాణం వీటన్నింటికి మొత్తంగా 5,891కోట్లు. నేను చూపెట్టిన ఆధారాలు, సాక్ష్యాలు తప్పు అని నిరూపించే దమ్ము జోగి(రోగి) రమేష్ కు లేదు. సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి గత మూడు సంవత్సరాల కాలంలో గృహ నిర్మాణాలను పడకేయించారు. ఈ విషయాలను ప్రజలు అర్థం చేసుకోవాలి.జగనన్న గృహాలు 50,940 కోట్లు ఖర్చు చేసి ఇళ్లు పూర్తి చేస్తామంటున్నారు. పది శాతం కూడా ఖర్చు చేయలేదు. ఇళ్లు ఎప్పటికి పూర్తవుతాయి?
ఉచితంగా ఇసుక, సిమెంటు, ఐరన్ ఇస్తామని ఫుల్ పేజ్ యాడ్ లో తెలిపారు. 3కోట్ల 10 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక ఉచితంగా ఇచ్చి ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని యాడ్ ఇచ్చారు. సమాచార హక్కు చట్టం కింద తెప్పించిన సమాచారాన్ని పరిశీలిస్తే…. నవంబర్ 2021న ఇచ్చిన సమాచారంలో ఇప్పటి వరకు కేవలం 5లక్షల 43 వేల మెట్రిక్ టన్నుల ఇసుక సరఫరా చేశామని సమాధానం ఇచ్చారు. 3కోట్ల 10 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక ఉచితంగా ఇస్తానన్నావు. సమాచార హక్కు చట్టం సమాధానంలో మాత్రం 5లక్షల 43 వేల మెట్రిక్ టన్నులు ఇచ్చామని తెలపడం లబ్దిదారులకు మోసం చేయడమే కాదా?
ఇసుక మీద మింగడానికే సరిపోతోంది. టన్నులు టన్నులు ఇతర రాష్ట్రాలకు ఇవ్వడానికే సరిపోతోంది. జయప్రకాశ్ పవర్ వెంచర్ ను బినామీని అడ్డం పెట్టుకొని లక్షల టన్నులు మింగేస్తున్నారు. అందుకే ఇసుకాసురుడు అనే బిరుదు కూడా పొందారు. తమ సొంతింటి కల నెరవేరుతుందని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న పేదవారందరూ జగన్ చేస్తున్న మోసాన్ని అర్థం చేసుకోవాలి. పేదవారి ఇళ్ల పేరుతో వేల కోట్లు దిగమింగుతున్నారు. ఇళ్ల పట్టాల పేరుతో ఎంత దిగమింగాడో చూశాం. పనికిమాలిన స్థలాలిచ్చారు. చెరవులు, కుంటల్లో,స్మశానాల్లో, కాలువ గట్లపై కొండలపై, గుట్టలపై పనికిమాలిన స్థలాలిచ్చాడు. అక్కడ ఏ విధమైన మౌలిక సదుపాయాలు కల్పించలేదు. సేకరించిన స్థలాలకు పరిహారం రూపంలో ఎన్ని కోట్ల రూపాయలు మింగేశాడో మనం చూశాం.
పేదవాడి ఇళ్లకు నిధులు ఖర్చు చేయకుండా కేవలం 60 వేల ఇళ్లు మాత్రమే ఈ మూడు సంవత్సరాల కాలంలో పూర్తి చేసి చంద్రబాబునాయుడుపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. లేచినప్పటినుంచి చంద్రబాబునాయుడు గారిని, ఈనాడు రామోజీరావు గారిని, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారిని, టివి5 బిఆర్ నాయుడు గారిని విమర్శించడమే పనిగా పెట్టుకున్న మీమాదిరి నోరు పారేసుకుకునే అలవాటు మాకులేదు. అన్నీ వివరణాత్మకంగా సాక్షాలు, ఆధారాలతో మాట్లాడుతాం. ఇకపై మీడియా ముందుకు వచ్చేటప్పుడు ఎవరి హయాంలో ఏం చేశామో వాస్తవ గణాంకాలను పరిశీలించి జోగిరమేష్ మాట్లాడితే బాగుంటుంది. లేకపోతే ప్రజలముందు వైసిపి ప్రభుత్వం అభాసుపాలు కాకతప్పదు.